‘‘ఇందాక చాలా ఆకలి వేసింది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. రొట్టె, అన్నం పెట్టావు. కడుపు నిండిపోయింది.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

బాబాని దర్శించుకునేందుకు శ్రీమతి తర్ఖడ్‌ షిరిడీకి చేరుకుందొకసారి. భోజనాల వేళ. ఆకలి వేస్తోందందరికీ. ముందు ప్రసాదం స్వీకరించి, తర్వాత బాబాని దర్శించుకుందాం అన్నారెవరో! దాంతో ఆమె భోజనశాలలో ప్రవేశించింది.

విస్తరి వేశారామెకు. పదార్ధాలన్నీ వడ్డించారు. బాబాకి ముందు నివేదించి, తర్వాత తాను తిందామనుకుందామె. అనుకున్నట్టుగానే విస్తరిని బాబాకి నివేదించింది.

తర్వాత తినేందుకు రొట్టె తుంచి నోట పెట్టుకోబోతుంటే, ఆమె ప్రక్కగా ఊరకుక్క ఒకటి వచ్చి నిలిచింది. శ్రీమతి తర్ఖడ్‌ చేతిలోని రొట్టె ముక్కనీ ఆమెనూ చూస్తూ తోక ఊపసాగిందది. పాపం! ఎంత ఆకలి మీద ఉందో ఏమో! జాలిపడిందామె.

చేతిలోని రొట్టె ముక్కను కుక్కకు పెట్టిందామె. రొట్టె అంతా పెట్టేంత వరకు అక్కణ్ణుంచి కుక్క కదల్లేదు. రొట్టె అయిపోగానే నాలికతో నోరు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.

విస్తరిలో పప్పుంది, అన్నం ఉంది. కలిపిందామె. ముద్ద తీసుకుని నోట పెట్టుకోబోతుంటే తోక ఊపుకుంటూ ఊరపంది వచ్చి నిలుచుందక్కడ.

బురదకొట్టుకుపోయి, భరించలేని దుర్వాసను వెదజల్లుతోంది. ‘పో పో’ అంటూ దానిని తరిమేందుకు ప్రయత్నించారు. వెళ్ళదే! శ్రీమతి తర్ఖడ్‌ చేతిలోని ముద్దను చూస్తూ తోక ఉపుతూ నిల్చుంది.

అర్థం అయింది ఆమెకు. పప్పు అన్నం ఉన్న విస్తరిని దాని ముందు ఉంచిందామె. గబగబా ఆనందంగా పప్పన్నం తిన్నది పంది. తిని, కృతజ్ఞతగా చూసిందామెను. వెళ్ళిపోయింది.

భోజనశాలలోకి కుక్కలూ, పందులూ ఎలా రాగలుగుతున్నాయంటూ పెద్ద గొడవ జరిగిందప్పుడు. వాటిని రాకుండా అడ్డుకోవాలన్నారు. అలాగే భక్తులకు పెట్టిన ప్రసాదాన్ని కుక్కలకూ, పందులకూ పెట్ట కూడదని హెచ్చరించారు. ఆ కోపంలో శ్రీమతి తర్ఖడ్‌కి మళ్ళీ విస్తరి వేయలేదు. బాధపడలేదామె.

బయటికి వచ్చి, రెండు జామపళ్ళు తిని, కడుపు నింపుకుంది. కాస్సేపటికి ద్వారకామాయికి చేరుకుంది. బాబా పాదాలకు నమస్కరించి, కూర్చుంది. ఆమెను నవ్వుతూ చూశారు బాబా. పెద్దగా తేన్చారు.

ఇలా అన్నారు.‘‘ఇందాక చాలా ఆకలి వేసింది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. రొట్టె, అన్నం పెట్టావు. కడుపు నిండిపోయింది.’’తను బాబా దగ్గరకి ఇప్పుడే వచ్చింది. అతని ఆకలి తనెప్పుడు తీర్చింది? అంతుపట్టలేదు శ్రీమతి తర్ఖడ్‌కి.

‘‘నేనెప్పుడు పెట్టాను బాబా’’ అడిగింది.‘‘ఇందాక పెట్టేవు కదమ్మా! కుక్కకి రొట్టె పెట్టావా, ఆ కుక్క ఎవరనుకున్నావు? నేనే! అలాగే పందికి పప్పన్నం పెట్టావా, ఆ పంది ఎవరనుకున్నావు? నేనే’’ అన్నారు బాబా.

‘‘బాబా’’ చేతులు జోడించింది శ్రీమతి తర్ఖడ్‌.‘‘పశుపక్ష్యాదులన్నిటా నేనున్నాను తల్లీ! వాటికి పెడితే నాకు పెట్టినట్టే! నా భక్తులు, నన్ను ఆరాధించడానికి ముందు, జంతువుల పట్లా, పక్షుల పట్లా ప్రేమాభిమానాలు పెంచుకుంటే చాలా సంతోషిస్తాను.

గొంతు ఆర్చుకుపోయినవారికి గుక్కెడు నీళ్ళు, ఆకలి కడుపునకు పిడికెడు మెతుకులు ఎవరందజేస్తారో వారితోడిదే నా లోకం. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టావు, నీకంతా మంచే జరుగుతుంది. అల్లా మాలిక్‌’’ అన్నారు బాబా.

కళ్ళు మూసుకున్నారు.బాబాని తదేకంగా చూడసాగింది శ్రీమతి తర్ఖడ్‌. ఆయన ముఖంలో జీవరాశులన్నీ గోచరించాయామెకు.

బాబా సింహంగా కనిపించారు. ఏనుగుగా కూడా కనిపించారు. పాముగా కనిపించారు. ముంగిసగా కనిపించారు. పులిగా కనిపించారు. జింకగా కనిపించారు.

అన్నిటా అంతటా బాబా కనిపించడంతో శ్రీమతి తర్ఖడ్‌కి బాబా విశ్వరూపాన్ని సందర్శించిన అనుభూతి కలిగింది.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles