Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!
“పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ 13.11.2010 శనివారం 2 గంటలకు మహాసమాధి చెందారు” అని అదే రోజు సాయంత్రం పూల ప్రసాదరావు గారు(సాయియానాలో డయాస్ పూలు డేకరేషన్ చేసే అంకుల్) మాకు 6:30 గంటలకు ఫోన్ చేసి తెలిపారు.మరుసటిరోజు ఉదయం నలుగురం కలసి ప్రసాదరావు అంకుల్ వాళ్ల ఇంటికి వచ్చాము.
అక్కడ నుండి ఒక కారు మాట్లాడుకొని అంకుల్ వాళ్ల ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి శిరిడి బయలుదేరాము. సోమవారం ఉదయం 5 గంటలకు సాయిపథం చేరాము. ఆ తరువాత రూమ్ కి వేల్లిపోయము.
మరుసటి రోజు అనగా మంగళవారం పది గంటలకు సాయిపథంకి వచ్చి పూలు అల్లుతూ కూర్చున్నాము.
అంతలోనే ప్రసాదరావు అంకుల్ మా అందరిని పిలిచి, శ్రీ బాబూజీ పార్దివ శరీరాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్ శిరిడి పొలిమేరలకు వచ్చింది.
మనం అక్కడికి వెళ్లి అంబులెన్సు కి డెకరేషన్ చేయాలి అని కారులో పూలని, మమ్మల్ని తీసుకోని వెళ్లారు. అక్కడికి మేము వెళ్లేసరికే గురువుగారి అంబులెన్స్ వచ్చి ఉంది. మేము తొందరగా డెకరేషన్ చేస్తున్నాము.
అప్పుడు మాతో పాటు మా చిన్న బాబు ఆరు సంవత్సరాల చిరంజీవి సాయికుమార్ కూడా అంబులెన్స్ కి పూలు వేస్తూ అటు, ఇటు తిరుగుతూ ఉన్నాడు.
మాతో పాటు గురువుగారి పాపా శృతి, ఇంకా ద్వారకా అంకుల్ కొంతమదిమి కలిసి డెకరేషన్ చేశాము. ఇక అయిపొయింది బయలుదేరుదాము అనేసరికి,
ఒక కారు అంబులెన్స్ ముందు వున్న మా చిన్నబాబుని చాలా వేగంగా వచ్చి కొట్టేసింది. ఆ స్పీడుకి మా బాబు చాల దూరంలో గాల్లోకి అలా ఎగిరి పడ్డాడు.
అసలు ఎం జరిగింది అని మేము అంబులెన్స్ వెనుక నుండి వచ్చి చూసి షాకయి పోయాము. మాకు నడవటానికి కూడా శక్తీ రావడం లేదు.
వాళ్ళే మా బాబుని వాళ్లకారులో తీసుకోని శిరిడి సంస్తాన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.
మిగిలిన వాళ్ళు అంబులెన్స్ డెకరేషన్ చేసి సాయియాన సత్సంగహాలు వద్దకు వెళ్ళిపోయారు. వాళ్లు అక్కడ మా బాబుకి అన్ని పరీక్షలు చేసి “అసలు ఎం జరగలేదు, కొంచెం వెనకాల రాసుకుపోయింది.
అంతే ఇంకేం ప్రమాదం లేదు” అని చెప్పారు. గురువుగారు నా బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాదారంటే కారు కొట్టేయగానే వాడిని అక్షణంలో ఎత్తుకొని ప్రక్కన అలా పడుకోబెట్టారు.
అది జరిగిన ప్రాంతం, సందర్భం చూస్తే ఎవరికీ మాటలు కూడా రాలేదు. గురువుగారికి మా మీద ఎంత దయ, మనం ఎవరిని నమ్మినా, నమ్మక పోయినా, గురువుని నమ్మితే చాలు మన జీవితాలలో అన్ని అయన జరిపిస్తారు.
అయన ప్రేమ తల్లిప్రేమ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అయన ప్రేమ అంతం, అవధులు, పరిమితి లేనిది. అనంతమైన ప్రేమతత్వం ఆయనది. మాకు 3 సం || ల క్రిందట గురువుగారి పరిచయం జరిగింది.
మేము చాల క్లీష్ట పరిస్టితులలో వున్నాము. అప్పటి నుండి ఆయన మమ్మల్ని అన్ని విధాలుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు.
గురుబంధువులందరికి ఒక చిన్న మనవి – దయచేసి గురువుగారు దేహంతో లేరు అని మాత్రం బాధపడవద్దు. అయన సజీవంగా మన ముందు లేకపోయిన,
సమాధిచెందిన తరువాత కూడా వెయ్యిరెట్లు ఎక్కువగా కాపాడుతున్నారు. ఇది మా స్వానుభవం, అంబులెన్స్ శిరిడి రాకముందే, మొట్టమొదట లీలలో నా బిడ్డకు భాగం(భాగ్యం) కలిగించారు.
ఇంత గొప్ప అనుభవం గురుబంధువులతొ పంచుకునే అవకాశం కల్పించిన సద్గురులీలకు కృతజ్ఞతలు.
కె. రాజేంద్ర రెడ్డి , ఉమాదేవి,హైదరబాద్.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- భక్తురాలిని క్షణకాలంలో ఆరోగ్యవంతురాలిగా చేసిన బాబా వారు
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు
- కొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీల….
- రక్షమాం శరణు తండ్రి, నన్ను రుణబాధనుండి విముక్తి చేయమని మాత్రమే ప్రా ర్దించినాను–Audio
- బాబా ప్రేరణ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments