Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా తో అనుబంధము
ఈ రోజు మనము ఒక సాయి భక్తురాలి జీవితంలోకి బాబా గారు ఎలా ప్రవేశించారో తెలుసుకుందాము. ఈ లీలని ఆ భక్తురాలి మాటలలోనే తెలుసుకుందాము.
బాబా గారు నా జీవితంలో అన్నివిధాలుగా, ప్రతి క్షణం, ప్రతిరోజూ సహాయపడుతున్నారు. మా అమ్మగారు ప్రతి గురువారమునాడు సాయిబాబా సత్సంగానికి వెడుతూ ఉండేవారు. మూడు సంవత్సరాలు కాలినడకన 45 నిమిషాలు నడిచి వెడుతూ ఉండేవారు. తరువాత మేము బాబా అనుగ్రహంతో సత్సంగానికి దగ్గరలోనున్న ప్రాతంలో ఇల్లు కట్టుకున్నాము.
తరువాత నేను మా అమ్మగారితో నెలకు ఒకసారి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు బాబా మీద అంత నమ్మకం ఉండేది కాదు. ఒకానొక సమయంలో మేము చాలా కష్టాలనుభవించాము. నా సోదరుడికి బీ.టెక్. అయిన 2 సంవత్సరముల వరకు ఉద్యోగం లేదు. నేను క్యాంపస్ యింటర్వ్యూస్ లో సెలక్ట్ అవలేదు. ఆ సమయంలో మేమంత స్థితిపరులం కాదు. కొన్నాళ్ళకి బాబా దయవల్ల నా సోదరుడికి ఉద్యోగం వచ్చింది.
కాలేజీ చివరి రోజున మా లెక్చరర్స్ లో ఒకరు మా నాన్నగారి మొబైల్ నంబరు అడగ్గా నేను ఇచ్చాను. ఆయన ఫోన్ చేసి మా యింటికి వచ్చారు. ఆయన, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తన సోదరునికి వివాహం చేయటానికి మంచి కుటుంబంలోని అమ్మాయికోసం వెతుకుతున్నామని, ఆస్తి విషయంలో పట్టింపు లేదని చెప్పారు. ఒక గురువారమునాడు వారంతా, అమెరికాలో ఉంటున్న అబ్బాయితో సహా మా ఇంటికి వచ్చారు. మా తల్లితండ్రులు, బంధువులు అందరూ కూడా ప్రపోజల్ కి ఒప్పుకున్నారు.
ఆదివారమునాడు మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చి తను షిరిడీ నుంచి వస్తున్నానని చెప్పాడు. ఆ వ్యక్తి మా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. అవన్నీ కూడా నిజాలే. మా అమ్మగారు ఆ వ్యక్తిని ఈ పెళ్ళి సంబంధం గురించి అడిగారు. అతను ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పాడు. అతను రుద్రాక్ష, సాయిబాబా డాలరు ఇచ్చాడు. నాకు వివాహం జరిగింది. అతను సాయిబాబా అని నేను అనుకోలేదు.
నేను 2008 లో అమెరికాకి వచ్చాను. 2 నెలల తరువాత రెసిషన్ సమయంలో నా భర్తకి ప్రాజెక్ట్ అయిపోయింది. తనకి మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే పారాయణ చేస్తానని బాబాని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదంతో ఒక వారంరోజులలో మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారిగా నేను పారాయణ చేశాను. అప్పుడు నేను మెల్లగా బాబాకి దగ్గరయ్యాను.
మేము భగవద్గీత తరగతులకి కూడా వెడుతూ ఉండేవారము. అవి నా ఆధ్యాత్మిక చింతనని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాయి. ఇంకొక ముఖ్యవిషయమేమంటే, మంచి సంఘటనలన్నీకూడా గురువారమునాడే జరిగాయి. మా యింటికి వచ్చి రుద్రాక్ష, సాయిబాబా డాలరు ఇచ్చిన వ్యక్తి బాబాయే అని తెలుసుకున్నాను. నేను చాలా సంతోషించాను.
బాబా మెల్లిగా నన్ను తనవైపుకు తిప్పుకున్నారు. నాకింకా సంతానం లేదు. నాకు సాయినాథ్ మీద పూర్తి నమ్మకం ఏర్పడింది. నేను 3 వారాలు సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. తొందరలోనే ఆయన నాకు సంతానాన్ని ప్రసాదిస్తారు. సాయినాథ్ నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతినిమిషం, ప్రతిక్షణం ఉన్నారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా తో తొలి అనుబంధం
- సాయి బాబా వారితో మహల్సాపతి అనుబంధము —Audio (All files updated)
- సబూరి తో ఉన్న నాకు బాబా వారి కృపతో మెడనోప్పి, వెన్నునొప్పుల భాదలు తొలగిపోవుట
- బాబా వారితో తార్కాడ్ కుటంబము కి గల అనుబంధము–Tharkad–Audio
- సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments