బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


” ఓం సాయి రాం”
ఇప్పుడు నేను చెప్పబోయే బాబా వారి లీల సాయి నాథుడు ఎంత కారుణామయుడో చెప్పకనే చెప్తుంది.

బాబా చేసే కార్యాలు ఎవ్వరికీ అంతు చిక్కవు. అన్ని అర్థం అయినట్లే ఉంటాయి.

తీరా చూస్తే ఏమి అర్థం అయివుండదు. అలాంటిదే ఈ లీల.

ఇది జలగావు ,మహారాష్ట్ర లో ఉన్న కాశినాథ్  గారికి చెందినది.

ఒకసారి  ఆయన వ్యాపారం లో భాగస్వామిగా ఉన్న  ఒక వ్యక్తి ఈనకు చెప్పకుండా ఐదు లక్షల రూపాయలు తీసుకొని పరార్ అయ్యాడు.

ఎంతో కష్టపడి సంపాదించిన పైసలు అలా  పోయేసరికి కాశినాథ్ గారికి  షాక్ తగిలింది.

దానితో ఆయన మాటలు పడిపోయినాయి. వాళ్ళ నాన్న అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఏమి పనిచేయలేదు. పోయిన మాట రాలేదు.

ఇంకా ఆఖరి ప్రయత్నం గా వాళ్ళ నాన్న గారు అడిగారు” నిన్ను ఎక్కడికి పంపను, బాగు అయ్యేదానికి,నీవే చెప్పు” అన్నారు.

దానికి హఠాత్ గా ” షిర్డీ కి పంపు నాన్న” అని రాసి చూపించాడు.  అది బాబా నే అనిపించి ఉంటాడు.

మరి బాబా భక్తులకు ఆయనే కష్ట నివారణ చెయ్యాలి కదా.వెంటనే వాళ్ళ నాన్న గారు ఆయనను షిర్డీ కి పంపినారు.

అక్కడ కాశినాథ్ మూడు నెలలు వున్నాడు. ప్రతి రోజు బాబా మందిర్ కు వెళ్లి గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేసేవాడు.

ఒక రోజు ఇంక ఉండలేక” బాబా,ఆర్థికంగా,శారీరకంగా,ఎంతో నష్ట పోయినాను.ఏదో కర్మఫలం,అనుకోని అనుభవించాను.

ఇంక నా వల్ల కాదు,నువ్వే రక్షించు..అని గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేసాడు. రక్షించే సమయం వచ్చింది,బాబా ను అతని దుఃఖం కదిలించింది.

ఒకరోజు హఠాత్తుగా మాటలు వచ్చేసాయి. అతనికి ఆశ్చర్యం,ఆనందం వేసింది.

బాబా వారి ఆసీమ లీల చూసి ఆయన తల్లిదండ్రులు కూడా ఆశ్చర్య పోయినారు.

ఇంత బాబా కటాక్షం పొందినాక ఆయనకు వ్యాపారం చెయ్యాలని అనిపించలేదు.

ఈ బాబావారి లీలకు గుర్తుగా జలగావు లో బాబావారి మందిరం కట్టించి అక్కడే సాయిబాబా సేవ చేసుకుంటూ వున్నాడు. నమ్మి కొలిచే వాళ్లకు ప్రత్యక్ష దైవం అక్కడి బాబావారు. ఎన్నో లీలలు ఇప్పటికి అక్కడ జరుగుతున్నాయి.
” సర్వం సాయి నాతర్పణ మస్తు”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles