బాబా నా మీద దయతలచారు కాబట్టి ఇలా నేర్పించగలిగారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


హారతి పాట బయటికి వినబడుతుంటే అలాగే నిలబడి విన్నాము. హారతి అయ్యాక  అక్కడే చెట్టుకింద ఆరుగు మీద ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము.

ఇంతలో తెల్లని వస్త్రాలు కట్టుకున్న తెల్ల గడ్డం ఉన్న (బాబా లాగే, బాబానే) ఒక ముసలాయన మా వైపు వచ్చి మరాఠీ, హిందీలలో మాకు అర్ధం అయ్యేటట్లు కొంచెం గంభీరంగా  ”ఇక్కడికి వచ్చి భవిష్యత్తు తెలుసుకోవాలి అని, బాబా లాగా కనపడితే ఎదో చెప్పించు కోవాలి  అని  ప్రయత్నించ వద్దు, అనుకోవద్దు,

మేము కాదు బాబాలం అసలు బాబా అక్కడ ఉన్నాడు. (సమాధి మందిరం వైపు చూపుతూ) ఆయనే పెద్ద బాబా మా లాంటి వాళ్ళని అడగకండి ఏదైనా కావాలన్నా , తెలుసు కోవాలన్నా ఆ పెద్దాయన్నే అడగండి ”అని బడా బడా చెప్పేసి వెళ్ళిపోయాడు.

మేమిద్దరమూ ఆశ్చర్య పోయాము, బస్సులో మేము మాట్లాడుకున్నది అక్షరాలా అదే కదా! (అంతే అప్పటినుండి  పంచాంగాలు చూసుకునేది లేదు ఏమైనా బాబా పైన భారం. ముహుర్తాలు, జ్యోతిష్యాలు వేటితోను  సంబంధం లేకుండా జీవితం సాగిపోయేలాగా చేస్తున్నారు బాబా).

ఆయన మా ముందు నుండి వెళ్ళిపోయాక మన మనసులో మాట ఇంత కరెక్టుగా చెప్పేసాడు, అసలు వచ్చింది ఎవరో కాదు ఆ బాబానే అలా  వచ్చారు అని ఆనందంతో మాట్లాడుకుంటూ ఆలోచనలో పడ్డాము.

ఇంత ఇష్టంగా హారతి కి వెళ్లి నిలబడదామంటే నన్ను లోనికి రానియ్యకుండా బయటే నిలబెట్టడానికి కూడా ఎదో కారణం ఉండే ఉంటుంది అని అనుకోని మాట్లాడుకుంటుంటే మా స్నేహితుడు ఒక విషయం నాకు జ్ఞాపకం చేసాడు.

అంతకు ముందు సంవత్సరం (2000)మేమిద్దరమూ షిర్డీ కి వచ్చినప్పుడు ఈ హారతులు నేను కూడా నేర్చుకోవాలి , వీళ్లందరితో పాటు సమాధి మందిరం  లో నేను కూడా బాబా ముందు పాడాలి అని  నేను తన తో అన్న  విషయం గుర్తు చేసాడు. ఆ విషయాన్నీ నేను పూర్తిగా మర్చిపోయాను.

నేను అంత సీరియస్ గా కూడా ఏమి అనలేదు, కళను బాబాకు అర్పించాలి అని పుస్తకంలో చదివింది గుర్తుండి ఆలా అన్నాను కానీ, బాబా మాత్రం సీరియస్ గానే తీసుకుంటున్నట్లున్నాడు.

బహుశా అందుకే నన్ను లోనికి రానివ్వకుండా బయటే నిలబెట్టి హారతి వినిపించారేమో! అని అనుకున్నాను.

నేను కూడా నా స్టూడెంట్స్ ని ఏదైనా నేర్చుకొని రాకపోతే నిల్చోబెట్టి చదివిస్తాను.

లోనికి రానివ్వకుండా నాకు కూడా సరిగ్గా అదే చేసారు బాబా, అని ఆలోచిస్తుంటే ఇంక ఏడుపు ఆగలేదు.

నన్ను బయట నుంచో పెట్టినందుకు బాధతో పౌరుషం పొంగుకొచ్చి, నీ హారతులు నేర్చుకు రానందుకు నన్ను లోనికి రానివ్వరా బాబా!

అయితే సరే! ఒక నెల రోజులు సమయమివ్వు, నేర్చుకొని వచ్చి నీకు నీ హారతులన్నీ అప్ప చెప్తాను అని బాబా తో మనసులోనే ఛాలెంజ్ చేసి షిర్డీ లోనే హారతుల పుస్తకం, కాస్సెట్ ను కొనుక్కొని ఆ మరు రోజు షిర్డీ నుంచి బయల్దేరి వచ్చేసాము .

ప్రతి రోజు కాస్సెట్ పెట్టుకొని, పుస్తకం చూస్తూ అచ్చం షిర్డీ లో పాడే విధంగానే సాధన చేసి బాబా దయ వలన, నాలుగు హారతులు నేర్చుకున్నాను.

సరిగ్గా నెల రోజుల్లోనే షిర్డీ వెళ్లి నిల్చున్నాను .”నన్ను లోనికి రానియ్యకుండా బయటే నిల్చోపెడతావా? ఆ రోజు హారతులు నేర్చుకు రాలేదని, ఇదిగో హారతులు నేర్చుకొని వచ్చా” అని బాబా వైపు చూస్తుంటే ఎందుకో ఏడుపు ఆగడంలేదు తన్నుకొస్తోంది ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాను.

హారతి మొదలైంది అక్కడెక్కడో బాబా ముందు నిల్చున్న సంస్థాన్ గాయకుల గొంతు, అంతే గంభీరంగా వెనుక నిల్చున్న నా గొంతు ఎదో తెలియని అనుభూతి,

ఎంతో ఆనందం, ఎదో సాధించానని కొంత విజయ గర్వం, తృప్తి. మన భాష గాని మరాఠీలో మన ఇష్ట దైవమైన బాబాకు, హారతులు నేర్చుకొని మొత్తానికి నాలుగు హారతులు అప్పజెప్పడం జరిగింది అనుకున్న విధంగా

అప్పటి నుండి ఇప్పటి వరకూ నా జీవితంలో భక్తి పరమైన పాటలు హారతులు మరియు భజనలు తప్ప వేరే పాటలు పాడించలేదు బాబా.

నిజానికి ఇదేదీ మనం అనుకుంటే జరిగింది కాదు, బాబా నా మీద దయతలచారు కాబట్టి ఇలా నేర్పించగలిగారు.

అదంతా ఆయన భిక్ష, ఆయన గొప్పదనం, ఆయన ప్రేమ తత్వం ”ఇలాగే జీవితాంతం నీ హారతులే పాడించుకో బాబా, నీ భజనలే చేయించుకో బాబా, నిరంతరం నీ నామస్మరణే జరిపించుకో బాబా!”.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles