నేను ఏ విధమైన కష్టం లేకుండా నా పిల్లలను నేనే చూసుకొగలుగుతున్నాను.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-119-నేను ఏ విధమైన కష్టం లేకుండా 2:10

శ్రీ సాయినాధునికి ప్రణామములు తెలుపుకుంటూ, నా జీవితానుభవమును మీతో పంచుకుంటుంన్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది.

నా పేరు సరస్వతి, నాకు నలుగురు పిల్లలు. నాకు ఆఖరి కాన్పు ఒక గండంలా గడిచింది.

ఎందుకంటే మామూలు కాన్పు జరిగినా ఆ కాన్పు వేనుకదాగిన కధ, అందుకు బాబా చేసిన సహాయం వింటే మీకు కూడా బాబా అంటే భక్తీ కలిగి తీరుతుంది.
నాకు నాల్గవ కాన్పుకు ముందు కాళ్ళు, చేతుల నరముల బలహీనత ఎక్కువై తలలో నరములతో సహా లాగుతూ పిచ్చిదానివలె ప్రవర్తించసాగాను.

మా వారు మరియు మా పుట్టింటి వారు నన్ను చూపించని డాక్టర్లు లేరు, వెయించని తాయోత్తులు లేవు.

అలా వాళ్ళకు తోచింది వారు చేస్తున్నారే గాని, నాకు మాత్రం రాత్రులు నిద్ర పట్టడం లేదు,

ఒక్కటే భయం, ఎందుకో తెలియని ఆలోచనలు, గుండెదడ, నరముల బలహీనత.

నా పరిస్థితి నాకే అర్దమయ్యేది కాదు. నా తల్లిదండ్రులు నన్నూ, నా పిల్లలను చూసి మరీ అర్ధంకాని పరిస్థితిలో వేల దేవతలకు మొక్కుతున్నారు.

అలాంటి పరిస్థితిలో నాకు సాయినాధుని అండ దొరికింది అదెలాగంటే, మా పక్కింటి వారొకరు సాయిబాబా గురించి నాకు చెప్పి అయన ‘ఊదీ’ నాకు ఇచ్చి, నా ఆరోగ్యం కొరకు సాయి సచ్చరిత్ర పారాయణలు చేస్తూ వచ్చారు.

బాబా ఊదీ మరియు పారాయణల ఫలితంగానే నేను తిరిగి మామూలు మనిషినయ్యాను.

ఏ ఇబ్బందులు లేకుండా కాన్పు జరిగిపోయింది. ఇప్పుడు, నేను ఏ విధమైన కష్టం లేకుండా నా పిల్లలను నేనే చూసుకొగలుగుతున్నాను.

నాకు ప్రాణదానం చేసిన సాయినాధునికి సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటున్నాను.

పి సరస్వతి,
చిన్న బజారు, నెల్లూరు.

సంపాదకీయం: సద్గురులీల ( మే  – 2009 )
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles