Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-88-1113-నేనుండగా భయమేల-బాబా వారి కృపతో సుఖప్రసవం 2:26
శ్రీ శిరిడి సాయినాదునికి నా సాష్టాంగ నమస్కారములు. నాకు బాబా అంటే భక్తి. అది మాటలలో చెప్పలేను.
నా కూతురు 8వ నెల గర్భంతో ఉన్నపుడు బాబా నాకు చిన్న అనుభవము ఇచ్చారు,
ఈ చిన్న లీలని బాబా భక్తులు, గురుబంఢువులతొ పంచుకొనే సంకల్పాన్ని బాబా నాకు కల్పించారు.
మా అమ్మాయికి మొదటి కాన్పు 8వ నెల గర్భంతో ఉన్నపుడు కడుపులోని బిడ్డ తిరగలేదు.
పొట్ట కూడా రోజురోజుకూ తగ్గిపోసాగింది. ఏంటి ఇలా ఉందని మాకు భయమేసింది.
తర్వాత పాపని గూడూరు సి.అర్. రెడ్డి హాస్పిటల్ కు తిసుకెళ్ళాము.డాక్టరుగారు బెడ్ మీద పడుకోబెట్టి స్కానింగ్ తీశారు.హాస్పిటల్ కు తీసుకెళ్ళేటప్పుడు గూడూరు
బాబా గుడిలో నేను నా మనసులో బాబా మా అమ్మాయికి కాన్పు సవ్యంగా జరిగి, తల్లిని, బిడ్డని క్షేమంగా చూడు తండ్రీ అని బాబాకు చెప్పుకుని వెళ్ళాము.
డాక్టరు గారు స్వయంగా మాములుగా ఎవరికీ స్కానింగ్ తియరట. కాని మా అమ్మాయికి పొట్ట చిన్నగా మామూలుగా ఉండటంతో తీశారు.
పాపని బెడ్ మీద పడుకోపెట్టగానే పొట్ట 8వ నెల గర్భానికి ఉండవలసినంత వచ్చేసింది.
డాక్టరు గారు స్కానింగ్ తీసి లోపల బిడ్డ ఉమ్మనిళ్ళతొ తిరుగుతున్నాడు అని చెప్పారు.
మా అమ్మాయికి కనీసం చిన్న కుట్లు కూడా లేకుండా మామూలు ప్రసవం జరిగింది.
తల్లి, బిడ్డ ఆ బాబావారి దయతో క్షేమంగా ఉన్నారు.
తర్వాత నేను ఆ బిడ్డను 9వ నెలలో శిరిడికి తీసుకుని వెళ్ళటం కూడా జరిగింది.
ఇది అంతా అయన అనుగ్రహం. బాబా అన్నట్లుగా నా భక్తుల సర్వభాద్యతలు నావే. నేనుండగా భయమేల? అనే హామీలను నిరూపించారు.
డి. సరస్వతి
టెంకాయ తోపు, కోట.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సబూరి తో ఉన్న నాకు బాబా వారి కృపతో మెడనోప్పి, వెన్నునొప్పుల భాదలు తొలగిపోవుట
- నా ప్రార్ధన బాబా మన్నించి నా బిడ్డను రక్షించినారు.–Audio
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- బాబా వారి సేవ చేసిన భక్తురాలి కుమార్తెకు సాయినాథుని దయతో బ్యాంకు జాబ్ వచ్చుట.
- బాబా గురువుగారి అనుగ్రహం వల్ల మగ బిడ్డ ప్రసవం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నేనుండగా భయమేల? బాబా వారి కృపతో సుఖప్రసవం–Audio”
SaiRaghu
April 29, 2016 at 11:13 amVery Nice Experience..