పోయిన సంచి దొరికింది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-200-2712-పోయిన సంచి దొరికింది 3:39

డాక్టర్ మాధవ్ రామచంద్ర తగరే అహ్మద్ నగర్ జిల్లాలోని దశరధ్ వాడి నివాసి. ఆయన కి ఎదురైన ఒక వింత అనుభవం శ్రీ యం.వి.కామత్ మరియు శ్రీ వి.బి.ఖేర్ లు సంయుక్తంగా రచించిన ’సాయిబాబా ఆఫ్ షిర్దీ, ఎ యూనిక్ సెయింట్’ (జైకో ప్రచురణ, ప్రధమ ముద్రణ 1991, 24వ పునర్ముద్రణ 2012) గ్రంధంలో ప్రచురించబడింది. ఈ మాసం ఆ అనుభవమ్ చదువుకుందాం!

          1952 మే 14 వ తేదీన 2500 రూపాయల విలువైన యుద్ధబాండు పరిణతి చెంది పోస్టాఫీసు లో చెల్లింపు జరగాల్సివుంది.

ఒక సంచిలో మిగిలిన కాగితాలతో పాటు ఈ బాండ్ సర్టిఫికెట్లను కూడ కలిపి పెట్టి, డా.తగరే ఎడ్ల బండిలో కోపర్ గాంవ్ కి బయలు దేరాడు. బండిలో మరో వ్యక్తితో మాట్లాడుతుండగా బండిలో సంచి కిందపడిపోయింది.

ఆయన అది గమనించలేదు. వారు నదిని దాటుతుండగా బండిలో సంచిలేదని రామచంద్ర తగరే గమనించాడు. బండి దిగి రెండుమైళ్లు వెనక్కి నదుచుకుంటూ వెళ్లి సంచిని వెతకటమొక్కటే ఇక అతడు చేయగలిగింది.

అయినా సంచి దొరకలేదు. దారిలో కిరోసిన్ బండి అతను రోడ్డుమీదనుండి ఏదో తీయడం గమనించాడు కానీ అది తన సంచి అయివుంటుందని అనుకోలేదు.

నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి సాయిబాబా ని ప్రార్దించాడు. ఎంతో చింతతో వున్న సమయంలో ఎవరో ’బాధపడకు’ అనడం విన్నాడు. మరునాడు అనారోగ్యంతో వున్న స్నేహితుడ్ని చూడడానికి వెళ్లాడు.

రోగిని పరీక్షించి, మందులను రాసిచ్చి, మాటల్లో తన సంచి పోయిన సంగతి చెప్పాడు. అతడా సంగతిని తన స్నేహితునితో చెబుతుండగా ఒకమ్మాయి ఆ మాటలు వినడం అతను గమనించలేదు.

ఆ అమ్మాయి ఎవరోకాదు. . క్రితం రోజున సంచి దొరికిన కిరోసిన్ బండి అతని కూతురే. ఆ అమ్మాయి సంచి తీసికుని వచ్చి డా. తగరే కాళ్లవద్ద వుంచింది. సంచిని కెలికారు,

కానీ కాగితాలన్నీ వున్నాయి. బండివాడు సంచిని తెరిచాడు కానీ దొంగిలించేంత విలువైనవేవీ దానిలో లేవని భావించాడు.

          డా. రామచంద్ర తగరే సంతోషించి, ఇదంతా బాబా కృప అనుకున్నాడు.

ఈ పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ మహమద్ హిదయ్ తుల్లా ’చివరిగా సాయిబాబాతో సంబంధం కలిగివున్న ఒక సంఘటనను గుర్తు చేసికుంటున్నాను.

సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా వున్నప్పుడు ఆ కేసును విచారించాను. ఒక మహమ్మదీయుడైన మాంసంవ్యాపారి సాయిబాబా లా వేషం ధరించి ప్రజల నుంచి ధనం వసూలుచేసాడు.

బాబాలా వేషధారణ చేసికుని ప్రజలకు కనిపించేవాడు. ప్రజలు సాష్టాంగ పడి, డబ్బులిచ్చేవారు. అతణ్ణి పట్టుకుని జైలు శిక్ష వేసారు.

ఆకేసు నా వద్దకు వచ్చినప్పుడు శిక్షి తగ్గించమని అభ్యర్దన వచ్చింది.

ఒక మహ్మదీయుడు ఇటువంటిది చేయడం భరించలేనిదిగా వుందనీ, కొరడా దెబ్బలను రద్దు చేయడం (కొరడాదెబ్బల శిక్షని అప్పటికే చట్టరీత్యా రద్దుపరిచారు) తగదనీ, ఈ నేరానికి నిజమైన శిక్ష జైలులో పెట్టడం కాదనీ, కొరడా దెబ్బలేననీ చెప్పాను’.

(’విశిష్ట యోగి షిరిడీ సాయిబాబా’ జైకో వారి శ్రీమతి వి. రమాంజనీ కుమారి అనువాద గ్రంధం నుండి సేకరణ)

సాయి పాదధూళి,
చాగంటి సాయిబాబా, జట్నీ, ఒడిషా
csaibaba@gmail.com , csai@saimail.com
Voice: 9437366086, 8270077374
Whatsapp: 9178265499, 7077339935

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles