పోయిన వాచ్ దొరికింది—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-99-పోయిన వాచ్ దొరికింది 2:28

నా పేరు టి.వి నరసింహకుమార్. మాది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని గండవరం.

నేను నెల్లూరు సెంట్రల్ ఎక్స్త్-జ్ డిపార్ట్మెంటులో సుపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. నాకు ఇటివల జరిగిన అనుభవం మీతో పంచుకుటున్నదుకు చాలా సంతోషంగా ఉంది.

నాకు నా బార్య ఇచ్చిన చేతి గడియారం వుంది.దానిని నేను చాలా అపురూపంగా చూసుకుంటుంటాను.

ఒక రోజు ఆ గడియారం రిపేరుకు వస్తే మరలా చేయించుకుందామని మా ఇంట్లోని బీరువాపై వుంచాను.

తర్వాత కొన్ని రోజులకు దుమ్ము పడుతుందని తీసేసి నా హ్యాండ్ బాగ్ లోని చిన్న అరలో పెట్టాను.

తర్వాత కొద్దిరోజులకు నేనా విషయం మర్చిపోయాను.తరువాత వాచీ గుర్తుకొచ్చి ఆ విలువైన వాచికోసం ఇల్లంతా వెదికాను.(బ్యాగ్ లోని అరలో పెట్టిన విషయం నాకు గుర్తులేదు).

ఆ వాచ్ ప్రెజెంట్ చేసిన నాబార్యకు తెలిస్తే బాధపడుతుందని చెప్పలేదు. ఎలా చెయ్యలా అని ఆలోచిస్తున్నాను.

ఇంతలో గురువారం వచ్చింది. నా అలవాటు ప్రకారం గాంధీ బొమ్మవద్ద గల శ్రీ సాయిబాబా గుడికి వెళ్ళి బాబాను దర్శించుకొని నా చింతలు బాపుమని కోరాను. తీర్ధము తీసుకోగానే, మెరుపులా నేను , వాచిని వుంచిన బ్యాగులో చిన్న అర ఉందని, ఒకవేళ వాచీ దానిలో ఉండవచ్చునని స్మురించింది.

అసలు అంత చిన్న అరలో వాచీని ఎంతో కష్టపడితేగాని పెట్టలేము.

అయిన త్వరగా ఇల్లుచేరి ఆ బ్యాగులో ఆ చిన్న అరను తెరచి చుతునుగదా, అశ్చర్యముగా వాచీ కనిపించినది. ఆ బ్యాగును ఇంతకుముందు మా వాళ్ళు, నేను తెరచి చూశాము.

కాని విచిత్రముగా ఎవరు కూడా వాచీ ఆ అరలో వుంటుందని అనుకోలేదు, వెదకలేదు.

అందువలన ఇదంతా నా మోర విన్న భక్తవత్సలుడు శ్రీ శిరిడిసాయినాధుని లీలగాక మరొకటి కాదని గట్టిగా నమ్మి ఆ మహాత్ముని కరుణకు ఎంతో ఆనందించి నమోవాక్యములు అర్పిస్తున్నాను.

సాయి పాదరేణువు,
టి.వి నరసింహకుమార్,
నెల్లూరు

సంపాదకీయం: సద్గురులీల ( మే – 2008 )
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles