బాబా నామస్మరణతో ప్రాణాపాయ స్థితి నుండి బిడ్డ కోలుకున్నాడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

మోరేశ్వర్ ప్రధాన్ మరియు అతని భార్య చొట్టూబాయి ఇద్దరూ వారి హృదయ లోతుల నుండి బాబాను ప్రేమించేవారు. అదేవిధంగా బాబా కూడా వారిని ప్రేమించేవారు. అన్నివిధాలా బాబా వారి సంక్షేమ చూస్తూ ఉండేవారు.

ఒకప్పుడు వారి ఇంట్లో చిన్నారులందరికి ఆట్లమ్మ(చికెన్ పాక్స్) వచ్చింది. అందరికి నయం అయ్యింది కాని, వారందరిలో బలహీనంగా ఉన్న చిన్నపిల్లవాడికి మాత్రం తగ్గలేదు. అకస్మాత్తుగా అనారోగ్యం ఇంకా తీవ్రమైంది.  వైద్యులు కూడా పిల్లడు కోలుకుంటాడని ఆశ లేదని తేల్చేసారు. పిల్లడు పాలిపోయి, ముఖంలో మరణం సమీపించిన సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.

తల్లిదండ్రులు దుఃఖం నిండిన హృదయంతో తల్లడిల్లిపోయారు. వారు ఆపకుండా బాబా నామస్మరణ చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి చోటుబాయి అకస్మాత్తుగా నిద్రలోకి జారుకుంది. ఆ నిద్రలో ఆమె తన ముందు బాబాను చూసింది.

బాబా “ఇదంతా ఏమిటి? పిల్లవాడు సురక్షితంగా ఉన్నాడు, ఉదయం గం.6.30ని. లకి పిల్లవాడు తినడానికి ఏమైనా అడుగుతాడు. నువ్వు పిల్లవాడు ఏది కావాలంటే అది భయపడకుండా ఇవ్వు” అని చెప్పారు.

చొట్టూబాయి తక్షణమే నిద్రలేచి, పిల్లవాడిని చూసేసరికి, పిల్లవాడు అప్పటికే కోలుకొని మంచి నిద్రలో ఉన్నాడు. సరిగ్గా ఉదయం గం. 6.30ని. లకి పిల్లవాడి మృదువుగా తినడానికి అడిగాడు. తల్లి సంతోషంగా పిల్లవాడు కోరినదంతా ఇచ్చింది. కొన్ని రోజుల్లో పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాడు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా నామస్మరణతో ప్రాణాపాయ స్థితి నుండి బిడ్డ కోలుకున్నాడు

Maruthi

Jai saibaba.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles