40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము  కల్గినది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-86-1112-40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము  కల్గినది 3:33

బాబా నాకు ప్రసాదించిన అనుభవమును మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది.

నా పేరు పట్నం మునుస్వామి. మా నివాసము నెల్లూరు, వేదాయపళెం, వయస్సు 52 సంవత్సరాలు.

2009 సంవత్సరంలో నాకు కాలు, చేయ్యి , నోరు పడిపోయినాయి. డాక్టర్లు పక్షవాతముగా నిర్దారించినారు.

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమునాది.

నేను ఆటోడైవర్ ని. నేను డాక్టరుకు చూపింఛినపుడు వారు నీకు 50 సంవత్సరములు దాటినది కాబట్టి కాలు, చెయ్యి, నోరు రావడం కుదరదు.

నయమైనాకొంచెం నయం కావాల్సిందే కాని పూర్తిగా నయంకాదు.

నీవు ఆటో డ్రైవింగ్ చేయటం కుదరదు అన్నారు. మంచము మీద నుండి నా భార్య నన్ను లేపితే లేచి కర్రపట్టుకొని నిలబడి ఆమెను పట్టుకొని వాకిట్లో అరుగుదాక వచ్చి అరుగు మీద పడుకునేవాడిని.

ఒక రోజు ఇంటి ముందుగల అరుగుమీద పడుకొని వున్నాను.

ఆ రోజు గురువారము. బాబావారిని చిన్న బండిలో పెట్టుకొని ఒక ఆయనవచ్చి దక్షిణ అడిగినాడు.

నా భార్య ఇంటిలో నుండి బియ్యం తీసుకొనివచ్చి ఆయన పాత్రలోవేసింది.

అప్పుడు నేను బాబావారితో బాబా పెళ్ళికి ఎదిగిన కూతురు ఇంట్లో వుంది.

నేను చుస్తే లేవలేని పరిస్థితి. ఇల్లు జరగడం కూడా కష్టంగా వుంది. నాకు ఏమో ఈ పరిస్థితుల్లో చనిపోవాలని అనిపిస్తున్నది.

మీరే దిక్కు అని నమస్కారము చేసుకున్నాను.

ప్రక్కరోజు చెయ్యిలో కొద్దిగా కదలిక వచ్చింది. రోజురోజుకి కాలు,చెయ్యి,నోరులో గుణముకనిపిస్తూ వస్తున్నది.

40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము  కల్గినది. మామూలు మనిషిలా తయ్యరయ్యను.

40 రోజులుగా దుమ్ముపట్టిన ఆటో బయటకు తీసి “బాబావారి” కృపతో నడపగాలిగాను.

కొంతకాలానికి మా అమ్మాయికి పైసా నా దగ్గర లేకపోయినా బాబా కృపతో బంధువుల సహాయ సహకారములతో పెండ్లి చేయగలిగాను.

నా ఆరోగ్యం బాగాయినప్పతినుండి బాబాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిచడం అలవాటు అయిపొయింది.

నేను శిరిడిపోగలనా? అని అనుకున్నాను.అటువంటిది బాబావారి కృపతో శిరిడీకిపోయి బాబాను కూడా దర్శించుకొని వచ్చాను.

వెదయపాళెం, అయ్యప్పగుడి ఎదురుగా ఉండే బాబాగుడిలో ప్రతి గురువారము అన్న ప్రసాద వినియోగంలో(అన్నదానం) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి బాబా సేవ చేసుకొంటున్నాను.

గతం కన్నా ఇప్పుడు ఎంతో మనశ్శాంతిగా వున్నాను.

బాబావారు చేసిన మేలు జేవితాంతము మరచిపోలేను. బాబాకి ఏమి చేసినా ఆయన ఋణము తిర్చుకోలేను.

ఆయన నాకు పురర్జన్మను ప్రసాదించి, నా కుమార్తె వివాహం చేయించి, నాకు శిరిడి దర్శనము ప్రసాదించిన బాబాకి కృతజ్ఞతా పూర్వక సాష్ట్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను

మునుస్వామి
వేదాయపళెం,నెల్లూరు..

 సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “40 రోజులకి పూర్తిగా ఆరోగ్యము  కల్గినది–Audio

baskar palle

Grete experience with baba..jai sai ram

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles