Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు స్టాలిన్, ప్రస్తుతం హైదరాబాదులోని చింతలులో ఉంటున్నాము. బాబాతో నా మొదటి అనుభవము సాయి బంధువులంద- రితో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు బాబా వారికీ నా నమస్కారములు.
2007-2008 సంవత్సరంలో నా జీవితం బాగానే జరుగుతుంది కాని, ఏదో వెలితిగా ఉండేది.
నిత్యం సంఘర్షణామయంగా ఉండేది. నాకు మా బ్రదర్ పూణే నుండి ఫోన్ చేసి “అన్నా బాబాని నమ్ముకో నీకు మంచి జరుగుతుంది” అని చెప్పాడు.
ఫోనులో చెప్పిన నేను పెద్దగా పట్టించుకో- లేదు. నాకు గుడికి వెళ్ళడం, దేవుడిని పూజించటం, బాబాలు అంటే ఇష్టం లేదు.
చిన్న చూపు ఉండేది. ఒకరోజు మా బ్రదర్ కిశోర్ బాబు ఫోన్ చేసి బాబా “సచ్చరిత్ర” పారాయణం చేయి అని చెప్పినాడు.
నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త విషయాలు తెలుసుకొని పదిమందితో పంచుకోవడం చాలా ఇష్టం. సరే బుక్ పంపించు నేను పారాయణం చేస్తాను అని చెప్పాను. మా బ్రదర్ పూణే నుండి నేను హైదరాబాదు వస్తున్నాను. బుక్ తెస్తాను అని చెప్పినాడు.
మా బ్రదర్ “బాబా” ని నమ్మటం నాకు విచిత్రంగా తోచింది. ఎందుకంటే మా బ్రదర్ “ఆంజనేయుడి” భక్తుడు. ఒక దేవుడు ఉండగా ఇంకా వేరే వాళ్ళని పూజించటం ఎందుకు అని అనుకున్నాడట.
నన్ను, బాబాతో అనుభవం వ్రాయమని నా మిత్రుడు, గురుబంధువు సాయి పథం శ్రీను అడిగినప్పుడు; బాబాతో మనకున్న బంధం ఇతరులకి చెప్పటం అంత అవసరమా? బాబా ఎవరినైనా భక్తుడిగా, తన శిష్యునిగా చేసుకోవాలంటే బాబానే తన గురించి తాను చెప్పుకోవటం జరుగుతుంది గదా! అని అనుకొనేవాడిని.
కానీ “బాబా”కి నేను భక్తుడిగా అయిన విధానంలో “బాబా మిరాకాల్స్, లీలలు” వినటం వలనే నేను ఎoతో ప్రేరణ పొందాను కనుక ఈ అనుభవం వ్రాస్తున్నాను. బాబా నా జీవితంలో “ఎoతో చేసారు, చేస్తున్నారు, చేస్తారు.” అవన్నీ చెప్పాలంటే చాలా కష్టం.
ఇక నేను బాబాకి ఎలా భక్తుడను అయింది చెప్తాను. మా బ్రదర్ పూణే నుండి హైదరాబాదు వస్తూ నాకు “సచ్చరిత్ర” బుక్ తెచ్చి ఇస్తానని చెప్పాడు కదా! కానీ అతను ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు బుక్ మరచిపోయాడట.
మళ్ళీ బాబా గుర్తు చేసి వెనక్కి పంపారట. మా బ్రదర్ బుక్ బ్యాగ్ లో పెట్టుకొని హైదరాబాదు బయలుదేరారు.
అమీరుపేటలో మైత్రివనం దగ్గర దిగి, మా బ్రదర్ అమీరుపేటలో ఉన్న తన ఫ్రెండ్ రూమ్ లో ఫ్రేష్ ఆప్ అయ్యి, పని చూసుకొని వీలుంటే చింతల్ వద్దాము, లేదంటే తన ఫ్రెండ్ కి బుక్ ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పుదాము అని అనుకున్నాడట.
త్వరగా మళ్ళీ పూణే వెళ్లిపోవాలట. మా బ్రదర్ అమీరుపేట ఫ్రెండ్ కి కాల్ చేస్తుంటే ఫోన్ కనెక్ట్ కావటం లేదట.
అంతలో ఎవరో తెలియని “ఒక పిల్లవాడు” మా బ్రదర్ దగ్గరికి వచ్చి “జీడిమెట్ల” “9” నెంబర్ బస్ వెళ్తుందని చెప్పాడట.
మా బ్రదర్ కిశోర్ అడగకుండానే ఈ పిల్లవాడు నాకు ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించుకునే లోపే “9” నెంబర్ బస్ వచ్చి మా బ్రదర్ ముందు ఆగిందట.
బస్ ఎక్కి చింతల్ వచ్చి నాకు బుక్ ఇచ్చి జరిగిన సంగతి చెప్తుంటే ఎందుకో నాకు కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.
ఈ బుక్ చదివిన 7 రోజులలోపు నీకు “బాబా” కనిపిస్తాడు అని మా బ్రదర్ కిశోర్ చెప్పాడు.
మా బ్రదర్ మాటల్ని బట్టి అతను పీకల్లోతు బాబా ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు అని నాకు అనిపించింది.
నాకు బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా! బుక్ చదవటం మొదలు పెట్టాను. మా బ్రదర్ చెప్పినట్లు 7 రోజలలోపు నాకు బాబా దర్శనం కూడా కలిగింది. ఈ మిరాకల్ శ్రద్ధగా శ్రవణం చేయండి.
అది రంజాన్ మాసం. నేను నా మిత్రుడు కలిసి హైదరాబాదు, చింతల్ లోని ‘షాహన్ షా’ సినిమా ధియేటర్ దగ్గర టీ కేఫ్ లో హలీమ్ తిని మధ్యాహ్నం 3 గంటలకి ఏదో టాపిక్ మీద సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నాము.
కేఫ్ ప్రక్కనే ఒక భిక్షువు నిల్చోని ఉన్నాడు. చూడటానికి అచ్చం బాబాలాగానే ఉన్నారు.
పేలగా ఉన్న బట్టలలో, తలపై గుడ్డతో, కర్ర పట్టుకొని మా దగ్గరకు వచ్చి “దక్షిణ” అడిగాడు. “దక్షిణ” నన్ను అడగకుండా మా ఫ్రెండ్ ని అడిగాడు.
మా ఫ్రెండ్ దక్షిణ వేసేస్తే నేను చెప్పటానికి ఏమి లేదు. కాని, మా ఫ్రెండ్ నన్ను అర్ధ రూపాయి ఉందా? అని అడిగాడు. నా ప్యాంట్ బ్యాక్ పోకెట్ లో నుండి నేను చిల్లర ఇద్దామని తీస్తున్నాను.
ఎన్నిసార్లు తీసినా అర్ధ రూపాయి కాయిన్ వస్తుంది. కానీ నాకేమో 5 రూపాయలు వేద్దామని మనసులో ఉంది.
మూడు సార్లు అర్ధ రూపాయి కాయిన్ వచ్చింది. ఎక్కువసేపు నిల్చోబెడితే బాగుండదని ఆ భిక్షువుకి అర్ధ రూపాయి ఇచ్చేసాను.
అప్పుడతను “అర్ధ రూపాయి అంటే అర్ధ రూపాయి మాత్రమే ఇచ్చేవే” అన్నాడు. (ఆ రోజుల్లో అంటే 2007-2008 లో 50 పైసల కాయిన్ చాలా తక్కువ వాడుకలో ఉంది.
అలా 50 పైసల కాయిన్ 3 సార్లు రావడం చాలా మిరాకిల్ గా అనిపించింది) అప్పుడు నేను లోకల్ భిక్షువు అనుకొని ఇప్పుడు మా పరిస్థితి ఏమి బాగాలేదు.
తరువాత కనపడు ఇంకా ఎక్కువ ఇస్తాము అని అన్నాను. అప్పుడు ఆ భిక్షువు “ప్రస్తుతం నువ్వు “గ్రహ బంధనంలో” ఉన్నావు.
నీవు మంచిగా బ్రతుకుతావు, బాగుపడతావు” అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అర్ధ రూపాయి ఇచ్చిన తర్వాత నేను, మా ఫ్రెండ్ ఏదో టాపిక్ మీద సీరియస్ డిస్కషన్ లో ఉన్నాము.
అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు మా బ్రదర్ “7 రోజులలోపు నీకు బాబా దర్శనం అవుతుంది” అని చెప్పిన మాట గుర్తు వచ్చింది.
నేను ఎందుకు అతను బాబా అంటున్నాను అంటే మామూలు భిక్షువులు భిక్ష తీసుకొని వెళ్ళిపోతారు గాని గ్రహాల గురించి మాట్లాడరు.
అప్పుడు నాకు “వచ్చింది భిక్షువు కాదు బాబా” అని అర్ధమైంది. నేను చాలా ఆక్టివ్ గా, షార్ప్ గా ఉంటాను.
ఒక అరనిమషములో గుర్తించాను. గుర్తించిన వెంటనే వెతకటం ప్రారంభించాను.
అది మూడు రోడ్ల కూడలి. అరనిమషంలో అతను వెళ్ళితే ఎంతదూరం వెళ్ళగలడు? కానీ ఎంత వెతికినా అతని జాడ ఎక్కడ దొరకలేదు.
వెంటనే మా బ్రదర్ కిశోర్ కి ఫోన్ చేసి ఇదంతా చెప్పాను.
అప్పుడు మా బ్రదర్ “వచ్చింది “బాబా” నే అని, బాబా ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే దక్షిణ రూపంలో ఎంతో కొంత తీసుకొని ఋణాగ్రస్తుడిని చేసుకొని అతని జీవితాన్ని మారుస్తాడని, పాపం ఎక్కువ ఉంటే ఎక్కువ దక్షిణ తీసుకుంటాడని, నీకు పాపం తక్కువ ఉందేమో “అర్ధ రూపాయి” మాత్రమే తీసుకున్నాడని” చెప్పారు.
నాకు కూడా ఆ భిక్షువు రూపం అచ్చంగా బాబా రూపం లాగానే అనిపించింది. ఆ తర్వాత నా జీవితంలో అనుకోని సంఘటనలు జరగటం, “సాయి పథంలో” గురువు (“శరత్ బాబూజీ”) గారిని దర్శించటం జరిగింది.
ఇప్పుడు నా జీవితం బాగానే ఉంది. కష్టాలు వున్నాయి. బాబా అనుగ్రహం ఉంది. ఇప్పుడు నేను
“బాబా తో పీకల్లోతు ప్రేమలో వున్నాను”.
“సద్గురు లీలా గానమేమాకం వేద వేదాంతాల అభ్యాసము
సద్గురు గుణ కీర్తనమే మాకు సద్గ్రంధ పారాయణము
సద్గురు నామ జపమే మా నిత్య ధ్యానము
సద్గురు చరణ కమలమే మా లక్ష్యము”
~~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~~
*** సాయి సూక్తి:
“నా భక్తుడు యెంత దూరాన ఉన్న పిచుక కాలికి దారం కట్టి లాగినట్టు తనను నా దగ్గరికి రప్పించుకుంటాను”.
Latest Miracles:
- బాబా తో పీకల్లోతు ప్రేమలో వున్నాను–Audio
- “నేను వున్నాను, సమయానికి వస్తాను..” అని నిరూపించుకున్న బాబా వారు
- బాబా తో అనుబంధము
- సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట–Audio
- సబూరి తో ఉన్న నాకు బాబా వారి కృపతో మెడనోప్పి, వెన్నునొప్పుల భాదలు తొలగిపోవుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా తో పీకల్లోతు ప్రేమలో వున్నాను”
Sreenivas
April 24, 2018 at 10:16 amSai Baba..Sai Baba…Sai Baba…Miracle Chala Bagundi Anna…Sai Baba…Sai Baba…Sai Baba