పోయిన సొమ్ము బాబా అనుగ్రహంతో 72 గంటలలో దొరికిన లీల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

 సాయి భక్తుడు శ్రీ ఎ.ఎస్.కుమార్ గారు వివరించిన బాబా లీల:-.

అది ఆగస్ట్ 14, 2010 సంవత్సరం. ఉదయం నించి నాకు యెందుకనో అశాంతిగా ఉంది. మా పెద్దమ్మాయి కూడా కొంచెం జ్వరంతో బాధపడుతోంది. తను చాల విధేయత గల అమ్మాయి. తను యెప్పుడు యేమీ అడగదు, దేనికీ పేచీ పెట్టదు. కానీ ఆరోజు ఉదయం నించి కొంచెం మొండితనంగానూ, విపరీతంగానూ ప్రవర్తిస్తోంది. తన కోరిక యేమిటంటే తను నా సోదరుడి యింటికి వెళ్ళాలని. తను చాలా మొండి పట్టు పట్టడంతో, ఆఖరికి నేను, నా భార్య మా సోదరుడి యింటికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే ఉందామని నిర్ణయించుకున్నాము. నేను నా భార్యకి మధ్యాహ్నం వెళ్ళమని, నేను నా ఆఫీసు పని పూర్తి అయిన తరువాత వస్తానని చెప్పాను.

10 గంటలకి నేను యింటినించి ఆఫీసుకు బయలుదేరాను. మాయింటినించి ఆఫీసుకు 2 కి.మీ. దూరం ఉంటుంది. కారు నడుపుతూ, దారిలో వెడుతున్న వివిధ రకాలయిన వాహనాల మీద వెనుకవైపు దాదాపు 20, 25 కన్న ఎక్కువ బాబా బొమ్మలు, స్టిక్కర్లు చూశాను. బాబా నన్ను దీవిస్తున్నట్టుగా నాకు చాలా అనందం వేసింది. నా భార్య, తాము నా సోదరుడి యింటికి చేరుకున్నట్లు ఫోను చేసింది. మా అమ్మాయికి కూడా జ్వరం తగ్గి కజిన్స్ తో ఆటలలో మునిగిపోయిందని చెప్పింది.

సాయంత్రం నేను ఆఫీసునించి నా సోదరుడి యింటికి బయలు దేరాను. మరలా అన్ని చోట్ల బాబా బొమ్మలను చూశాను. అప్పుడు బాబా నాకేదో చెపుతున్నారనిపించింది. ఏదో జరగబోతోందనిపించింది. నేను వెంటనే నా భార్యకు ఫొను చేసి, “అందరూ కులాసాగా ఉన్నారా?” అని అడిగాను. దేవుని దయ వల్ల అందరూ బాగానే ఉన్నారని చెప్పింది. అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, కాని యింకా యేదో అసంతృప్తిగానే ఉంది. నేను బాబా ని మా కుటుంబ సభ్యులని, స్నేహితులని చల్లగా చూడమని ప్రార్థించాను.

నేను నా సోదరుడి యింటికి చేరుకున్నాను. మేమంతా చాలా సంతోషంగా గడిపాము. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాము. కానీ, నేనింకా సమాధానం కోసం వెతుకుతున్నాను. దానితో నేను సరిగా నిద్ర పోలేకపోయాను. మరునాడు ఆగస్ట్ 15 న మేము తిరిగి మాయింటికి వెళ్ళడానికి తయారయ్యాము, కాని నా సోదరుడు ఉండిపోయి రాత్రి భోజనం చేసి అప్పుడు వెళ్ళమని బలవంతం చేశాడు. నేను సరేనన్నాను. మేము భోజనాలు ముగించుకుని రాత్రి 9 గంటలకి యింటికి తిరిగి వచ్చాము.

నేను నాభార్యతో, ‘నువ్వు పైకి వెళ్ళు, నేను పది నిమిషాలలో వస్తాన’ని చెప్పాను. నేను తిరిగి వచ్చేటప్పటికి నాభార్య, పిల్లలతో క్రిందే నుంచుని ఉంది. నేను ఆశ్చర్యంతో, “యేం జరిగింది, యిక్కడే నిలుచుండిపోయారు?” అన్నాను. బాగా వణికిపోతూ ఆమె, ‘మన యిల్లు దోచేశారు’ అని కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంది. ఒక క్షణంపాటు నేను కూడా నిశ్చేష్టుడినయ్యాను. ఏం చేయాలో తోచలేదు. మా అమ్మగారు, నా సోదరుడిని పిలిచింది. వెంటనే నా సోదరుడు, స్నేహితులూ వచ్చి నాకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు.

మేము షాక్ నుంచి తేరుకునేటప్పటికి రాత్రి 11 గంటలు అయింది. మేము పోలీసులని పిలిచాము. వారు దొంగతనానికి సంబంధించిన ప్రశ్నలన్నిటినీ వేసి, ఎఫ్.ఐ.ఆర్. తీసుకుని, తమకు చేతనయినంతగా చేస్తామని చెప్పారు. మా కుటుంబమంతా కన్నీళ్ళతో నిండిపోయి దిగులుగా ఉన్నారు. ప్రతీరోజు నేను పోలీసుస్టేషన్ కి వెళ్ళి ఏమయినా ఆచూకీ దొరికిందా అని అడుగుతూ ఉండేవాణ్ణి.

నేను బాబా గుడికి వెళ్ళి బాబా ముందు కూర్చుని హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడాను. హఠాత్తుగా నాకు ధైర్యం వచ్చినట్టనిపించింది. మరునాడు నాకు పోలీసు స్టేషన్ నించి కబురు వచ్చింది. వారికి కొంత క్లూ దొరికిందని, అదే కనుక ఫలిస్తే మా సొమ్ము మాకు దొరుకుతుందని చెప్పారు.

మేము కొన్ని ప్రదేశాలకి వెళ్ళాము, కానీ యేమీ ఫలితం కనిపించలేదు. అలాగే మరునాడు వెళ్ళాము, కొంత ఆశ కలిగింది కానీ, దొంగను పట్టుకోలేకపోయాము. మరునాడు నేను వెళ్ళేటప్పుడు నాకూడా “మిరకిల్ పుస్తకం” తీసుకుని వెళ్ళాను. మిరకిల్ పుస్తకం మాటలాడుతుందని మీకు తెలుసు. “మిరకిల్ పుస్తకం చదివితే మీ తీరని మీసమస్యలు తీరుతాయి”. ఆరోజు నాకు ధైర్యం వచ్చింది.

నేను పోలీసు స్టేషన్ కి వెళ్ళాను, వారు నన్ను కూడా తమతో రమ్మన్నారు. అనుకున్న చోటకి మేము రాత్రి 10.30 కి వెళ్ళాము. దొంగ ఉన్న చోట దాడి చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. మేము పోలీసు స్టేషన్ కి వెళ్ళాము. వారు 90% బంగారం, డబ్బు రికవరీ చేశారు. ఈ తతంగమంతా పూర్తి అయ్యేసరికి తెల్లవారుఝాము 2 గంటలు అయింది.

మా కుటుంబం, యింకా మా శ్రేయోభిలాషులూ అందరూ చాలా సంతోషించారు. ఉదయం 2.15 కి యింటికి వెళ్ళే ముందు, నేను తిన్నగా బాబా గుడికి వెళ్ళి శిరసు వంచి నమస్కరించాను, నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు.

తరువాత నేను కూర్చుని జరిగిందంతా మరలా విశ్లేషించుకున్నాను. బాబా మా కుటుంబం మీద యెంతో దయతో ప్రేమగా చూశారు. ముందర మమ్మల్ని ఉన్నచోటునించి పంపివేసి మా కుటుంబానికి యెటువంటి హాని జరగకుండా చూశారు. అందుచేతనే మా అమ్మాయి ద్వారా మేము యింటి నుంచి వెళ్ళేలా చేశారు. మేమే కనక యింటిలో ఉంటే మాకేమి జరిగి ఉండేదో నేను ఊహించలేను. నాకు యిద్దరమ్మాయిలు, చిన్న పిల్లలు వాళ్ళు. ఒకమ్మాయికి 5 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 2 సంవత్సరాలు. తనెప్పుడూ రోజంతా నాతోనే ఉంటుంది.

బాబా లీలని యేమని వర్ణించను? ఆయన తన భక్తులని యెంతో దయతో కాపాడుతూ ఉంటారు. “ఎవరయితే నన్ను ఆశ్రయిస్తారో వారిని యెల్లప్పుడు కాపాడి రక్షిస్తాన” ని బాబా చెప్పారు. మేము పోగొట్టుకున్న సొత్తు విలువ బంగారము, కొంత డబ్బు , దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది.ర్యాప్తు అంతా పూర్తి అయ్యాక, ఆఫీసరు గారు ఒక సాయంత్రం నన్ను పిలిచి, “నా మొత్తం సర్వీసులో 4 రోజులలో ఛేదించిన కేసు చూడలేదు, మీరు చాలా అదృష్టవంతులు” అని చెప్పారు. ఇది యింకా బాబా లీల అనే భావంలో ఉన్నాను. ఇది నిజంగా చిత్రం.

మా కుటుంబాన్ని, మా సంపదనీ రక్షించి కాపాడినందుకు బాబా కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చరణ కమలాల మీద శిరసు వంచి నమస్కరించి మనలనందరిని దయతో చూడమని కోరుతున్నాను.

***********

పై లీలకి త్యాగరాజు గారి విశ్లేషణ.

బాబాని నమ్మని వారు, బాబాని పూజించని వారు, నాస్తికులు ఈ లీల చదివినా, విన్నా వారికి ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది. “మరి మీరు బాబాని పూజిస్తూ ఉంటే దొంగ పడి సొత్తు దోచుకోకుండా ముందరే ఆపి ఉండవచ్చుకదా?” అనే సందేహం వెలిబుచ్చుతారు.  అలాంటి వారికి నేను చెప్పేదేమంటే, కొన్ని పూర్వజన్మ కర్మలని భగవంతుడు కూడా తప్పించలేడు.

అందుకనే ప్రతి క్షణం ఆయన నామస్మరణ చెయ్యమన్నారు. బాబాని నమ్మినవారు కనకనే అమ్మాయికి జ్వరం రావడం, ఎప్పుడూ లేనిది, బంధువుల యింటికి వెడదామని మారాము చేయడం, తీరా అక్కడకు వెళ్ళాక, జ్వరం తగ్గి, హాయిగా ఆడుకోవడం యిదంతా బాబా ముందుగానే యేర్పాటు చేసినది.

దారిలో కారులో వెడుతుండగా అన్ని వాహనాలమీద బాబా బొమ్మలు కనపడి, “నేను నీ వెనుక, ముందర ఉన్నాను, నిన్ను యెల్లప్పుడూ కాపాడతాను” అని సందేశం ఇచ్చినట్లుగా ఉంది. పెద్ద ఆపద నించి కాపాడారు. పోయిన సొమ్ము కూడా 90 శాతం తిరిగి వచ్చేలా చేశారు. పోయిన సొత్తు కూడా దొరకడం కూడా బాబా లీల కాక మరేమిటి?

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles