Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: కళ్యాణి భాస్కర్
నివాసం: హైదరాబాద్
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !
సాయి బంధువులందరికి సాయిరామ్. నా పేరు కందగట్ల కళ్యాణి భాస్కర్. మేము హైదరాబాద్ వాస్తవ్యులం.
నేను బాబాగారి భక్తురాలిని. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను “సాయి సచ్చరిత్ర” ను పారాయణ చేశాను. పారాయణం చేసేటప్పుడు బాబా గారికి చెప్పాను. బాబా నేను, ఫిబ్రవరిలో పారాయణం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం చివరి రోజు కల్లా నువ్వు నా దగ్గరికి రావాలి బాబా అంటూ చెప్పి సప్తహ పారాయణంను పూర్తి చేశాను.
నెలలు నెలలు గడిచిపోయాయి. పారాయణం వల్ల నేను నాకుటుంబం ఇంతకు ముందుకన్నా సంతోషంగా ఉన్నా, కానీ బాబాకి నేను చెప్పిన మాట మాత్రం మరిచి పోయాను. కానీ సాయిబాబా మరిచి పోలేదు.
31st డిసెంబర్ రోజున మా బంధువులు శిరిడీ వెళ్లామని, బాబా ప్రసాదంతో పాటుగా బాబా విగ్రహాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు, ఆశ్చర్యం, ఆనందం. ఇంకా ఒక్కరోజు దాటితే సంవత్సరం అయిపోతుంది.
అంటే బాబాని నేను అడిగిన మాట నెరవేర్చకుండా అయిపోతుందని, ఈ సంవత్సరం చివరిరోజు అంటే సరిగ్గా 31st డిసెంబర్ రోజున బాబా నా దగ్గరకు రావడం నిజంగా నేను నా మాటల్లో చెప్పలేక పోతున్నాను.
బాబాను నేను అడిగిన కోరికను కూడా మర్చిపోయాను! కానీ బాబా మాత్రం నా కోరికను మన్నించి విగ్రహ రూపంలో శిరిడీ నుండి నా ఇంటికి వచ్చి కొత్త సంవత్సరంను ఎన్నో సంతోషాలతో ఆహ్వానించారు.
నా ఈ చిన్న కోరికను ఒక లీలగా తీర్చినందుకు బాబాకు ఋణపడిపోయి ఉంటాను.
ప్రస్తుతం ఆ విగ్రహంను ప్రతి రోజు పూజా చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాము.
ఈ లీలను మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“నీవెప్పుడు తలుచుకున్నాఆ తక్షణం నేను నీ వెంటే ఉంటాను”
Latest Miracles:
- మరిచిపోయిన నగలను ఇప్పించిన బాబా….
- బాబా నా భర్తకి పునర్జన్మ ఇచ్చారు
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- బాబా అనుగ్రహంతో వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తడుస్తున్నారు
- బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments