Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబాతో మొట్టమొదటి అనుభూతి
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు మనము మిస్ ఊర్వీలాడ్ గారి బాబా అనుభూతిని గురించి తెలుసుకుందాము.
సాయిరాం
నా పేరు ఊర్వీ లాడ్. నేను కెనడా లో ఉంటాను. నేను ఈ రోజునే మీ బ్లాగ్ ను మొదటిసారి చూశాను. మీ బ్లాగుతో సహా నాకు బాబా కథలు, భక్తుల అనుభవాలు చదవడం యిష్టం. నా జీవితంలో జరిగిన ఒక లీలని ఇప్పుడు మీతో పంచుకుంటాను. బాబా గారు నా జీవితంలో నాకు చాలా ఇచ్చారు. నా మంచికోరి ప్రతిక్షణం ఆయన నా జీవితాన్ని మారుస్తున్నారు. ప్రతి క్షణం నేను సాయి ఉనికిని అనుభవిస్తున్నాను.
నేను బాబాతో నా మొదటి అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు. నేను 1980-1981 ప్రాంతములో జరిగినది చెపుతున్నాను. మొట్టమొదటిసారిగా, నేను మా తల్లితండ్రులతో కలిసి షిరిడీ వెళ్ళాను. ఆ రోజు రామనవమి వలన షిరిడీ అంతా భక్తులతో నిండివుంది.
నేను మా నాన్నగారి చెయ్యి పట్టుకున్నాను, నా సోదరుడు మా అమ్మ చెయ్యిపట్టుకున్నాడు. ఏమయిందో తెలియదు, నాకు తెలియకుండానే నేను మా నాన్నగారి చెయ్యి వదిలివేసి, మరొకరి చెయ్యి పట్టుకున్నాను. నా పేరెంట్స్ తెలుసుకునేటప్పటికి నేను వారితో లేను. వారు చాలా కంగారుపడ్డారు.
వాళ్ళు ప్రతిచోటా వెదికారు, కాని ఫలితం లేకపోయింది. కాని 2-3 గంటల తరువాత వారు నన్ను సమాధి మందిరం దగ్గిర చూశారు. అక్కడ నేను నా అంతట నేను కూర్చుని వున్నాను. కాని నాకు మరాఠి దుస్తులలో , తెల్లని చొక్కా, తెల్లని పాంటు, తెల్లని టోపీతో ఉన్న మనిషి గురించి గుర్తు ఉంది. ఇంతసేపు అతను నాతోనే కూర్చుని నాతో, “భయపడకు, తొందరలోనే మీ అమ్మ, నాన్నగారు ఇక్కడకి వస్తారు” అని చెప్పాడు.
నా తల్లితండ్రులు, నేనసలు ఏడవకుండా ఒక్కదాన్నే అక్కడ కూర్చుని వుండటం చూసి ఆశ్చర్యపోయారు. బాబా లీలని అర్థం చేసుకోవడానికి అప్పుడు నాది చాలా చిన్న వయసు. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆరోజు సమాధి మందిరంలో బాబా గారితో కూర్చున్నాను. నేను బాబా గారితో సమయాన్ని గడిపాను. ఆరోజు నుంచి బాబా గారు ప్రతిక్షణం నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.
ఇక్కడే మనం బాబా గారి లీలని అర్థం చేసుకోవాలి. ఉర్వీ గారు చెప్పినట్లు ఆవ్యక్తి బాబాగారే. ఎందుకంటే మాములు వ్యక్తి అయితే తప్పిపోయిన పిల్లని గురించి సంస్థానం ఆఫీసులో అప్పచెప్పి ప్రకటన చేయించేవాడు. కాని, ఇక్కడ ఆవ్యక్తి చిన్నపిల్లయిన ఊర్వీతో “భయపడకు మీ అమ్మగారు, నాన్నగారు ఇక్కడికి వస్తారు” అని చెప్పారు. అలా చేసేది బాబాగారు కాక మరి ఇంకెవరు?
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- బాబాతో నా పరిచయం
- బాబాతో నా అనుబంథం ఊహకందనిది — గౌరి
- బాబాతో దివ్యానుభూతి
- నేనుండ నీకు భయమేల — అషిమా, బాబా అనుభూతి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments