నా ప్రార్ధన బాబా మన్నించి నా బిడ్డను రక్షించినారు.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-117-నా ప్రార్ధన బాబా మన్నించి 3:08

సాయి భక్తులకు, గురు బంధువులకు నమస్కారములు.

మాది కోట మండలం, జరుగుమల్లి గ్రామం.మాకు సుఖం వచ్చినా, కష్టము వచ్చిన అది బాబా దయవల్లెనని మా కుటుంబం మొత్తం సంతోషపడే వాళ్ళం.మా అమ్మాయికి 2003 సం॥ లో వివాహం అయింది.

మూడు సంవత్సరముల వరకు సంతానం కలుగలేదు.

నా భార్యకు జాతకాల పిచ్చి ఎక్కువ. మా అమ్మాయిని ఒక జ్యోతిష్యుని దగ్గరకు తీసుకోని పోయి చూపిస్తే ఈ అమ్మాయికి సంతానయోగం లేదు అని చెప్పినాడు.

మేము చాలా బాధపడ్దాము. 2006 డిసెంబర్ లో బాబా గురుజీలకు మా బాధను ఉత్తరం ద్వారా తెలియపరచుకున్నాము. బాబా, గురుజీల అధ్బుత దయవల్ల మా అమ్మాయి కొన్ని మాసములు తరువాత గర్బవతి అయింది.

మా ఆనందానికి అంతేలేదు. మా కుటుంబము చాలా సంతోషించినాము.

7వ నెలలో స్కానింగ్ తీయిస్తే పాప సరిగా పెరగలేదు.అబార్షన్ చేయించుకోవాలి లేకపోతే అమ్మాయికే ప్రమాదం అన్నారు.

మాకు చాలా బాధవేసింది. ఇదిగుడా బాబా అనుగ్రహమే అనుకుని 2008 జనవరిలో అబార్షన్ చేయింఛినాము,

బాబా అనుగ్రహబలము వల్ల వెంటనే మా అమ్మాయికి బాబు పుట్టాలి అని ప్రతి నిత్యం బాబాను ప్రార్దించెవాణ్ణి. నా కూతురుకు తోడుగా నాభార్యను గూడ హైదరాబాదు లోనే ఉంచినాను.

కాన్పు పుట్టింట్లో చేయాలి.  కావున వాళ్ళు జరుగుమల్లికి వచ్చేటందుకు తేది 5-12-2008 ఉదయాన్నే గం.3-00 లకు నాకు హైదరాబాదు నుండి ఫోను వచ్చింది.

మా అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించినారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయ్యాలి, 50 వేల రూపాయిలు కావాలని, అప్పటికప్పుడు 50 వేలు కావాలంటే మాటలతో అయ్యెపనికాదు.

నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. నాకు ఏకష్టం వచ్చినా బాబావారితో చెప్పుకోవడమే. నాకు ఏమి చేసేదానికి తోచలేదు.

బాబా ముందు కూర్చుని ఈ ఆపదనుండి నీవే కాపాడమని వేడుకున్నాను. గం.8-30 లకు తేలిక కానుపే అయింది. మగ పిల్లవాడు.

తల్లి, బిడ్డ ఇద్దరు క్షెమంగా ఉన్నారు అని మళ్ళీ ఫోన్ వచ్చింది.

నా ప్రార్ధన బాబా మన్నించి నా బిడ్డను రక్షించినారు.

అడిగినంతనే వరాలు ఇచ్చే కల్పతరువు బాబా! దీన జనులను ఆపదల నుండి రక్షించువాడు సాయి.

మనసా వాచా కర్మణా నమ్మిన వాళ్ళకు ఏ ఆపద రాకుండా  రక్షించు రక్షకుడు సాయి.

బాబావారిని ఎన్నివిదాలుగా పొగిడినా చాలా తక్కువే అవుతుంది.

గురుబంధువు,
కంచి ఆది శేషయ్య,
జరుగుమల్లి గ్రామం,
కోట మండలం, నెల్లూరు జీల్లా

సంపాదకీయం: సద్గురులీల(ఫిబ్రవరి  – 2009)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles