మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులందరూ ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తూ ఉంటారు.  కొంతమంది సప్తాహం చేస్తే మరికొందరు రోజుకొక అధ్యాయం పారాయణ చేయడం చేస్తూ ఉంటారు.  కొందరికి సమయం లేక ఒక పేజీ గాని, కొన్ని పేరాలు గాని ప్రతిరోజూ చదువుతూ ఉంటారు.  మరికొందరికి అసలు సమయమే కుదరకపోవచ్చు. వారు మనసులోనే సాయినామ జపం చేసుకుంటు ఉండచ్చు.  ఎవరు ఎలా చేస్తున్నాముఖ్యంగా కావలసినది ధృఢమయిన భక్తి మాత్రమే. పారాయణం అంటే కేవలం సచ్చరిత్ర ను చదవడమే కాదు, ఎక్కడైనా బాబా కు సంబందించిన లీలలు చదివిన కూడా అది పారాయణ తో సమానమే.

మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….

ఈ రోజు చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారి మరో  అనుభవం,

శ్రీ సాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయంలో  బాబా శ్యామాతో  అన్న మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.

“ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను.  నా చరిత్రను, నా మహిమలను  గానం చేసే వారి ముందు వెనుక నలు దిక్కుల నిలచి ఉంటాను. నా కొరకు మనో ప్రాణాలను అంకితం చేసే భక్తులకు ఈ కధా శ్రవణంలో ఆనందం కలగటం సహజం.  నా కధా సంకీర్తనలు చేసేవారెవరైనా సరే వారికి ఎల్లప్పుడు ఆనందాన్ని, సుఖ సంతోషాలని ప్రసాదిస్తాను.  నా అనన్య శరణు జొచ్చి నాభజన నా ధ్యానం నా నామ స్మరణ చేసేవారిని నేను ఉధ్ధరిస్తాను.  ఇది నాప్రతిజ్ఞ”

మా చిన్న పాప జూన్ 2015 న జన్మించింది.  తరువాత మనకు గోదావరి పుష్కరాలు వచ్చాయి.  నేను డెలివరీకి ఒంగోలు వెళ్ళినపుడు పెద్ద పాపకి స్కూలులో మూడు నెలల సెలవు అడిగి నాతోపాటు తీసుకుని వెళ్ళాను.  తరువాత చిన్న పాపకి మూడవ నెలలో చెన్నైకి తిరిగి రావాలి.  ఎందుకంటే మూడు నెలలకి మించి పెద్ద పాపకి స్కూలు వాళ్ళు సెలవు ఇవ్వనన్నారు.  మంచి రోజు కోసం అడిగితే  6 నెలల వరకు వెళ్ళకూడదన్నారు.  నేను ఎప్పుడూ ఒంగోలులో ఉన్న సంతపేట బాబా గుడికి వెడుతూ ఉంటాను.

అలాగే చెన్నైకి వెళ్ళేముందు సంతపేట బాబా గుడికి వెళ్ళాము.  అక్కడ ద్వారకామాయిలో కూర్చుని “బాబా నీమీద భారం వేసి బయలుదేరుతున్నాను.  బాబా మీకన్నీ తెలుసు కదా!” అని మనసులో ప్రార్ధించుకుని బాబాకి నమస్కారం చేసుకున్నానుఅపుడే బాబా చిత్రపటం నుండి పువ్వులు క్రిందకు జారి పడ్డాయి.  ఆ సూచనని నేను బాబావారు ఇచ్చిన ఆదేశంగా భావించి పెద్దవాళ్ళు వద్దని చెప్పినా వినకుండా, బాబా మీద భారం వేసి మొండిగా బయలుదేరాను.  ప్రయాణం బాగానే జరిగింది.  నా హాండు బ్యాగులో పెద్ద పాప నగలు, చిన్న పాప నగలు, నా డబ్బు కొంత ఉన్నాయి.  నేను రైలు నుండి దిగేటప్పుడు నా హాండ్ బ్యాగ్ రైలులోనే మర్చిపోయి దిగేశాను.  చెన్నై సెంట్రల్ స్టేషన్ లో కొంత దూరం నడిచిన తరువాత బ్యాగ్ విషయం గుర్తుకు వచ్చింది.

వెంటనే మా వారికి బ్యాగ్ మర్చిపోయిన విషయం చెప్పాను.  బ్యాగ్ దొరికితే మీపారాయణ చేస్తాను బాబా అని మనసులోనే బాబాని ప్రార్ధించుకున్నాను.  మావారు వెనక్కి వెళ్ళి మేము కూర్చున్న బోగీ దగ్గరకు వెళ్ళారు.  బోగీలో మాముందు కూర్చున్నామె బ్యాగ్ తీసి పెట్టి మా కోసం ఎదురు చూస్తూ ఉంది.  మావారు రాగానే ఆమె బ్యాగ్ అందించి అన్ని సరి చూసుకోమని చెప్పింది.  మావారు అంతా చూసి అన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు.  పెద్దల మాట విననందుకు ఇలా జరిగిందని భావించాను కాని, బాబా నన్ను మళ్ళి కాపాడారు.  కర్మ ఫలాన్ని తాత్కాలికంగా మాత్రమే అనుభవించేలా చేశారు.

ఇక చిన్న పాపతో ఇంటి పనులతో బాబా చరిత్ర పారాయణ చాలా కష్టంగా ఉంది.  నేను బాబానే అడిగాను మీరే దారి చూపాలని.  నాకు కంప్యూటర్ లేకపోవడంతో అన్నీ నా మొబైల్ లోనే చదువుతూ ఉంటాను.  నేను అంతర్జాలంలో బాబా గారి సందేశాలతో  కూడుకున్న కొత్త కొత్త ఫోటోలన్నీ సేకరిస్తూ ఉంటాను.  నాకు ఏదయినా కష్టం కలిగినపుడు ఏదో ఒక ఫోటోని ఎంచుకుని అది బాబా వారిచ్చిన ఆజ్ఞగా భావిస్తూ ఉంటాను. ఆ విధంగా ఒకసారి మిరకిల్స్ ఆఫ్ సాయి ఇన్ తెలుగు అని టైప్ చేసినప్పుడు బ్లాగుని చూశాను.  అపుడు ప్రతిరోజూ వారు  ప్రచురించే వాటిని చదువుతున్నాను.  ఏ రోజయినా వారు ప్రచురించకపోతే పాతవి చదవాలనే ఆలోచన నాకు రాలేదు.  కారణం బాబా మన ముందు వున్నా కూడా మాయ వల్ల మనం తెలుసుకోలేము.  అందు చేత నాకు పాతవి చదవవచ్చనే విషయం తెలియదు. అపుడు బ్లాగులో అనుకోకుండా ఇంతకు ముందు ప్రచురించిన వాటిని ప్రెస్ చేసి చదివాను.  అప్పటి నుండి ప్రతిరోజు బ్లాగులో ఆయన లీలలను చదివించేలా చేసి నా మొక్కు తీర్చారు బాబా.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles