భికాజీ మహేద్జీ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

భికాజీ మహేద్జీ కేవలం నెలకు రూ.36/- సంపాదిస్తూ ఉండేవాడు. అతనికి చబూ అనే సోదరి ఉంది. ఆమె దాదాపు 4 నెలలుగా అనారోగ్యంతో భాదపడుతూ ఉంది. తేది 5-12-51న ఆమె అనారోగ్యం ఒక క్లిష్టమైన మలుపు తీసుకుంది, అందువల్ల ఆమెకు నయం కావాలని అతను చాలా ఆత్రుతతో ఉన్నాడు.

డాక్టర్ కొన్ని ఔషధములు వాడమని సలహా ఇచ్చాడు, కానీ తక్కువ జీతం మీద బ్రతికే అతనికి అది కష్టమయ్యింది. ఆ ఔషదములు వాడటం అతని వల్ల కాలేదు.

అంతటి భాదలో తను ఏమి చేయలేక నిట్టూర్పుతో విచారిస్తూ, సాయిబాబా నామం జపిస్తూ తన కార్యాలయ బాధ్యతలను చేసుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతని వద్దకు ఏదో విచారణ కోసం ఒక వైద్యుడు వచ్చాడు. అతడు అతనిని గుర్తించలేకపోయాడు.

శ్రీ సాయి కృప వలన డాక్టర్ స్వయంగా భికాతో తనకి గతంలో ఉన్న సంబంధం జ్ఞాపకం చేసుకుని అతనికి గుర్తు చేశాడు. అప్పుడు భికా అతనికి తన సోదరి అనారోగ్యం విషయం వివరించి, అతన్ని ఒకసారి ఆమెను పరిశీలించి తగిన ఔషధం సూచించమని అభ్యర్ధించాడు.

డాక్టర్ తక్షణమే భికా యొక్క అభ్యర్థన మన్నించాడు. డాక్టర్ సహాయంతో అతని సోదరికి నయమయ్యింది. ఆవిధంగా భికా చింత తొలగిపోయింది. బాబా తమ దయను తనలాంటి పేదవారిపై కూడా కురిపించడానికి సదా సిద్ధంగా ఉన్నారని భికా భావించాడు.

source: ‘శ్రీ సాయి ది సూపర్ మాన్’ – స్వామి సాయి శరణానంద

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles