నా భక్తులకు ఏ కష్టం రానివ్వను



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా భక్తులు విశ్వనాథ్ భవరాజు గారు తన ప్రియమైన సాయి బాబా యొక్క అద్భుతమైన అనుభవాలను saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవాలని ఇచ్చారు. వారికీ వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు సదా ఉండుగాక!

అనుభవము 1 :

బహుశ ఈ సంఘటన గత సంవత్సరం జరిగింది. మా ఇంటికి పక్కన ఉన్న ఇంటిలో ఒక కుటుంబం కొత్తగా వేరే ప్రాంతం నుండి వచ్చి దిగారు. ఆ కుటుంబంలో ఒక జంట మరియు వారి చిన్న కుమార్తె వయస్సు 3 సంవత్సరాలు ఉన్నారు. తొందరగానే మా కుటుంబంతో వాళ్ళకి మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు మా అమ్మ గారు వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్.

నేను ఆమెను అక్కా అని పిలుస్తాను ఆమె నన్ను చాలా అభిమానంతో చూసుకొనేది. ప్రతి మంగళవారం ఒక సంత జరుగుతుంది. మేము అక్కడ కూరగాయలు మరియు కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తుంటాము. ఒక రోజు నా తల్లి సంతకు వెళ్తూ అక్కను “నువ్వు వస్తావా” అని అడిగారు. అక్క సరేనని తన చిన్న కుమార్తెతో కలిసి బయలుదేరారు.

వారు సంతకు వెళ్లి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళ చిన్న అమ్మాయి అకస్మాత్తుగా కనిపించలేదు. ఆ స్థలం అసలే కిడ్నాప్లు,, దోపిడీలు మరియు అనేక ప్రమాదాలకు నెలవు. అందువలన వాళ్ళు చాలా టెన్షన్ పడి ప్రతిచోటా వెతకడం ప్రారంభించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఒక గంటపాటు అంత వెతికి, ప్రతి ఒక్కరినీ విచారించారు. కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది.

అక్కా నిలువరించకోలేక ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో అమ్మకు అక్కను ఓదార్చడం కష్టమైంది. ఏమి చేయాలో తోచలేదు. వారు సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇవ్వాలని భావించారు. మొదటిసారి నేనే వీళ్ళని సంతకు తీసుకువచ్చాను, అందువలన పాప కనిపించకపోవడానికి కూడా నేనే భాద్యురలినని అమ్మ మనస్సులోనే బాధపడింది.

నా తల్లి బాబా భక్తురాలు. ఆమె “బాబా బిడ్డని రక్షించండి” అని హృదయపూర్వకంగా ప్రార్ధించారు. సరిగ్గా ఆమె మనసులో ప్రార్ధన పూర్తీ చేసిన వెంటనే ఆమె వెనుక నుండి “అమ్మ! ఈ పాపా కోసం వెతుకుతున్నారా?” అని వినిపించింది. పాపను చూసి నా తల్లి ఆశ్చర్యపోయింది. ఒక వృద్ధుడు పాపను పాప తల్లి మా అమ్మ వెనకనే ఉన్న ఆమెకు ఇవ్వకుండా మా అమ్మకు అందించారు.

ఇది చాలా ఆశ్చర్యకరముగా అనిపించింది. పాప బిగ్గరగా ఏడుస్తుంది. మా అమ్మ పాపను తీసుకోని అక్కకు ఇచ్చి చూసేసరికి వృద్ధుడు అక్కడ లేడు. అన్ని వైపులా ఆమె చూసింది కాని అతని జాడ కనిపించలేదు.

ఆ వృద్ధుడు ఎవరు అయి ఉంటారు? పాపను నా తల్లికి ఎందుకు ఇచ్చారు? మనల్ని ఎవరు కాపాడుతుంటారు, మన లోపలి ప్రార్థనలను ఎవరు వినగలుగుతారు? మన హృదయవాసుడై సదా మనతో ఉంటూ, మనకు కష్టం వచ్చిన వెంటనే రక్షణ ఇచ్చేది బాబా కాక ఇంకెవరు.

అయన చూపే కరుణకు మనం ఆయనకు ఎలా కృతఙ్ఞతలు చెప్పగలం?

“నా భక్తులకు ఏ కష్టం రానివ్వను” అన్న బాబా మాటకు నిదర్శనము ఈ సంఘటన

రేపు రెండవ అనుభవం.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles