Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-156-0512-అందరిలో నేనే వున్నాను 3:08
గురుబంధువులందరికి నా నమస్కారము. నా పేరు సాయిలక్ష్మీ.
నేను ఇబ్రహీంపట్నం దగ్గర యెంజాల్ లో(హైదరాబాద్ దగ్గరలో) సాయి అనుగ్రహంతో సాయి మందిర నిర్మాణంలో కేవలం నిమిత్రమాత్రంగా పాలుపంచుకొంటున్నాను.
బాబా నాకు ఎన్నో అనుభావాలిస్తూ మందిర నిర్మాణంలో ప్రతిక్షణం నాతొ వుంటున్నారు.
అందులో ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. మందిరం కట్టడం ప్రారంభించిన తరువాత నాకు తెలిసిన ఒకావిడ భర్త చనిపోతే ఆమెను ఓదార్చి, ఆమె భర్తని కడసారి చూపులు చూచెందుకు వెళ్ళాను.
పార్దివదేహం అక్కడుండగానే ఆమె సెల్ ఫోన్ పోయిందని ఆ నింద నా మీద మోపింది.
నేనే దొంగనని భర్త శవం అక్కడేవున్నా నన్ను నిందిస్తూ వుంది.
నేను ఏడుస్తూ నిర్మాణంలో వున్న సాయి మందిరానికి వచ్చి ఇలా అనుకున్నాను.
“అందరిలో నేనే వున్నాను అన్నావు. నన్నెందుకు దొంగ అన్నావు? నేను దొంగతనం చేసేదానిలాగా నీ కళ్ళకు కనపడుతున్నానా?
బాబా! రేపు ఉదయం లోపల నాకు ఈ విషయం చెప్పకపోతే నేను చచ్చిపోతాను” అని అనుకొంటూ రాత్రంతా నామం చేస్తూ గడిపాను.
తెల్లవారి 5 నిమిషాలు కళ్ళుముసుకొని ధ్యానం చేస్తువున్నాను. కళ్ళుతెరచి చూస్తే ఎదురుగా ఒక కాషాయ వస్త్రం ధరించిన ముదసలి నా వేళ్లకి పారాణి రాస్తున్నాడు. మీరెవ్వరు?
ఎక్కడ నుండి వచ్చారని అడిగాను. దానికి వారు “ఓం నమోనారాయనాయ” అన్నారు.
“నేను శిరిడీ నుండి వస్తున్నాను. బద్రినాథ్ వెళుతున్నాను. నేనక్కడే వుంటాను” అన్నాడు.
ఎందుకొచ్చారు అని నేను అడిగితే “ఒకామె సెల్ ఫోన్ పోయిందట ఇంకోకామేను దొంగ అని నిందించిందట.
ఆమె బాధపడుతోంది. ఓదార్చిరమ్మని బాబా పంపారు” అన్నాడు. నాకు వచ్చింది బాబా అని అర్ధం అయింది.
వెంటనే నన్ను దొంగ అని ఎందుకు అన్నారంటే దానికివారు” “కర్మ అమ్మ కర్మ అమ్మ.
కొంత ఓర్చుకొని అనుభవించాల. గతజన్మలో ఆమెను నీవు ఏమి అన్నావు నీకు తెలుసా?” అని నాకు ఒక గొడుగు, ఒక వస్త్రము, శ్రీ పాదవల్లభస్వామి చరిత్ర పుస్తకం ఇచ్చారు.
నీకు మందిరానికి డబ్బులు అవసరం అయి సమస్యవున్నపుడు ఈ వస్త్రం మీద కూర్చొని ధ్యానం చెయ్యి డబ్బులు వాటంతట అవే వస్తాయి అని చెప్పారు. మరలా ఎప్పుడొస్తారు? ఎలా?
అంటే ఇప్పుడెలా వచ్చానో మరలా అలాగే తప్పకుండా వస్తాను” మందిర నిర్మాణం చక్కగా జరుగుతుంది” అని మరలా పోయేటప్పుడు “వస్తాను స్వరాజ్యలక్ష్మీ” అని అంటు వెళ్లారు.
నేను ఆశ్చర్యంతో షాక్ అయాను. ఎందుకంటే మా తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికి తెలియదు. బాబా సర్వజ్ఞతకి పులకించి పోయాను.
సంపాదకీయం: సద్గురులీల (ఫిబ్రవరి – 2013)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నేను ఏ విధమైన కష్టం లేకుండా నా పిల్లలను నేనే చూసుకొగలుగుతున్నాను.–Audio
- నీ రాధాకృష్ణుణ్ణి నేనే! నేనే నిన్నిక్కడకి రమ్మన్నాను. సేవించుకుంటావో, సాధిస్తావో అంతా నీ ఇష్టం.’’
- “నేను వున్నాను, సమయానికి వస్తాను..” అని నిరూపించుకున్న బాబా వారు
- ఎంత ఆశ్చర్యము. నేను నీ వెంటనే వున్నాను.నీశ్చితంగా ఉండు–Audio
- బాబా తో పీకల్లోతు ప్రేమలో వున్నాను
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments