చిన్ననాటి స్నేహితునితో కలయిక (తాత్యాసాహెబ్ నూల్కర్)–Tatya Saheb Nulkar.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

  1. noolkar 9:12

చిన్ననాటి స్నేహితునితో కలయిక:

తాత్యాసాహెబ్ నూల్కర్, మరియు బాబా సాహెబ్ (అసలు పేరు నీలకంఠ రామచంద్ర సహస్రబుధ్ధి) చిన్ననాటి స్నేహితులు.

ఇరువురూ పూనా హైస్కూల్ లో కలసి చదువుకొన్నారు. విచిత్రమైన పరిస్థితులలో ఇద్దరూ 30 సంవత్సరాల తరువాత షిరిడీలో కలుసుకొన్నారు.

నిజానికి తాత్యాసాహెబ్ బాబాసాహెబ్ ని గుర్తించలేదు.

కాని బాబాసాహెబ్ తాత్యాసాహెబ్ ని గుర్తించి (తాత్యాసాహెబ్ చిన్ననాటినుండి పొట్టిగా లావుగా ఉండేవారు) తన పేరు చెప్పగానే తాత్యాసాహెబ్ ఆనందంతో బాబాసాహెబ్ ని కౌగలించుకొన్నారు.

ఇరువురు తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొన్నారు. తాత్యాసాహెబ్ కోరికపై బాబా సాహెబ్ తాత్యాసాహెబ్ యొక్క అతిధిగా అతని ఇంట ఉండటానికి అంగీకరించి, స్నానము చేసిన తరువాత ఇరువురు బాపు సాహెబ్ జోగ్ తో కలసి శ్రీసాయి దర్శనానికి వెళ్ళారు.

బాబాసాహెబ్ (నీలకంఠ రామచంద్ర సహస్రబుధ్ధి) శ్రీసాయికి సాష్ఠాంగ నమస్కారము చేస్తున్నపుడు శ్రీసాయి బాబాసాహెబ్ ను ఉద్దేశించి,

“నీవు నీ చిన్ననాటి స్నేహితుడు తాత్యాసాహెబ్ సేవ చేసుకో” అన్నారు.

ఈమాటలు అక్కడ ఉన్నవారికి చాలా వింతగా అనిపించాయి. వరసగా మూడురోజులు శ్రీసాయి ఈవిధముగా అన్నతర్వాత కూడా బాబాసాహెబ్ ఈవిషయాన్ని హాస్యాస్పద విషయంగానే భావించి తాత్యాసాహెబ్ నూల్కర్ తో

“మిత్రమా నీగురువు ఆజ్ఞ ప్రకారము ఏవిధమైన సేవ నీకు చేయాలి” అనేవాడు.

కాని తాత్యాసాహెబ్ ఈవిషయంపై గంభీరముగా ఆలోచించసాగారు. శ్రీసాయి మాటలను హాస్యాస్పదముగా తీసుకోవలదని తాత్యాసాహెబ్, బాబా సాహెబుతో అన్నారు.

శ్రీసాయి మాటలలోని నిజాన్ని కాలమే వెల్లడించుతుందని అక్కడివారు భావించారు.

కొద్దిరోజులు షిరిడీలో గడిపిన తరువాత బాబాసాహెబ్ తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని శ్రీసాయి అనుమతిని కోరినప్పుడు,

శ్రీసాయి అనుమతిని నిరాకరించి ఇంకా కొద్ది రోజులు ఉండమని ఆదేశించారు. ఈవిషయంలో బాబా సాహెబ్ శ్రీమాధవరావు దేశ్ పాండే (శ్యామా) సహాయమును అర్ధించారు.

శ్యామా ఈవిషయాన్ని సాయితో ప్రస్తావించినపుడు శ్రీసాయి చికాకుతో అన్నమాటలు

“శ్యామా, బాబాసాహెబ్ షిరిడీలొ ఒక ముఖ్యమైన పని నిర్వహించటానికి రప్పించబడినాడు.

ఆపని పూర్తికాకుండా షిరిడీ వదలి వెళ్ళకూడదు.

అందుచేతనే అతన్ని షిరిడీ వదలి వెళ్ళటానికి అనుమతిని నిరాకరించాను”.

శ్రీసాయి ఈవిధంగా అన్న తర్వాత శ్యామా కూడా ఏమీ చేయలేకపోయారు.

తాత్యాసాహెబ్ అస్వస్థత – బాబాసాహెబ్ సేవ

శ్రీసాయి, బాబాసాహెబ్ ను షిరిడీ విడిచివెళ్ళవద్దని చెప్పిన పదిహేను రోజుల తర్వాత, తాత్యాసాహెబ్ నడుము క్రింద భాగాన రాచకురుపు (కార్బంకుల్) కలిగింది.

అసలే మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తాత్యాసాహెబ్ నూల్కర్. ఆకారణంచేత రాచకురుపుతో బాధ ఎక్కువ కాసాగింది. షిరిడీ గ్రామములో సరైన డాక్టర్లు కూడా లేరు.

తండ్రికి సేవ చేయడానికి తాత్యాసాహెబ్ నూల్కర్ పెద్ద కుమారుడు డాక్టర్ వామనరావు నూల్కర్ ఎల్.ఎం.ఎస్. రప్పించబడ్డారు.

షిరిడీ గ్రామంలో ఇంగ్లీషు మందులు దొరకవు. బొంబాయినుండి మందులు, శస్త్ర పరికరాలు తెప్పించి, బాబాసాహెబ్ సహాయముతో డాక్టర్ వామనరావు ఆపరేషన్ పూర్తి చేశారు.

ఒక కురుపుకు ఆపరేషన్ చేసి కట్టు కట్టిన తర్వాత ఇంకొక కురుపు రాసాగింది.

ఆవిధముగా మొత్తము పదకొండు రాచకురుపులు నడుము మీద, నడ్డిమీద, కాలి పిఱ్ఱల మీద వచ్చాయి. మధుమేహము వ్యాధి వల్ల ఆపరేషన్ చేసినా ఆకురుపులు మానటం పెద్ద సమస్యగా మారిపోయింది.

రాతింబవళ్ళు చిన్ననాటి స్నేహితుడు బాబాసాహెబ్ (నీలకంఠ రామచంద్ర సహస్రబుద్ధి) సేవ చేయసాగారు. స్నేహితులు యిద్దరు శ్రీసాయి అన్నమాటలలోని నిజమును గ్రహించారు.

వ్యాధిగ్రస్థుడైన తాత్యాసాహెబ్ కు శ్రీసాయి దర్శనము ఇచ్చుట:

దినదినానికి వ్యాధి ఎక్కువ కాసాగింది. శారీరకముగా విపరీతమైన బాధ అనుభవించుతున్నా,

మానసికముగా ప్రశాంతంగా ఉన్నారు తాత్యాసాహెబ్ నూల్కర్. ప్రాపంచిక కోరికలకు అతీతంగా, ఆధ్యాత్మిక చింతనతో తన ఆఖరి రోజులు గడపసాగారు.

మంచము మీద ఒక ప్రక్కనుండి ఇంకొక ప్రక్కకు తిరగవలెనంటే తిరగలేని స్థితిలో ఉన్నారు శ్రీనూల్కర్.

అటువంటి స్థితిలో కూడా అనుక్షణము ద్వారకామాయిలోని విశేషాలను గురించి శ్రీసాయి గురించి అడిగి తెలుసుకొనేవారు.

జలగాంలో ఉన్న తల్లిని, సోదరులను పిలవటానికి టెలిగ్రాం ఇవ్వటానికి అతని స్నేహితుడు బాబాసాహెబ్ సిధ్ధపడినప్పుడు తనకు ఎవరినీ చూడాలని లేదనీ,

ఎవరికీ కష్ఠము కలిగించవద్దని, తనను ప్రశాంతముగా శ్రీసాయినామము జపించుతు ఉండనివ్వమని అన్నారు.

తాత్యాసాహెబ్ వ్యాధిగ్రస్థుడై మంచమునుండి లేవలేని స్థితిలో ఉండి, శ్రీసాయిదర్శనమునకు వెళ్ళలేకపోతున్నానే అని బాధపడసాగారు.

శ్రీసాయి ప్రతిదినము ద్వారకామాయినుండి సాఠేవాడా మీదుగా లెండిబాగ్ కు వెళ్ళేవారు. వారు సాధారణముగా ఎవరియింటికి వెళ్ళేవారు కాదు.

శ్రీసాయి సాఠేవాడా దగ్గరనుండి లెండిబాగ్ కు వెళ్ళే సమయములో సాఠేవాడాలోనికి వచ్చి తనకు దర్శనము యిచ్చిన బాగుండును అనే కోరికతో జీవించసాగారు శ్రీనూల్కర్.

శ్రీసాయిని దర్శించాలి అనే ప్రగాఢమైన కోరికతో తన కోరికను శ్రీసాయికి తెలియచేయమని తన పెద్దకుమారుడు డాక్టర్ వామన్ రావును ద్వారకామాయికి పంపించారు శ్రీనూల్కర్.

తన తండ్రి కోరికను శ్రీసాయికి తెలియపర్చారు డాక్టర్ వామన్ రావు. ఆసమయంలో శ్రీసాయి ద్వారకామాయిలో చిన్న పిల్లలతో ఆటలు ఆడుతున్నారు.

డాక్టర్ వామనరావు కోరిక విని “తాత్యాభాకు తప్పక దర్శనము యిస్తాను. అల్లా భలాకరేగా” అని అన్నారు.

తిరిగి చిన్నపిల్లలతో ఆటలు ఆడసాగారు. తన తండ్రి కోరిక ప్రకారం శ్రీసాయిని సాఠేవాడాకు తీసుకొనివెళ్ళటానికి ద్వారకామాయిలో నిలబడి ఉన్నారు డాక్టర్ వామన్ రావు.
అదే సమయములో ద్వారకా మాయి ముందర ఒక బట్టలవ్యాపారి రంగురంగుల బట్టలు అమ్మకానికి తీసుకొని వచ్చాడు శ్యామా తమ్ముడు బాపాజి తన కోసం ఒక రంగు వస్త్రము కొని తన తలకు చుట్టుకొన్నాడు.

శ్రీసాయి బాపాజి దగ్గరకు వచ్చి బాపాజి తలకు చుట్టబడిన వస్త్రాన్ని తీసుకొని తన తలకు చుట్టుకొన్నారు.

బాపాజి తిరిగి ఆవస్త్రాన్ని తీసుకొని తన తలకు చుట్టుకొన్నారు. ఈవిధముగా శ్రీసాయి మరియు బాపాజి ఆ రంగువస్త్రముతో ఆటలు ఆడుకొంటుంటే,

తాత్యాసాహెబ్ కుమారుడు డాక్టర్ వామనరావు సహనాన్ని కోల్పోయి సాఠేవాడకు కోపముతో వచ్చి

“సాయికి భక్తుల విషయాలు అనవసరము. పిల్లలతోను, ఇతరులతోను ఆటలు ఆడుకోవటమే ముఖ్యము అని శ్రీసాయిపై నింద మోపాడు. “ద్వారకామాయిలో ఏమిజరిగినది,

ఎందుకు చికాకుపడుతున్నారు” అని తన కుమారుడు డాక్టర్ వామనరావును శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ ప్రశ్నించారు.

ద్వారకామాయిలో శ్రీసాయికి తాను తన తండ్రి కోరికను తెలియపర్చినప్పటినుండి తను సహనాన్ని కోల్పోయి బయటకు వచ్చినంతవరకు జరిగిన సంఘటనలు అన్నీ తన తండ్రికి చెప్పారు శ్రీవామన్ రావు.

తన కుమారుడు ద్వారకామాయిలో శ్రీసాయి పిల్లలతో ఆటలు ఆడటము, బాపాజితో రంగు వస్త్రముతో ఆటలు ఆడటము చెబుతున్నపుడు తాత్యాసాహెబ్ నూల్కర్ కళ్ళలో ఆనందభాష్పాలు రాసాగాయి.

తండ్రి ఆనందానికి కారణము ఏమిటి అని వామనరావు ఆలోచించుతూ, తనకు వివరముగా చెప్పమని తండ్రిని కోరాడు.

ద్వారకామాయిలో ఉన్న శ్రీసాయి, చిన్నపిల్లలతోను, బాపాజీతోను ఆటలు ఆడే దృశ్యాన్ని తాత్యాసాహెబ్ నూల్కర్ కు సాఠేవాడలోని అతని గదిలోనే చూపించారు.

ఈవిధముగా తాత్యాసాహెబ్ నూల్కర్ కు శ్రీసాయి దర్శనము ఇచ్చారు. ఎంతటి అదృష్ఠవంతుడు శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్?

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “చిన్ననాటి స్నేహితునితో కలయిక (తాత్యాసాహెబ్ నూల్కర్)–Tatya Saheb Nulkar.

Sai Baba

We don’t have any words to describe…infinite devotion on Baba….the most blessed voice…We are very lucky to listen your voice..Thank you mam…Thank you Baba for your blessings on this site.

Sai

సాయి బాబా లీలలు చాలా అద్భుతంగా ఉన్నాయి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles