తనను నమ్మి కొలిచే భక్త జనావళిని శ్రీ సాయి సురక్షితం గా ఈ భవ సాగరాన్నిదాటిస్తారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

1914 వ సంవత్సరం లో మహా శివరాత్రి పర్వ దినం ముందు రోజున హార్ధా అనే గ్రామం లో మేజిస్ట్రేట్ గా పని చేసిన చోటా భయ్యా తన కుటుంబం తో హఠాత్తు గా శిరిడీ ప్రయాణం కట్టాడు.

వారు టాంగా లో నేమేవర్ అనే నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడిపోయింది. పడవ నడిపేవారు తమ పడవ లన్నింటినీ కట్టేసారు. ఎంత డబ్బిస్తామన్నా పడవ వేయడానికి వారు ససేమిరా ఒప్పుకోలేదు. 

ఇక ఆ నది ఒడ్డునే తమకు రాత్రం తా గడపక తప్పదని ఆందోళన పడిన చోటా భయ్యా తమను కరుణించమని శ్రీ సాయిని హృదయపూర్వకం గాప్రార్ధించాడు. 

ఇంతలో హఠాత్తుగా సాయి వలే తలగుడ్ద, కఫ్నీను ధరించిన ఒక ముదుసలి వ్యక్తి వీరి వద్దకు వచ్చి ” ఆడవారిని, చిన్న పిల్లలను తీసుకొని ఇంత పొద్దు పోయి వచ్చారేమి? అయినా ఏం భయపడవద్దు. పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ళ యజమాని వచ్చినా మిమ్మల్ని నది దాటించాలి.  కొద్ది సేపట్లో ఈ పడవ వారే మిమ్మల్ని నది దాటిస్తారు” అని చెప్పి పది అడుగులు వేసి ఇక కన్పించలేదు.

కొద్ది సేపటికే ఆ పడవ నడిపే వారు వచ్చి సామానులన్నింటినీ పడవలో సర్ధి అందరినీ పడవ ఎక్కమన్నారు. “మీకు పడవ వేయనందుకు మా పై ఆఫీసరు గారు మమ్మల్ని పిలిచి చెడా మడా తిట్టారు” అని చెప్పారు.

బాడుగ ఎంతోచెప్పమంటే,  “మీ చిత్తమొచ్చినంత ఇవ్వండి. లేకుంటే ఏమి ఇవ్వకండి. మీరు బాడుగ ఇవ్వకపోయినా ఫరవాలేదు, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాం” అని చెప్పి ఆ బెస్తవారు చోటా భయ్యా పరివారమంతటినీ సురక్షితం గా అవతలి ఒడ్డుకు చేర్చారు.

ఆ మర్నాడు శిరిడీ చేరాక తమను దర్శించిన చోటాభయ్యా పరివారం తో శ్రీ సాయి “చూడండి! నేను కల్పించుకోక పోయినట్లయితే మీకు ఎంత ఇబ్బంది ఎదురయ్యేదో?” అని క్రితం రోజు జరిగిన సంఘటన నంతటినీ వర్ణించి చెప్పారు. 

తనను నమ్మి కొలిచే భక్త జనావళిని శ్రీ సాయి సురక్షితం గా ఈ భవ సాగరాన్నిదాటిస్తారనడం లో ఎటువంటి సందేహం లేదు .

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles