Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
సచ్చరిత్రను శ్రద్ధగా చదివి పరిచయం పెంచుకొంటే , మనసు సజీవంగా ఆయనచుట్టూర ప్రదక్షిణచేస్తూంటుంది.
********
మనుషులు పోతే , వారిస్మృతులు కనుమరుగైపోతుంటాయి , మహాత్ములు తెరమరుగైనా , సద్గ్రంథాలలో వారిప్రబోధాలు లోకాన్ని వెంటాడుతునే ఉంటాయి ..
చెవులో గూడుకట్టుకుని చెప్పినా వినిపించుకోనివాడిని మహాత్ములైన కాపాడలేరు అని సచ్చరిత్రలో ఒక కథ బాబాయే స్వయంగా చెపుతారు ..
తిరిగితే , మనుషులతో బాగ పరిచయాలూ పెరుగుతాయి ..కాస్త తీరికదొరికి చదవటం మొదలుపెడితె సద్గ్రంధాలలోని విషయాలుమనసుకు పరిచయమౌతాయి ..
అన్ని పరిచయాలు గాడంగా గౌరవించుకొనే స్థాయిలో ఉండవు , హాయ్ , హలోతో కొన్ని , బటానీకాలాక్షేపంలా కొన్ని , సాధకబాధకాలు పంచుకొంటా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే పరిచయాలు లేదా గాఢస్నేహితాలు ఏకొన్నో ఉంటాయి ..
కొంతమందితో పరిచయాలు ఎంతో నమ్మకాన్ని పెంచుతాయి , ఆ క్షణాలు ఎంతో విడదీయలేని బంధంగా , చాపకిందనీటిలా అల్లుకుపోతుంది , చివరికి ఆ పరియంవల్లనే జీవితంలో మళ్లీ కోలుకోలేని స్థాయికి దారితీస్తూంటుంది , మరికొందరితో పరిచయం అతిశయోక్తులు లేకుండా , క్రమంగా మాటా మాటా పెంచుకొంటూ జీవితాన్నే మలుపుతిప్పే అత్యుత్తమ స్థాయికి పెంచుతుంది ..
బాబా , తన గతంలో జరిగిన ఒక సంఘటనని అధారంగా తీసుకుని,చెప్పిన చెన్నబసప్ప , వీరభద్రప్పల కథ ఆంతర్యం , మహాత్ముల మాటలు ఆలకించి , ఉన్నదోషాలను తొలగించుకునే ప్రయత్నంలో పడకపోతే , వారి కర్మకు ఎవరూ బాధ్యులుకారని హెచ్చరించినట్లనిపిస్తుంది ..
చెన్న , వీరబద్రప్పలు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ , చెప్పేవంతా విన్నట్టే ఉన్నా , స్వభావాలలోమాత్రం మార్పనేదిలేక , తిట్టుకొంటూ , కొట్టుకొంటూనే గడిపి , చివరి పాము , కప్పలుగా జన్మించవలసివొచ్చింది ..
ఇలాంటి సంఘటనలు సచ్చరిత్రలో ఎన్నో పరిచయమౌతాయి ,.
బాబా ఎలా ఉండేవారో , ఆయన అవతార ఆవశ్యకతను, ప్రబోధాలను చవిచూసినవారు యిప్పటివారిలో ఎవరున్నారు , ఆయన ఇలా ఉండేవారని తెలిపే ఛాయాచిత్రాల ఆదారం తప్ప ..
నాకూ , నా సచ్చరిత్రకు తేడాలేదన్నారాయన , బాబా అంటే ఎవరు , ఆయన జీవనశైలి , ఆయన ప్రబోధించి , లోకంనుండి ఆశించిన నిజ దక్షిణలకు, అద్దంపెట్టి చూపించిన విధంగా మనసుకు పరిచమయ్యేది ఆయనకు, ఆయన సచ్చరిత్రకు తేడాలేదని గాడవిశ్వాసం మొదలయినప్పుడే ,ఆయన సజీవదర్శనంతో మనసుకు అనుభూతినిస్తుందని పెద్దలమాట ..
శ్రీ సాయి పాదార్పణమస్తు
******
Latest Miracles:
- బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు
- హేమద్పంత్ – 2 తొలి దర్శన అనుభూతి
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- సాయిబాబావారి సమాధి మందిరములో, గురూజీ బాబా ఒడిలో ధ్యానం చేసుకుంటూ కనిపించారు.
- బాబాతో మొట్టమొదటి అనుభూతి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments