బాబా నీ కోసమే ఇలా ఎంతో కస్టపడి వస్తే నువ్వు ఇలా చేస్తావా?–Aduio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-106-బాబా నీ కోసమే ఇలా ఎంతో కస్టపడి వస్తే 5:53

నా పేరు టి.పరమేశ్వరి.నేను ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను. మా నివాసము హైదరాబాదు.

2002 సంవత్సరంలో ఈ లీల జరిగింది. అప్పుడు నాకు 9వ తరగతి అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు.

నేను అప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను  నేను కొన్ని నెలల నుండి ప్రతిరోజు బాబా మందిరానికి సంధ్యా ఆరతికి వేళ్ళేదానిని.

ఒక రోజు నేను మందిరానికి వెళ్ళలేక పోయాను. సాయంత్రం 6 గంటలు అయ్యింది.

నా మనసంతా చాల బాధగా వుంది. బాబా రోజు సాయంత్రం నేను నీ దగ్గరకు వచ్చేదానిని.

నీ ఆరతి పాడేదానిని కాని ఈ రోజు నీ ఆరతి పాదలేకపోతున్నాను.

ఎందుకంటే నాకు ఆరతి రాదు. పుస్తకంలో చూసి క్యాసెట్ తో పాటు పాడగలను.

చాల బాధగా ఉండి ఏడుస్తున్నాను. మా పిన్ని ఎందుకు ఆలా వున్నావు  అని అడిగితె ఆరతి గురుంచి అని చెప్పాను.

అప్పుడు మా పిన్ని మనసుంటే మార్గం వుంటుంది అని అంది.

అప్పుడు మా తమ్ముడు చాలా చిన్న పిల్లాడు, వాడు ఆడుకుంటూ వున్నాడు. వాడికి అసలు ఆరతి గురుంచి తెలియదు.

కాని వాడు ఆడుకుంటూవుంటే “బాబా ఆరతి వినిపించిది” అని పరుగులు పెడుతూ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు.

అక్క మూడవ అంతస్తులోని వర్దిని అత్తవాళ్ళ ఇంట్లో నుండి బాబా ఆరతి వినబడుతుంది అని చెప్పాడు.

అప్పుడు నేను గ్రౌండ్ ఫ్లౌర్ లో వున్నాను. పరుగులు పెడుతూ కొన్ని సెకండ్స్ లో ధర్డ్ ఫ్లౌర్ లోకి వెళ్లి అంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను.

వాళ్ళ ఇంట్లో ఎక్కడ చుసిన బాబాపోటోలు కనిపించాయి. అన్ని ఫోటోలలో బాబా ఎంతగానో నవ్వుతూ ఉన్నారు.

ఆరతి అయిపోయింది. అప్పుడు ఆ అంటి, ఏమిటి ఎవరు మీరు అని అడిగితే ఇలా అని మొత్తం చెప్పాను.

అసలు ఆరోజు టేప్ రికార్డర్ సౌండ్ పెద్దగా వుంది.పక్కవాళ్ళకి దిస్త్రబెన్స్ అని అంటి సౌండ్ తగ్గిద్దామని టేప్ రికార్డర్ మీద చెయ్యి పెట్టి ఆవిడ కూడా ఈ ఒక రోజులే ఏమౌతుందిలే అని సౌండ్ వుంచారు.

ఆ ఆరతి శబ్దం మా తమ్ముడి చెవిలో పడటం, వాడు అది నాకు చెప్పడం,

నేను ఎంతగానో సంతోషించాను. ఇది నాకు జరిగిన మొదటి బాబా లీల.

నేను జనవరి 2002 నుండి బాబాను నమ్మడం మొదలైంది.నాకు ఈ లీల మే నెలలో జరిగింది.నాకు అసలు ఆరతి పాడటానికి వెళ్ళితే పాటరావటం  లేదు.

ఆనందంతో కాళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారుతున్నాయి.

2వ అనుభవం

సమస్త జీవరాశిలో నేనున్నానన్న బాబా పలుకులకు నిదర్శనము

ఈ అనుభవం 2002లొ జరిగింది. నేను అదే మొదటిసారి శిరిడి వెళ్ళటం .

నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం బాబా దర్శనానికి వెళ్ళాము.

సమాధి తాకుదామనుకుంటే అందలేదు. మొకాలెత్తి సమాధి గట్టు మీద పెట్టి తాక బోయాను.అక్కడి పూజారి గట్టిగా అరచి నన్ను తోసేసారు. నేను చాలా బాధపడి ఏడుస్తున్నాను.

బాబా నీ కోసమే ఇలా ఎంతో కస్టపడి వస్తే నువ్వు ఇలా చేస్తావా? అని బాగా కోపం వచ్చింది. బాగా ఏడుస్తున్నాను.

అయితే సమాధి మందిరంలో నుండి వచ్చి బయట కూర్చున్నాము. నేను, నా కుడివైపు మా చెల్లి, మా చెల్లి కుడివైపు మా అమ్మ కూర్చున్నాము. నేను ఇంకా బాగా ఏడుస్తూనే వున్నాను. అయితే ఒక కుక్క నా ఎడం వైపు వచ్చి నిలబడివుంది. నేను దానిని చూడలేదు. కానీ మా చెల్లి చెప్పింది. నీ పక్కన కుక్క వుంది అని, నాకు కుక్కలంటే చాలా భయం. అప్పుడు ఆ కుక్కను చూశాను. అద్భుతం ” ఆ కళ్ళు బాబా కళ్ళు, ఎంతో దయర్డంగా, ప్రేమగా, కళ్ళలో నీళ్ళు నిండి క్రిందపడతాయా అన్నట్టు కళ్ళనిండా నీళ్ళే” ఆ కళ్ళు చూడగానే బాబావారు వచ్చారని నాకు తెలసి పోయింది. ఆ కుక్క నన్ను తన ముందరి కాళ్ళతో తడుముతోంది. నాకు భయం అని మా అమ్మని అమ్మదాన్ని పిలువు అన్నాను. మా అమ్మ దానిని పిలిచింది. అది మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ దానిని ” బాబా రా” అని పిలిచింది అది దగ్గరికి వెళ్ళింది. అది మా అమ్మ చేయిని తడిమింది. మా అమ్మ చేయి చాపితే అది దాని కుడి కాలు 3 సార్లు మా అమ్మ చేతిలో పెట్టింది. అంటే బాబా మాకు “అభయ హస్తం” ఇచ్చారు. అసలు అకుక్క ఎదో ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలాగా వుంది. కాని వీధి కుక్కలాగా కనబడలేదు. ఆ కుక్క ఎంతో ఎత్తుగా, బలంగా, పుష్టిగా, మురికిగా బురద బురదగా వుంది. అంటే బాబా ఇలా కుక్క రూపంలో మురికిగా వుంటే గుర్తిస్తానా లేదా అని నాకు పరీక్ష పెట్టారు. ఆ కళ్ళు ఆ సంఘటన నా జీవితంలో నేను మరవ లేను. ఆ అనుభవం తలుచుకున్నప్పుడల్లా నాకు కాళ్ళ నుండి ఆనంద భాష్పాలు జాలు వారుతాయి.

టి పరమేశ్వరి
హైదరాబాద్.

సంపాదకీయం: సద్గురులీల (పిబ్రవరి & మార్చి – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles