Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ నా నమష్కారములు. నేను భువనేశ్వర్ నుండి మాధవి. మీకు గుర్తు ఉండి ఉంటాను. ఈ మద్యనే నాకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు రీసెంట్ గా 15 రోజుల క్రితం కలిగిన ఒక అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను.
కలలకు మన శాస్త్రాలలో ప్రమాణాలు ఉన్నాయి. మనం రోజు చదివే సాయి సచ్చరిత్రలో కూడా బాబా కలలకు ప్రాధాన్యత ఇచ్చారు. భీమాజీ పాటిల్ కు కలలో జబ్బు నయం చేయడం, మేఘకు కలలో జై సచ్చిదానంద మంత్రం ఇవ్వడం, ఆఖరికి బాబా సమాధి చెందిన తర్వాత పండరి పురం లో ఉన్న దాసగాణు కు స్వప్నం లోనే తాము సమాధి చెందిన విషయం తెలియజేసారు బాబా. ఇలా చాలా ఇప్పటికి బాబా కలలో మనకు చెప్తుంటారు. అటువంటిదే నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అనుభవం.
నేను జన్మతః శ్రీ వైష్ణవ కుంటుంబానికి చెందినదాన్ని. విష్ణు భగవానుడు నా ఇష్ట దైవం. అంటే తిరుపతి వేంకటేశ్వర స్వామి. ఆంధ్రులు అందరికి మదిలో మెదులుతూ ఉంటారు ఆ స్వామి.
ఈ మద్యనే ఒక ప్రియమైన సాయి బంధువు యొక్క సంకల్పం నేరవెరలాని నేను 108 రోజులు రోజు విష్ణు సహస్రనామలు పారాయణ చేయాలని సంకల్పం తో నెల పదిహేను రోజుల క్రితం మొదలుపెట్టాను. బహుశ నాకు వచ్చిన కలకు ఇదే ఆధారంగా బావిస్తున్నాను.
నేను కలలో తిరుపతి వెళ్ళాను. వేంకటేశ్వర స్వామి సన్నిదిలో నిలబడి నయనానందకరంగా ఆ దివ్య మూర్తిని 30 నిమషాలు దర్శించాను. నన్ను నేను మైమరిచిపోయాను. ఆ స్వామి ఆనందనందనుడు. అమృత హృదయుడు.
నా ఆనందానికి ఆ ఆనంద నిలయంలో హద్దులు లేవు. ఇంతలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు నన్ను గర్బ గుడిలోకి పిలిచారు. ముందు భయపడ్డాను. 30 నిమషాలు దర్శనం చేసుకున్నానని చీవాట్లు పెడతారు అనుకున్నాను.
కానీ ఆ స్వామి ఎదురుగానే నాకు ఒక తెల్ల కాగితంతో పెద్ద పొట్లం ఇచ్చారు. నేను లడ్డు, లేకుంటే వడ, లేదా పులిహోర, లేకపోతె పొంగలి, లేదా పసుపు కుంకుమ, అక్షితలు ఇలా ఏదో అయివుండొచ్చు అనుకున్నాను. ఆ పొట్లం విప్పి చూసాను కదా! ఆశ్చర్యకరంతో అలా నిలబడిపోయాను. అందులో ఏముందో తెలుసా?
అందులో ఉన్నది ద్వారకమాయి లోని పాపాలను హరించి, దుఃఖంలను, రోగాలను, కష్టాలను దూరం చేసే సాయిశ్వరుని యోగాగ్నితో వెలిగిన దునిమాయి విభూతి.
తిరుపతి వేంకటేశ్వర స్వామి గర్బ గుడిలో ప్రధాన అర్చుకులు విభూతి ఎవ్వడమా? యెంత ఆశ్యర్యం! నా ఆశ్చర్యానికి అంతు ఈ రోజు వరకు చిక్కలేదు. “ఆ స్వామి ఆ సాయినాధుడు అదే చిరునవ్వుతో అంతరాత్మలో నన్ను నింపుకొని ఎక్కడకు ఏ తీర్ధాలకు, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన అంతటా నేనే వున్నాను” అంటున్నారు.
ఈవిధంగా తిరుపతిలో వేంకటేశ్వర స్వామి, నేను వేరు కాదు ఇద్దరం ఒక్కటే అని సాయినాధుడు తెలియజేస్తున్నారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- బాబాను వదిలి వెళ్ళితే నీరైనా దొరకదని గ్రహించిన శివనేశన్ స్వామి
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
- ఆళంది స్వామి
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments