టాబ్లెట్స్ బయటపడేసాను.(పొన్నవోలు డ్వారక్ నాధ్ రెడ్డి,చెన్నై)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గురువే నా సర్వస్వం:

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

ఆధ్యాత్మికత గురించిగాని, సద్గురు సంప్రదాయం గురించిగాని నాకు ఏమాత్రం తెలియదు. వాటిగురించి తెలుసుకోవాలనే కోరికగాని, అవగాహనగాని నాకుండేవి కావు. చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు పరిధిలో యాంత్రికంగా సాగిపోతున్న నా జీవిత గమనంలో మలయమారుతం లా విచ్చేసారు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ !

1998 అక్టోబరు విజయదశమికి కుటంబ సమేతంగా నేను షిర్డీ వెళ్ళడం, అప్పుడే మొదటిసారిగా “సాయిపథం” కు వెళ్ళడం జరిగింది. విజయదశమి సంబరాలలో, భక్తజన సందోహంతో కళకళలాడుతున్న సాయియాన ఆవరణ బాహ్యంగా కోలాహలంగా ఉన్న అంతర్లీనంగా ఏదో ప్రశాంతతను నింపుకొన్నట్లుగా ఉంది. గురువులు, ఆశ్రమాలు అంటే ఒక సదవగాహన, సదభిప్రాయం లేని నాకు గురువుగారి దర్శనంతో నాలో నుంచి ఒక క్రొత్త వ్యక్తీ మేల్కొన్న అనుభూతి కలిగింది. అక్కడి వాతావరణం అక్కడి వ్యక్తులు నాకు బాగా చిరపరిచితమైనట్లు అన్పించింది. గురువుగారిని కలిసి ఒక్కసారి మాట్లాడి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అయితే అంతమంది జనంలో అది సాధ్యం కాదని, వీలయితే ప్రయాణం వాయిదా వేసుకోమని చెప్పారు నారాయణరావుగారు. ఆ రోజునే పరిచయమైనా వి.టి రావు గారు మరియు ఇతర గురుబందువులు గురువుగారి గురించి, బాబా పథంలో గురువుగారు వారిని ఎలా నడిపిస్తున్నారో చెప్పారు. వారి నిశ్చింత చుస్తే ప్రతి నిత్యం అనేకానేక సమస్యలతో తీవ్రంగా పోరాటం సాగించాల్సిన ఈ సాంఘిక జీవనంలో ఒక సామాన్య మానవుడు అంత సంతోషంగా ఎలా ఉండగలడో   నాకు భోధపడ లేదు. నేనేది అడుగుతున్నా, వారు దేన్నీ గురించి చెప్తున్నా అన్నిటింకి కేంద్రబిందువు పూజ్యశ్రీ సాయినాధుని శరత్ బాబుజీ గారే. ఒక్క మాటలో వారందరి జీవితాలకి ఆధారం “శ్రీ బాబుజీ” అని ఎకకంటంతో చెప్పారు.

దాంతో నాకు గురువుగారిని స్వయంగా కలిసి మాట్లాడాలన్న కోరిక ఇంకా తీవ్రమయింది.” ఉదయాన్నే ఉరికి వెళ్ళాలి. కానీ బాబుజీ గారని కలవకుండా ఉండలేను. ఏం చేయాలో తెలియడం లేదు. నిర్ణయం మీదే ” అని బాబా ను ప్రార్థిస్తూ అక్కడే కుర్చుని ఉన్నాను. అంతలో ఎదోపని మీద లోపలికి నారాయణ రావు గారు వచ్చి ” గురువుగారు లోపల ఉన్నారు. మీరు వెళ్లి దర్సనం చేసుకోవచ్చు”   అన్నారు.

ఇదెలా సంభవమయింది? ఒక్కక్షణం నమ్మలేకపోయాను. తేరుకొని వడివడిగా లోపలికి వెళ్ళాను. ఆ మరుక్షణం గురువుగారి పాదాలు ముందు సాష్టాంగ పడిఉన్నాను! గురువుగారు మూర్తీభవించిన ప్రేమస్వరుపంలా ప్రసన్నంగా కూర్చుని తదేకంగా నావైపే చూస్తున్నారు. నన్ను కలవరపెడుతున్న సమస్యలు, అప్పటి పరిస్థితులు అన్నీ మనస్సులోపల గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నో చెప్పలునుకొన్న! ఇంకెన్నో అడగలనుకొన్నా! అయితే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను కుదిపేస్తుంది. హ్రుదయాన్నంతా కళ్ళలోకి తెచ్చుకొని రెప్పవాల్చకుండా గురువుగారినే చూస్తున్నా. అలా ఎంతసేపు వారిని చూస్తూ ఉండిపోయానో నాకే తెలియదు. నా అంతరంగామంతా చదువుతున్నట్లే ఉంది వారి దృష్టి. మద్య మద్యలో మెల్లగా తలూపుతూ నా వంక చూస్తున్నారు. ఆ మౌనభాషణలో పూర్తిగా నా ఆత్మనివేదన జరిగినట్లునిపించింది.

ఆ క్షణంలో గురువుగారి దివ్యసమక్షంలో ఎన్నో ఏళ్ళ తరువాత నా మనోవిహంగము మళ్లీ నా స్వంత గూటికి చేరుకోన్నట్టు అయింది. బాహ్య స్ఫురుణే లేనేట్లు ఉండిపోయాన నాకు గురువుగారు ఊదీ నుదుట నుంచారు. ‘ఇక వెళ్లిరా ! అన్నట్లు ‘ ఆప్యాంగా తలూపారు. ఇన్నాళ్ళకు నా ఆనందాన్ని, కష్టసుఖాలను నేరుగా నాతో పంచుకోనేందుకే బాబానే ఒక దివ్యమంగల రూపములో నాకు దొరికారన్న సంతోషంతో, చెప్పలేనంత ఉద్వేగంతో బయటుకు వచ్చాను. మర్నాడు ఉదయం మేమంతా మద్రాసు తిరిగి వచ్చాము.

ఒక రోజున వి. టి. రావు గారు ” తనకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నా, శ్రీ బాబూజీ దివ్య ఆశీస్సులతో, అనుగ్రహబలంతో తానిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాని, ఏ మందులు, డాక్టర్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా అవసరం రాలేదని” అన్నారు.

అది విన్న నేను నా జేబులో ఉన్న బి.పి టాబ్లెట్స్ బయటపడేసాను. సంవత్సరం పైగా హై బి.పి. తో ఎంతగానో బాధపడుతున్నాను. ఒక్క రోజు మందులు మరిచిపోయినా దాని ప్రభావం నా ఆరోగ్యంపై ఎంతగానో ఉండేది. అందుకే టాబ్లెట్స్ మరచిపోతాననే భయంతో జేబులో, పర్స్ లో, సూట్ కేసులో, ఇంట్లో ఇలా ప్రతిచోట అందుబాటులో ఉంచేవాడిని.

ఈ నిర్ణయానికి నా భార్య శైలజ భయపడింది. మాటల సందర్బంలో విషయం తెలిసిన హోమియో వైద్యులయిన ఒక గురుబంధువు కూడా, గురువుగారికి చెప్పి వారి అనుమతితో తర్వాత మానేద్దురుగాని, అంతవరకు హోమియో మెడిసిన్ అయినా వాడమన్నారు. కాని నాకెందుకో నా నిర్ణయాన్ని మార్చుకోవాలనిపించలేదు.

నాకు పరిపూర్నమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ, నా జీవితం ఆ మహానుభావుని సేవలో పునీతం కావాలని హృదయపుర్వకంగా ప్రార్థించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బి.పి. కాదు కదా ఏ జబ్బూ నా దరి చేరలేదు.

ఇంతటి మహాద్బాగ్యాన్ని శ్రీ బాబూజీ నాకందిచాక కుడా నాలో కొంత అసంతృప్తి నన్ను ఆలోచనలొ పడేసింది. ఫిబ్రవరిలో మళ్లీ   గురువుగారిని షిర్డిలో కలిసి మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. ఆ సందర్బంలో గురువుగారిని “ఇంతమంది గురుభందువులు ఎన్నో సంవత్సరాల ముందు మీ పాదసన్నిధికి చేరే అవకాశం రావడంతో వారంతా మీ సాన్నిధ్యంలో ఆనందముగా ఉన్నారు. మరి నేనెందుకు ఇంత ఆలస్యంగా వచ్చాను.? మీ సన్నిధిలో మిగిలిన గురుబంధువులు పొందిన అనుభవాలు, అనుభూతుల్లో భాగం పంచుకొనే అవకాశం నాకు లేకపోయిందే” అని అడిగాను.

దానికి గురువుగారు చిన్నగా నవ్వుతూ “ఇప్పుడువచ్చారుగా” అన్నారు.

గురువుగారు: సద్గురువు అంటే, ఏదైతే నీలో ప్రేమను ప్రజ్వలింప చేస్తుందో, ఏదైతే నిన్నొక వ్యక్తిగా మలచి నీ ఆసయసిద్దిని తెలియని రీతిలో అనుభవింపజేస్తుందో, ఏదైతే నీలో ఆనందం, ప్రశాంతం, నమ్మకం, రక్షణ మైదలైన భావాలను కలుగజేస్తుందో అదే సద్గురువు. అసలా ఏమి జరుగుతున్నదో నీకు తెలియదు. జరుగుతున్నదానికి ఆధారం కానీ, ప్రమాణం కానీ ఉండదు. కానీ అది నీ అనుభవంలోకి వస్తుంది. దానినే సద్గురువు అంటాను.

సద్గురువు లభించకమునుపు నీవనుభావిస్తున్నదానికి, ఇప్పుడు అనుభావిస్తున్నడానికి తేడ కనిపిస్తుంది. నీ పరిస్థితి రూపాంతరం చెందుతుంది. నీ వాంఛలు, నీ అవసరాలు, నీ ఆనందం యెక్క స్వరూపాలు కూడా మారుతాయి. నీకు సద్గురువు లభించనంతవరుకు నీ కోరికలు నిన్ను నిరంతరం భాధిస్తూనే ఉంటాయి. కానీ నీకు సద్గురువు లభించిన తర్వాత ఆ కోరికలు తత్త్వమే మారి పోతుంది.

పొన్నవోలు డ్వారక్ నాధ్ రెడ్డి, వ్యాపారస్తుడు, చెన్నై.  

జన్మించిన సం|| 1955

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles