Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-87-1112-అడుగు ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు 4:13
నా పేరు రాయపాటి సాంబశివరావు. రామక్రిష్ణా అనికూడా అంటారు. మావూరు ఉలవపాడు, మండలం చాగొల్లు.
1977 మే నెలలో సాయిబాబా క్యాలాండరు సైజు ఫోటో, ఆ ఫోటోలో బాబా చిత్రము పెద్దది, చిన్న శివలింగము,
శివలింగంపైన సర్పము వుండే ఫోటో మా ఇంటి పూజమందిరంలోకి గాలికి వచ్చి వేల్లికిలపడుకుండా పటము నిలబెడితే ఎట్లా నిలబడుతుందో అట్లా మా పూజ మందిరములో పటాలవద్ద నిలబడింది.
1977 సం’లో బాబా గురుంచి తెలియదు. శివలింగాన్ని పూజించుకుంటున్నాను.
తిరుపతి, శ్రీశైలం మొదలైన పుణ్యక్షెత్రాలు తిరిగాను. షిర్డీకి మాత్రం పోలేదు.
1977వ సం’లో మా ఇంటిలో బాబా ఫోటో వచ్చినపుడే ఒంగోలులో సాయిబాబా మందిరము కడుతున్నారు.
నా ఇంట్లో గాలికి వచ్చిన ఫోటో గురించి నా ఇంటి చుట్టుప్రక్కల వారిని అడిగాను..
మీరేమైన ఫోటో పోగొట్టుకోన్నారా అని అడిగాను. మాది ఎవ్వరిది కాదు అని చెప్పినారు.
బాబా గురుంచి చుట్టుప్రక్కల వారిని అడిగాను. ఆయన ముస్లీము అని కొందరు, హిందువని కొందరు చెప్పారు. కొందరు మాత్రము భరద్వాజ మాష్టారు దగ్గరికి పొమ్మన్నారు.
ఒంగోలుకి పోయి మాష్టారుగారిని కలిశాను. మేఘశ్యాముడు కూడా ఈశ్వరుడిని పూజించేవాడు.
అతనికి శివలింగాన్ని ఇచ్చి బాబా ఆశీర్వదించారు. సద్గతి కలుగ చేశారు.
నువ్వుకూడా ఆదృష్టవంతుడివి అని సాయి లీలామృతము, గురుచరిత్ర పుస్తకములు నాకు ఇచ్చారు.
ఫోటో రూపములో బాబానే నీ దగ్గరకు వచ్చారు. నువ్వు షిర్డీకి పోయిరా అని ఆశీర్వదించారు.
నాకు హిందీ మరాఠీ రాదు. నేను ఒక్కడినే పోలేను అని అన్నాను. అన్ని ఆయనే చూసుకుంటారని మాష్టారు గారు చెప్పారు.
1987 సం!! గురుపుర్ణిమకి షిర్దికి పోయేదానికి బాబా ఆజ్ఞ లభించింది.
నాతొ పాటు షిర్దికి మాతమ్ముడికి కూడా బాబా అవకాశం కల్పించారు. మొదటిసారి బాబా దర్శనంతో పులకించిపోయాను.
చెప్పలేనంత ఆనందాన్ని పొందాను. 1977 నుండి ఇప్పటి వరకు బాబానే నమ్ముకున్నాను.
బాబానే పూజిస్తున్నాను.బాబా ద్వారా ఎన్నో లీలలను పొందాను.
నేను మా తమ్ముడు షిర్దికి 1987 సం!! మొదటిసారి పోయేటప్పుడు ఒక లీల జరిగింది.
హైదరాబాద్ లో ఉదయాన్నే ముఖం కడుగుకుంటూ వాచీ వాష్ బేసిన్ వద్ద వదలి మరచిపోయాను.
మరలా పోయి చూస్తే వాచీ లేదు.
ఇంతలో రైలుపెట్టెలో ఒక సాధువు మాదగ్గరకు వచ్చి నీ వాచీ పొయిందా! “ప్రక్క స్టేషన్ లో కాలికి ఆరు వెళ్ళు వుండే ఆయన్నుఅడుగు ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు”.
మేము ఆశ్ఛర్యపోయాము. ఎందుకంటే మా వాచీ పోయిన సంగతి ఎవరికీ చెప్పలేదు. అయన ఎవరో కూడా మాకు తెలియదు. అందువల్ల మేము ఆశ్ఛర్యపోయాము.
ప్రక్క స్టేషన్ లో రైలు ఆగింది. సాధువు చెప్పినట్లు ప్లాట్ ఫారము మీద చూడగా ఒకాయనకు కాలికి ఆరువ్రెళ్ళు వున్నాయి.
అయన దగ్గరకు వెళ్లి వాచీ ఇయ్యి అని అడిగాము. వాచీ ఇచ్చాడు. ఇంతలో ట్రైన్ కదిలింది.
మేము ఆయనతో మాట్లాడే టైము కూడా లేదు. ఆయనను చూస్తూ నమస్కరిస్తూ ఆయనలో బాబాను దర్శించాము.
రామకృష్ట
ఉలవపాడు, మండలం చాగొల్లు .
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పోయిన వాచ్ దొరికింది—Audio
- తన గుడి గోపురం ఎలాఉంటుందో బాబాగారు చూపించారు.
- సాయి భావన, జహీరాబాద్
- లాటరీ ద్వారా ఇంటికి వచ్చిన బాబా.
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments