Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
1945 సెప్టెంబరు లో శ్రీ టీ.ఎల్.ఎస్. మణి అయ్యర్ గారికి అమ్మాయి జన్మించింది. ఆమెకు “సాయి చంద్ర” అని పేరు పెట్టారు. మిగతా కుటుంబాన్ని రక్షించినట్లే శ్రీసాయి బాబా ఈపాపను కూడా రక్షించారు.
25, జనవరి 1946 వ.సంవత్సరంలో మణి అయ్యర్ గారు ఒకరోజు వేకువజామున 4 గంటలకు లేచి యింటినుంచి బయలుదేరడానికి సిద్ధమయారు.
తను పడుకున్న మంచం మీద అయిదు నెలలున్న తనపాప రెండు అడుగుల ఎత్తు ఉన్న మంచం మీద ఒక్కతే నిద్రపోతూ ఉంది.
మంచానికి రెండువైపులా ఎటువంటి రక్షణా లేదు. ఆయన మరొక ప్రక్కన నిద్రపోతున్న తన భార్యతో “పాపను జాగ్రత్తగా చూసుకో” అంటూ బయటకు వెళ్ళిపోయారు.
ఆయన భార్య అలాగే అని సమాధానమిచ్చి వెంటనే నిద్రలోకి జారిపోయింది. నిద్రలో ఉన్నతల్లికి (కుఝంధైయ యై ఏదు) ” నీ పాపను పట్టుకో” అనే మాటలు వినపడటంతో ఉలిక్కిపడి హటాత్తుగా లేచింది.
అక్కడ ఆమాటలు అన్నవారెవరూ కనపడలేదు. పాప మంచం మీదనుంచి కిందకి వేలాడుతూ పడిపోవడానికి సిధ్ధంగా ఉంది.
ఆమె పాపను పట్టుకోవడానికి ముందుకు జరిగినపుడు భూమిలోనుంచి రెండు చేతులు వచ్చి పసిపాప పడిపోకుండా రక్షణగా ఉండటం కనిపించింది.
తల్లి మంచి గాఢనిద్రలో ఉన్నపుడు పాపని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నది ఎవరు? స్వయంగా ఆసాయినాధుడే. ఎల్లపుడు మనందరినీ ప్రేమించే తల్లి, తండ్రి.
తల్లి, ఆపాపని తన చేతులలోనికి తీసుకోగానే, అంతవరకు సాయిచంద్ర పడిపోకుండా రక్షణగా ఉన్న ఆచేతులు అదృశ్యమయ్యాయి.
బావిలో పడిన మూడు సంవత్సరాల బాలిక శాంతిని, మేడమీదనుంచి పడిన రెండు సంవత్సరాల బాలుడు నాచ్నేను రక్షించినట్లుగానే బాబా ఆపాపను రక్షించారు.
1928 వ.సంవత్సరంలో సాయినాధ్ నాచ్నే రెండు సంవత్సరాల బాలుడు. ఒకరోజున ఆపిల్లవాడు పరిగెడుతూ ఉండగా ప్రమాదవశాత్తు మేడమీదనుంచి పడిపోయాడు.
కింద పెద్దరాళ్ళగుట్ట, చెత్త ఉంది. నాచ్నే పరుగెత్తుకుని వెళ్ళి చూసేటప్పటికి అతని కుమారుడు ఎటువంటి గాయాలు, దెబ్బలు లేకుండా నిల్చుని ఉన్నాడు.
నాచ్నే తన తండ్రితో “భయపడద్దు, బాబా నన్ను పైకి లేపారు” అన్నాడు.
సాయిసుధ – సావనీర్ 1946 ప్రచురణ నుంచి సమాచారం .
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.co.ke/ లింక్ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ” ఏమ్మా! ఏమైంది, ఇంకా ఎన్నాళ్ళు పడతావమ్మా ఈ కష్ఠాలు, నీ కష్ఠాలు చూడలేకపోతున్నాను. బాబా నీ నమ్ముకోమ్మా నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ”
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
- మృత్యుశయ్యపై యున్న శర్మగారి బిడ్డను బ్రతికించిన బాబా–Audio
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
- నా ప్రార్ధన బాబా మన్నించి నా బిడ్డను రక్షించినారు.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments