Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అందరికీ నమస్కారం నా పేరు సాయి శ్రీ ఇది నేను పెట్టుకున్న పేరు భద్రతా రీత్యా నా అసలు పేరు గోప్యంగా పెట్టుకున్నాను క్షమించండి
నా జీవితం ఒక దశ లో అంతా చీకటిగా కనిపించింది , భర్త తాగుడు వ్యసనం తో విరక్తి చెందిన నేను నా బిడ్డను తీసుకొని భర్త కి దూరంగా వచ్చాను ,భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది కాబట్టి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా బాబు ని చదివించుకుంటూ నెట్టుకొస్తున్నాము.
సంపాదన చాలక అప్పులు చెయ్యాల్సి వస్తుంది నాకు ఉన్న మనస్తత్వానికి ఎక్కడ ఉద్యోగం నిలకడ ఉండదు ఎప్పుడు ఊడుతుందో తెలియదు ఎప్పుడు ఇంకో జాబ్ దొరుకుతుందో తెలియదు దొరికిన ది చేస్తూ బ్రతుకు బండి నీ లాగుతున్న అండగా ఉన్న సోదరుడు సాయం అతని భార్య షరతులతో కరువు అయ్యింది అంతా చీకటి గా అనిపించేది ఉద్యోగం లేక బాబు స్కూల్ ఫీజ్, ఇంటి అద్దె ఖర్చులు నెల అయిపోతుంది అంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తే వి.
అలాంటి సమయం లో రోజు దేవునికి దీపం పెట్టనిది బయట కి వెల్లేదాన్ని కాదు ఒక రోజు పూజ చేస్తుంటే సాయి బాబా జీవిత చరిత్ర చిన్న పుస్తకం ఎప్పుడో మా వదిన ఇచ్చిన బాబా రెండు పుస్తకాలు సాయి లీలామృతం తో పాటు కనిపించాయి.
ఆ రోజు చిన్న పుస్తకం చదవాలి అనిపించి కూర్చొని మొత్తం చదివాను చాలా బాగా అనిపించింది ఇంకా బాబా గురించి తెలుసుకోవాలి అనిపించింది వెంటనే లీలమృతం పుస్తకం తీశాను.
పుస్తకం తీయగానే పారాయణ పద్దతులు ముందు పేజీలో వివరం గా ఉంది ,వారం,రెండు వారాలు ,మూడు వారాలు ఇలా పారాయణ చెయ్యాలి అని ఉంది.
గురు వారం మొదలు మళ్ళీ గురువారం అల మనకు నచ్చిన వారాల్లో పూర్తి చెయ్యొచ్చు అని ఉంది ఆ రోజు మంగళవారం నాకు వెంటనే లీలామృతం చదవాలి అనిపించిన గురు వారం వరకు వేచి ఉండాల్సి వస్తుంది అని బాధ పడ్డాను.
ఎలా అయిన గురువారం నుండి మొదలు పెట్టాలి అని గురువారం ఉదయాన్నే లేచి దీపారాధన చేసి షిరిడి నుండి తీసుకొచ్చిన బాబా ప్రతిమ మా అత్త గారు ఇచ్చింది పూజ గదిలో ఉంటుంది ఎప్పుడూ బాబా కి నమస్కారం చేసుకొని చదవటం మొదలు పెట్టాను.
అలా మొదలు పెట్టిన నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనే భావన వచ్చింది నన్ను నేను పారాయణ ద్వారా సంస్కరించుకుంటూ బాబా చెప్పిన మాటలను చదవటం మాత్రమే కాదు పాటించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
బాబా చెప్పిన మాట ప్రతి జీవి లో నన్ను చూడు అన్నారు అప్పటి నుండి ఇంట్లో బొద్దింక కనిపించిన చంప టం మానేశాను దోమలు కుడుతున్నా చంపలేక పోవటం అలవాటు గా అయిపోయింది.
ఆయన చెప్పిన ప్రతి మాట గుర్తుకు వస్తూ ఉంటుంది అలా బాబా తో నా ప్రయాణం మొదలు పెట్టాను.
అనూహ్యం గా నాకు నా స్నేహితుని సాయం తో కోర్స్ నేర్చుకొని అతను కంపెనీ లోనే ఉద్యోగం వచ్చింది నాకు బాల్య స్నేహితుడు బంధువు అవటం అప్పుడే అతను లండన్ నుండి రావటం ఇండియా లో చిన్న స్టార్ట్ ఉప్ కంపెనీ పెట్టటం దానిలో నేను కీలక పాత్ర పోషించెలా బాబా నన్ను నడిపించారు.
నెల ఎలా గడుస్తుందో బిక్కు బిక్కు మంటూ బ్రతికిన నేను ఈ రోజు చాలా ప్రశాంతంగా నా బాబు ని చదివించుకుని జీవనం సాగిస్తున్నాను.
అంటే అది బాబా కృప వలనే ఆయన బోధనలు మనకి ఆలోచన శక్తి ని, అసలు జీవితం విలువను తెలియజేస్తాయి.
నీ దృష్టి నా మీద ఉంచు నా దృష్టి నీ మీద ఉంచుతాను అని బాబా చెప్పిన వాక్యము నాలో చాలా మార్పు ను దైర్యాన్ని ఇచ్చింది.
నాకు బాధ గా ఉన్న బాబా కళ్ళను చూస్తాను నాకు ఆనందం కలిగిన బాబా కళ్ళను చూసుకుంటూ ఉంటాను నా ఫోన్ లో వాల్ పేపర్ బాబా నే ఉంటారు నా చేతికి ఉన్న వాచ్ లో బాబా నే ఉంటారు .సోఫా లో కూర్చున్న ఎదురుగా బాబా ఫోటో ఉంటుంది.
నా మనసులో ఎప్పుడు ఒకటే భావన నాకు బాబా ఉన్నారు నాకు ఏంటి భయం అదే నమ్మకం నన్ను నడిపిస్తుంది ప్రతి పని లో విజయాన్ని చూపిస్తుంది.
నాకు కష్టం వచ్చిన రోజు కలలో కనిపించి జరగబోయే విషయాలు తెలిసేలా చేస్తారు.
ఒక తండ్రి లా కంటికి రెప్ప లాగా కాపాడుతూ ఉంటారు నేను బాబా ఆరాధన చేయటం చూసిన నా కొడుకు కూడా ఆయన చెయ్యి పట్టుకున్నారు.
తన పేరు ముందు సాయి అని కలుపుకొని రాసుకుంటూ ఉంటాడు అంత ఇష్టం ఏర్పడి పోయింది మా ఇద్దరికీ బాబా అంటే.
నాకు పని రీత్యా ప్రయాణ సమయం ఎక్కువ ఉండటం తో కార్ అవసరం వచ్చింది.
కానీ నేను కార్ కొనే స్థోమత లేదు కానీ లోన్ అయిన తీసుకోవాలి అని మనసులో అనుకునేదాన్ని ,నేను సాయి లీలామృతము పారాయణం నాకు వీలు చూసుకొని చేస్తూనే ఉంటాను.
ఒక సారి 9 వారాలు చేశాను అనూహ్యం గా చివరి వారం చివరి రోజు మాకు బంధువు అయిన బాబా భక్తుడు కార్ కొనుక్కొని 3 నెలలు అయ్యింది అమ్మేయ్యాలి అనుకుంటూ ఉండగా నేను గుర్తు వచ్చాను అని ఫోన్ చేశారు కార్ నీకు ఇచ్చేస్తాను ఇక్కడ నుండి లోన్ నువ్వు కట్టుకో అని చెప్పి తర్వాత గురు వారం నాకు కార్ పంపించారు.
రెండు నెలలు పెండింగ్ EMI నేను కట్టి కార్ తీసుకున్నాను అలా బాబా నే నాకు కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అందుకే నా కార్ ముందు వెనుక బాబా ఫొటోస్ ని స్టిక్కరింగ్ చేపించాను ఇప్పటికీ మూడు సంవత్సారాలు అయ్యింది ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కార్ లోన్ విజయవంతం గా కడుతున్నాను అంతా బాబా లీలే.
ఇలా నా జీవితం లో చాలా సంఘటనలు బాబా లీలలు జరిగాయి
నేను ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ పని చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం లో ఉన్నప్పుడు పేపర్ లో రాసి చిట్టి లు బాబా ముందు వేసి కళ్ళు మూసుకొని ఒక చిట్టి తిసి అందులో ఏదైతే వుంటుందో అదే చేస్తాను. ఇప్పటి వరకు నాకు అపజయం అనేది రాలేదు. అలా చేయటం వల్ల ఆయన ఇచ్చిన సందేశం మనం ఆచరిస్తే అంతా మంచే జరుగుతుంది.
నేను 100 శాతం సాయి బాబా ఇచ్చిన సందేశాన్ని నమ్ముతాను
నా జీవితంలో జరిగిన సాయి లీలలు మీతో పంచుకోవటం చాలా ఆనందం గా ఉంది
సాయి బాబా ఒకటే చెప్తారు, ఏదైనా మనం ఆహారం తినే ముందు బాబా కి పెట్టి తింటే మన ఇంటి లో పాత్రలు ఎప్పుడు ఖాళీ అవ్వవు అని చెప్తారు.
నేను ప్రతి నిత్యం నేను ఏదైనా తినే ముందు బాబా కి ఒక గిన్నె లో పెట్టీ న తర్వాతనే నేను తింటాను.
ఎప్పుడైనా పొరపాటు న మర్చి పోయిన తినే సమయం లో గుర్తు కు వచ్చిన వెంటనే గిన్నె లో పెట్టీ బాబా కి క్షమాపణలు చెప్పుకుంటాను.
ఆకలి తో పస్తులు ఉన్న స్థితి నుండి ఈ రోజు నలుగురికి అన్నదానం చేసే శక్తి ని ఇచ్చిన షిరిడి సాయి నాధుని కి పాదాభి వందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు
సాయి భక్తురాలు
సాయి శ్రీ
Latest Miracles:
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments