శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (2వ.భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (1వ.భాగం)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

బాబా, సాంసారిక జీవితాన్ననుభవిస్తూ కూడా, మన ప్రవర్తన ఏవిధంగా ఉండాలో నానాచందోర్కర్ కి బోధించారు.  విషయ వాసననలో (ఇంద్రియ సుఖములకు లోను కాకుండా) అనైతిక మార్గాలను అనుసరించకుండా, సుఖంగా ఉండే ఎన్నో సులభమయిన పద్ధతులను సాయిబాబా శ్రీసాయి సత్ చరిత్రలో వివరించారు.

1. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ ద్వారకామాయిలో బాబా ముందర కూర్చుని ఉన్నపుడు, ఒక ధనికుడు తన కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు. అతని కుటుంబంలోని స్త్రీలు బాబా దర్శనం చేసుకొన్నారు. వారు ఘోషా స్త్రీలు.  ఆ స్త్రీలలో ఒకామె బాబా పాదాలకు నమస్కరించడానికి తన మేలిముసుగును తొలగించింది.  నానా సాహెబ్ ఆమె ముఖ సౌందర్యానికి సమ్మోహితుడయారు. ఆమెను మరలా మరలా చూడాలనిపించేటంతగా అతని మనసు ప్రలోభ పెట్టింది.  కాని, అక్కడ బాబా, ఇంకా ఇతర భక్తులు ఉండటంతో సంకోచించాడు.  నానా మనసు అస్థిమితంగా ఉండటం గమనించిన బాబా ఆ స్త్రీ వెళ్ళిపోయిన తరువాత నానాతో  “నానా! ఎందుకని వ్యర్ధంగా మోహపరవశుడవై చికాకు పడుతున్నావు?  ఇంద్రియాలని వాటి పనిని వానిని చేయనీ.  వాటి పనిలో మనం అనవసరంగా జోక్యం కలిగించుకోరాదు.  భగవంతుడు ఈ సుందరమయిన ప్రపంచాన్ని సృష్టించాడు.  ఆ సౌందర్యాన్ని చూచి సంతోషించడం మన విధి.  మనసు క్రమంగా మెల్లగా స్థిరపడి శాంతిస్తుంది.  ముందు ద్వారము తెరచి యుండగా వెనుక ద్వారము నుండి పోవడమెందుకు?  మన మనసు స్వచ్చముగా ఉన్నంత వరకు ఎటువంటి దోషము లేదు.  మనలో చెడు ఆలోచన లేనపుడు ఎవరికయినా భయపడనేల?  నేత్రములను వాటి పనిని అవి నెరవేర్చుకోనిమ్ము.  నీవు సిగ్గుపడి తడబడనవసరం లేదు”  అన్నారు.  అధ్యాయం – 49

సహజంగానే మన మనస్సు చంచలమైనది.  అందుచేత మనం మన మనస్సుని దాని ఇష్టం వచ్చినట్లుగా పరుగులెత్తించకూడదు.  పంచేంద్రియాలు అస్థిమితంగా ఉంటే ఉండవచ్చుగాక, కాని మన శరీరం మన అధీనంలో ఉండాలి.  మన శరీరం ప్రతిదానికి ఆతురత పడే విధంగా ఉండరాదు.  కోరికలనే గుఱ్ఱాల వెంట మనం పరుగులెత్తరాదు.  వాటిని పొందుదామనే బలీయమయిన కోరికతో మన మనస్సు నిండిపోకూడదు.  మనం ఆవిషయాలను గురించి పట్టించుకోకుండా, క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయడం వల్ల, మనస్సు యొక్క చంచలత్వాన్ని జయించవచ్చు.  అధ్యాయం – 49

  1. ఒకరోజున హేమాడ్ పంత్ కోటు మడతలలో నుండి శనగ గింజలు రాలి పడగా బాబా అతనితో హాస్యమాడారు. శనగ గింజల మిషతో బాబా,  ఆసమయంలో అక్కడున్నవారికి, హేమాడిపంత్ కు హితోపదేశం చేసారు.  “పంచేద్రియముల కంటె ముందుగానే మనసు, బుధ్ధి విషయానందమనుభవించును.  కనుక మొదటగానే భగవంతుని స్మరించవలెను.  ఈవిధముగా చేసినచో అది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పించినట్లే అగును.  విషయములను విడచి పంచేంద్రియములుండలేవు.  కనుక  ఆవిషయములను మొదట గురువుకు అర్పించినచో వానియందభిమానము అదృశ్యమైపోవును”.   అధ్యాయము – 22

ఈ సందర్భంగా శ్రీహేమాడ్ పంత్ కూడా మనకు ఈ విధంగా తెలియచేశారు.  “ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ మొట్టమొదటగా గురువుకర్పించవలెను.  ఈ అభ్యాసము నాచరించినచో భగవంతుడు, వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును.  విషయములననుభవించుటకు ముందుగానే బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో, ఆవస్తువును అనుభవించవచ్చునా? లేదా? అనే ప్రశ్న ఏర్పడును.  అపుడు మనము అనుభవించుటకు ఏది తగదో దానిని విడిచి పెట్టెదము.  ఈవిధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును”.  అధ్యాయము – 24

ఇక్కడ మీకొక ఉదాహరణ చెపుతాను.  మనం మిఠాయి దుకాణానికి వెళ్ళామనుకోండి.  అక్కడ నోరూరించే మిఠాయిలు మనకు కనువిందు చేస్తూ, వెంటనే కొని తినాలనిపిస్తుంది మన మనస్సుకి.  మొదటగా రుచి కోసం ఒకటి కొని తింటాము.  మన ఎదురుగా బాబా ఫొటో లేకపోవచ్చు, లేక ఆ దుకాణంలో ఉండవచ్చు. అప్పుడు మన మనసులోనే దానిని ముందరగా బాబాకు నైవేద్యంగా సమర్పించి ఆయనను స్మరించుకుంటూ   ఆరగిస్తే అది ఆయనకు సమర్పించినట్లే కదా!  అనగా బాబా ను మన మనసులో స్మరించుకుని మనం స్వీకరించాలి.  బాబా 24వ.అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కదా.  శనగల కధలో బాబా హేమాడ్ పంత్ తొ చెప్పిన ఈ మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.

బాబా —“అవును అది నిజమే. దగ్గరున్నవారికి ఇచ్చెదవు.  ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేను గాని ఏమి చేయగలము?  కాని, నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా?  నేనెల్లప్పుడు నీచెంత లేనా?  నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?”

(రేపటితో ఇంద్రియసుఖాలు ఆఖరి భాగం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

 సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (2వ.భాగం)

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles