K. రాజుపాలెం గ్రామం వద్ద హైవే మీద ఉన్న శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

వారం రోజుల క్రిందట అనగా 22.06. 2017  జరిగిన బాబా లీల:

“పల్లకీ సేవ ఎన్నింటికి మొదలెడదాము? ” మా పూజారి కుమార్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు అడిగాడు..

“మామూలుగానే ఏడున్నరకు..” అన్నాను నేను..

ఈనెల ఒకటో తేదీ నుంచి నిర్వహణా బాధ్యతలు నిర్వహిస్తున్న K. రాజు పాలెం గ్రామం వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో, గత రెండు వారాల నుంచీ  పల్లకీ సేవ పునః ప్రారంభించాము. మొదటివారం కేవలం ఏడెమినిది మంది మాత్రమే వచ్చారు. రెండోవారం ఓ పదిహేను మందిదాకా వచ్చారు.

గత రెండేళ్లుగా పూజా పునస్కారాలు లేని ఆలయం. క్రమంగా అందరికీ తెలియాలి. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. క్రమంగా భక్తులు వస్తూ వున్నారు.

ఈరోజు ఉదయం ఇద్దరు ముగ్గురు దంపతులు, వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఆలయంలో మంత్రోచ్ఛారణ జరుగుతుంటే. అదో ఆనందం!

సరే, పల్లకీ సేవ ఏడున్నరకు అనుకున్నాం కదా? ఏడూ ఇరవైకి కూడా కనీసం ఐదుగురు కూడా లేరు. నాకెందుకో మనస్సు చివుక్కుమన్నది. మిత్రుడు శ్రీరామా గిరి శ్రీధర్ కూడా నాలాటి భావం లోనే ఉన్నాడు. ఇద్దరమూ బాబా విగ్రహం వైపు చూసి, పూజారికి ఓ ఐదు నిమిషాల్లో పల్లకీ సేవ మొదలు పెట్టమని చెప్పాలని అనుకుంటూ ఉన్నాము..

ఈలోపల ముఖ ద్వారం వద్ద ఎవరో ఇద్దరు వ్యక్తులు, వాచ్ మాన్ మాల్యాద్రితో మాట్లాడుతూ ఉన్నారు. నావైపు చూపించి, వాళ్ళను నాదగ్గరకు పంపించాడు.

తాము, మహారాష్ట్ర నుంచి వస్తున్నామనీ. యాత్రలు చేస్తున్నామనీ. తమతో బాటు మొత్తం ఓ 40 మంది బస్ లో ఉన్నారనీ. రాత్రికి ఇక్కడ ఉండదల్చుకున్నామనీ.. అనుమతి అడిగారు. నేను సరే అన్నాను.

అందరూ ఆలయం చూసి, బాబా ఆలయం అని సంతోషపడుతూ పల్లకీ సేవకు హాజరయ్యారు.

గత రెండు వారాల కన్నా ఘనంగా బాబా సేవ జరిగింది.

నేను నిర్వహణ చేస్తున్నానని విర్రవీగకుండా బాబా నేర్పిన సుతిమెత్తని పాఠం.

ఈరోజు సంఘటన నాస్తికులకు కాకతాళీయం, మాకు మాత్రం దైవలీల!

29.06. 2017 గురువారం

గురువారం, శ్రీ సాయినాథుని సేవకు ప్రీతికరమైన రోజు.

“ఇన్నాళ్లకు మళ్లీ ఈ ఆలయం పూర్తి స్థాయిలో కళ కళ లాడుతూ ఉందండీ!”  అంటూ కావలి నుంచి వచ్చిన ఒక భక్తుడు ఆనందం వెలిబుచ్చాడు..

గత కొంతకాలంగా భక్తులు రావడం తగ్గిపోయిన.. K. రాజుపాలెం (ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా), గ్రామం వద్ద హైవే మీద ఉన్న శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం ఈరోజు భక్తులతో నిండిపోయింది..

ఆ సాయిబాబా దయవల్ల ఆలయ నిర్వహణా వ్యవస్థ ఒక దారిలో పడింది. పూజారి రావడం, నిత్య ధూప దీప నైవేద్యాలు, వేళకు హారతులు. అన్నీ పద్ధతి ప్రకారం సక్రమంగా జరుగుతున్నాయి. గత మూడు గురువారాలూ మధ్యాహ్న హారతి అనంతరం, భక్తులకు పులిహోర, దద్దోజనం ప్రసాదంగా పెడుతూ వచ్చాము..

ఈరోజు నుంచి అన్నదానం మొదలెట్టాము. గురువారం ఒక్కరోజుకూ సుమారు 8,500/- ఖర్చు అవుతుంది. పేరు తెలపడం ఇష్టం లేని భక్తుడు, ఆ మొత్తం భరించాడు. వచ్చే గురువారానికీ మరో భక్తుడు ముందుగానే నగదు ఇచ్చి వెళ్ళాడు.

దాతలు, దగ్గరుండి వారే, స్వయంగా అన్నదానం చేస్తే మంచిదని మా భావన. కానీ కొంతమందికి వీలు కుదరదు. ఇప్పుడిప్పుడే కొందరు ఫోన్ లో వివరాలు అడుగుతున్నారు. ఎవరి స్తోమత వారిది.

మేము కర్తలం కాదు…

చేయించుకునేవాడు శ్రీసాయినాథుడు..

సర్వం
దత్తకృప

(శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం, K. రాజు పాలెం గ్రామం, ఉలవపాడు మండలం,  ప్రకాశం జిల్లా. సెల్: 94402 66380, 98480 05981).

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles