బాబా అనుగ్రహంతో వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తడుస్తున్నారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి లీలా మ్యాగజైన్ సెప్టెంబర్-అక్టోబరు 2009 సంచికలో వచ్చిన Mrs. వందన కామత్ గారి అనుభవం

శ్రీమతి వందన కామత్ గారు కుటుంబంతో బెంగుళూరులో ఒక ఇంటి ఆవరణలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. వారు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.

వారికీ బాబా గురించి తెలియదు. బాబా యొక్క కృప వలన ఇంటి యజమాని యొక్క కోడలు వందన గారికి ఒక శ్రీ సాయి సచ్చరిత ఇచ్చి, బాబా చూసుకుంటారని చెప్పింది.

ఒక రోజు, ఇల్లు యజమాని ఇంటిని ఖాళీ చేయమని వారిని కోరారు. వారు ఇబ్బందుల్లో ఉండడం వలన వారు కొత్త అద్దె ఇంటికి మారడానికి డబ్బు లేదు. అటువంటి పరిస్థితులలో షిర్డీ సందర్శించడానికి వారికి అవకాశం లభించింది. ఎలాగో మొత్తానికి షిర్డీ వెళ్లి వచ్చారు. షిర్డి నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీమతి వందన తన కుటుంబ స్నేహితురాలిని కలిసి, తన పరిస్థితిని వివరించింది.

ఆ స్నేహితురాలు కొత్త ఇంటిని కొనుగోలు చేసుకోమని సూచించారు. కాని అప్పటి పరిస్థితిలో అది అసాధ్యమైనది, కనీసం ఇంటి అద్దె కట్టేందుకు కూడా డబ్బులు లేవు. కానీ, సాయి నిర్ణయమేమో గాని, అదే స్నేహితురాలు వందన గారి కోసం  బాబా మందిరం దగ్గరలో ఉన్న సైట్ కోసం 75 వేల రూపాయలు ఇచ్చారు. కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ప్లాట్ల ధర లక్షలలో ఉంది, కాబట్టి మళ్లీ తగినంత డబ్బు లేదు.

ఇంతలో, శ్రీమతి వందన గారి మామయ్య చనిపోయారు. ఆయన వీలునామా ప్రకారం ఒక లక్ష రూపాయలు వందన గారికి అందాయి. వారు వెంటనే దానితో ప్లాటు కొనుగోలు చేశారు.

ఇలా జరిగినప్పటి నుండి మొత్తం కుటుంబం బాబాను ఆరాధించడం మొదలుపెట్టింది. ప్లాటు కొనుగోలు చేసిన తరువాత పునాది వేశారు కానీ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం వరకు నిర్మాణం ప్రారంభించలేకపోయారు. ఈ సమయంలో శ్రీ సాయి సచ్చరిత్రలో నల్ల కుక్కకి ఒక భక్తుడు పెరుగు అన్నం పెట్టడం వలన అతని కోరిక నెరవేరిన సంఘటన శ్రీమతి వందన గారికి జ్ఞాపకము వచ్చింది. అప్పుడు ఆమె ఏడు గురువారాలు పెరుగు అన్నం నల్ల కుక్కకు పెడతానని బాబాని ప్రార్థిస్తూ, తమ ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేలా ఆశీర్వాదించమని కోరుకున్నారు.

మొదటి గురువారంనాడు ఆమె ఇంటి ముందు పెరుగు అన్నం పళ్ళెంతో ఉంచి నల్ల కుక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతసేపటికి తెల్ల మచ్చలతో ఉన్న నల్లటి కుక్క ఈ ప్లేటుని సమీపించింది. ఆ కుక్క పూర్తిగా నల్లగా ఉండకపోవడంతో ఆ కుక్కకు పెరుగు అన్నం పెట్టాలా వద్ద అన్న అయోమయంలో పడ్డారు. కాని వింతగా ఆకుక్క ప్లేట్ దగ్గరకు వెళ్లి ఆహారాన్ని వాసన చూసి, వెనక్కి వెళ్ళిడం, మళ్ళీ రావడం ఇలా 10-15 నిమిషాలు కొనసాగి చివరికి కుక్క తినకుండా వెళ్ళిపోయింది. శ్రీమతి వందన చాలా కాలం నిరీక్షిస్తూ చాలా నిరాశ చెందారు.

కొంతసేపటి తర్వాత అదే కుక్క మరొక నల్ల కుక్కతో పాటు వచ్చింది. ఆనల్లని కుక్క వచ్చి కంగారుగా పెరుగు అన్నం తిని, మచ్చల కుక్క కోసం కొద్దిగా వదలగా, మిగిలినది రెండవ కుక్క తిన్నది. తర్వాత రెండు కుక్కలు సంతోషంగా వెళ్ళిపోయాయి. అది చూసాక శ్రీమతి వందనకు బాబా ఇంటిని నిర్మించడంలో సహాయం చేస్తారని పూర్తి నమ్మకం కలిగింది. ఈ సంఘటన తరువాత వాస్తవానికి, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, బాబా యొక్క ఆశీర్వాదంతో, వారు  ఐదు నెలల లోపే ఇంటి నిర్మాణం పూర్తీ అయ్యింది.

అప్పటి నుండి, శ్రీమతి వందన మరియు కుటుంబం యొక్క విశ్వాసం బాబా యందు మరింతగా పెరిగింది మరియు వారు తమ జీవితాన్ని పూర్తిగా బాబాకు అంకితం చేశారు. వారు ‘సాయి స్మరణ్’ అని పిలవబడే ఒక గ్రూపుని ఏర్పరుచుకున్నారు. గత 11 సంవత్సరాలుగా, ప్రతి ఆదివారం వారు సాయి భజనలను బెంగుళూరులో వివిధ భక్తుల ఇండ్లలో నిర్వహిస్తున్నారు. ఇంతేకాకుండా, సంవత్సరానికి ఒకసారి షిరిడీకి మొత్తం బృందంతో (150-300 భక్తులు) వెళ్లి, భజనలు నిర్వహించి, పల్లకి ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

నేడు, వారు మరో మూడు అంతస్తులను కూడా నిర్మించారు. వాటిలో ఒకటి బాబాకు అంకితం చేయబడింది. అక్కడ బాబా వారి విగ్రహం మరియు ఛాయాచిత్రాలు ప్రతి రోజు పూజించబడుతున్నాయి. ప్రతి గురువారం వారు భజనలు చేస్తున్నారు. రామ నవమి, గురు పూర్ణిమ, విజయదశమి వంటి వేడుకలతో వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తడుస్తున్నారు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles