Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
సాయి మార్గములో పెద్దలు
సాయి భక్తుల సంఖ్య క్రమక్రమముగా వృద్ధి చెందుచూ సాయితత్వం మారుమూల గ్రామములకు కూడా వ్యాపించుట ప్రారంభమైనది. అన్ని మార్గములు సాయియేఅన్నట్లు ఏ మార్గములో ఉన్న మహాత్ములైన మార్గములకు భిన్నమైనది కాదనుట, అన్ని మార్గములకు హితకరమైనదనుట చెప్పబడుచున్నది.
యితర మతముల వారిచే కూడా శ్రీ సాయిమార్గము ప్రశంసింపబడుచున్నది. దేశములోనే కాదు విదేశస్తులచే కూడా పూజింపబడుతున్న వారు బాబా.
తానూ విదేశములకెళ్ళక, భౌతిక సంచారముచేయకనే అచట దర్శనముల నిచ్చుచు వారి హృదయములను ఆకట్టుకొని తమ తత్త్వమును విదేశీయులకు గూడా విస్తృ తపరచినారు.
మీకు ఇప్పుడు సాయిమార్గములో నాకు తెలిసిన పెద్దలను పరిచయం చేస్తాను.
జిల్లెళ్ళమూడి అమ్మగారు.
గుంటూరు జిల్లా, బాపట్ల మండలములోని, జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ అనసూయమ్మ ఉండేవారు. సాక్షాత్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం.
శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారుగారు బాబా మార్గములో ప్రవేశించగానే 1963 ఆగస్టు నెలలో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నారు. వారికి మహాత్ముల దర్శనము జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనముతో ప్రారంభమైనది.
అలా అచ్చట ఉన్నప్పుడు “వాయిస్ ఆఫ్ మదర్” అనే గ్రంధమును ఆంగ్లములో వ్రాశారు. 1968 ప్రాంతము వరకు అమ్మ సాన్నిధ్యములో గడిపారు మాస్టారుగారు.
కృష్ణాజిల్లా బందరులో జి.వి.జి. సుబ్రహ్మణ్యం అని సాయి భక్తుడుఉండేవాడు. జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరకు కూడా వెళుతుండే వారు. “SAI THE MOTHER ANASUYAMMAA ” అని ఆంగ్లములో ఒక గ్రంధము రచించారు.
ఈ గ్రంథ రచయితనైనా నేను(ఆలూరుగోపాలరావు) 1964 నాటికి బాబా మార్గ్మములో లేను.తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించేవాడిని. ఆ సంవత్సరములో జిల్లెళ్ళమూడి వెళ్లి అమ్మను దర్శించాను. అప్పటి నా వయస్సు ౩౦ సం:లు.
అమ్మా! మనస్సు ప్రశాంతత కావాలి అని కోరినాను. నేను మీలాంటి దానినేగా నాయన వెళ్ళి భోజనం చేయి అని అన్నారు.అలా వీలున్నప్పుడల్లా వెళ్ళి అమ్మను దర్శిస్తుండేవాడిని.
ఆమె చెంత కూర్చున్నప్పుడు ఆనందంగా కళ్ళవెంట నీరు ధారకారుతూ ఉండేది. నా ఆధ్యాత్మిక ఆలోచనలకు అమ్మ వద్దనే పునాది ఏర్పడినది. తరువాత కాలములో బాబాను ఆశ్రయించుటకు దారి ఏర్పడినది. 1987 లో బాబా ఆశ్రయము లభించినది. మధ్య కాలములో మరెవరిని దర్శించలేదు.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీమతి దండి విమల అమ్మగారు)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)”
Maruthi
May 24, 2017 at 5:25 amSai Baba..Sai Baba. e website lo anubhavalu chaduvuthunte chala happyga vuntundi. Sai Baba…Sai Baba