Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-56-1028-మృత్యుశయ్యపై యున్న శర్మగారి బిడ్డ 3:24
మధురమైన బాబా కధలను గ్రోలుదాము, బాబా పేరూరు శర్మను అంకితభక్తుని చేసుకోవాలి.
ఆ లీలా చూద్దాం. ఇది 1957 ఆగస్టు 7 వ తేదీన ఈ శర్మ గారి కుమారుడు చి : అరుణకుమార్ కు పెద్ద జబ్బు చేసింది .
రోజులు గడచుచున్నాను ఆ పిల్లవాని వ్యాధి వెనకాడలేదు. 104,105 డిగ్రీల జ్వరముతో యున్నాడు.
అది మెనింజైటీస్ అను జబ్బని డాక్టరు చెప్పిరి.ప్రధమ చికిత్స ఉపయోగపడలేదు .
12 వ తేదీన ఆ బాలునకు సృహతప్పి ఒడలు తెలియుటలేదు .
సాయంత్రమునకు ఆశలు వదలుకొనిరి . జీవించుట దుర్భరమనితేలినది.
ఆ బిడ్డను పంచలోకి చేర్చిరి తండ్రికి ఈ బాలునిపై అధిక ప్రేమ . రామచంద్రరావుకు కూడా బాగా చనువు.
పిల్లవాని కన్నులు మూతపడి ఎగశ్వాస యుండి చివరి లక్షణములుగా గోచరించుచుండెను.
శర్మగారు ఆ పిల్లవాడు ఇక తమకు దక్కడనుస్థితిలో నున్న సమయములో రావుగారు శర్మగారిని ప్రక్కకు పిలిచి “బిడ్డ చివరిదశలో యున్నాడని ఆశవదలినావు .
ఇప్పుడైనను నా మాట వినుము ” అని బ్రతిమిలాడుచూ “నేను ఇచ్చు మండువాడిన అతడు జీవించగలదను విస్వాసము నాకున్నది అని చెప్పుచు ఊదీని నీటిలో కలిపి త్రాగించి , బిడ్డకి రాయుము. .
బాబా పటము ముందు నిలచి నా బిడ్డను నాకిమ్మని ప్రార్దింపుమని” నచ్చచెప్పెను.
శర్మ అందుకు అంగీకరించి ఊదీని నీటిలో కలిపి ఆ పిల్లవానికి యిచ్చి, శరీరమునకు పుసినాడు .
బాబా పటము ముందు ఏకాంతముగా కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చుచు తన అపరాధము(దూషించుట) మన్నింపుమని, బిడ్డను బ్రతికింపుమని మొరలిడసాగినాడు.
పటము ముందు అట్లే కూర్చుండినాడు. బిడ్డ ప్రక్క ఇంట్లోని వారు, బంధువులు కన్నీళ్లు పెట్టుచు కూర్చుండిరి .
రాత్రి మూడు గంటల సమయమున ఆ బిడ్డ చివ్వున లేచి కూర్చొని నాన్నా అని పిలిచాడు . శర్మ గారు ఆ కేక విని బాలుని చెంతకు వచ్చిరి.
ఎందుకు అందరూ ఇట్లున్నారని అనుచు లోపలకు తీసుకొనిపొమ్మనెను.
శర్మ గారు బాలుని లోనికి తీసుకొనిపోయి , ఒడలంతయు ఊదీ పూసి, ఆ ఊదీ నీటిని మరలా త్రాగించి “ఓం సాయి నాథ జై జై, సాయి రామ జై జై అని కీర్తించాడు.
ధర్మామీటరు చూచిన జ్వరము లేదు. నాన్నా కాఫీ యివ్వవా! అని బిడ్డ అడుగుటతో శర్మ గారు ఆశ్చర్యము చెంది ఇది సాయిమహిమయే అని దృఢ విస్వాసము కలిగినది.
మృత్యువుతో పోరాడు బిడ్డను బ్రతికించిన బాబాను శరణువేడినాడు.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్ – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- అశృ జలాలతో అభిషేకం! …..సాయి@366 ఆగస్టు 12…Audio
- బాబా దివ్య వర్ణ సమ్మేళనం – బాబా నాకిచ్చిన రొగ నిర్ణయ పత్రం (విన్నీ చిట్లూరి )–Audio
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
- వైద్యులకే వైద్యుడు! …..సాయి@366 మే 9….Audio
- నా ప్రార్ధన బాబా మన్నించి నా బిడ్డను రక్షించినారు.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మృత్యుశయ్యపై యున్న శర్మగారి బిడ్డను బ్రతికించిన బాబా–Audio”
Ashok
October 30, 2018 at 2:56 pmOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam