తన గుడి గోపురం ఎలాఉంటుందో బాబాగారు చూపించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా … సాయిబాబా …సాయిబాబా … సాయిబాబా

నాపేరు మారుతి. బాబాగారు నాకు ఇచ్చిన అనుభవాన్ని పంచుకుంటున్నాను సాయి.

మా పాప పేరు అమేయ. ఈరోజు అనగా 3-2-2019న మధ్యాహ్నము మా పాపకు అన్నము పెడుతున్నాను.

మా పాప ఆలస్యంగా తింటుంది. కాబట్టి, నేను త్వరగా తిను, బిందు అక్క, సాయి అన్న    వాళ్ళు వస్తున్నారు.

వాళ్ళ ఫోటో కూడా పంపారు చూడు అని వాళ్ళ WhatsApp ప్రొఫైల్ ఫ్యామిలీ  ఫోటో చూపించాను.

మా పాప ఆ ఫోటో చూస్తూ త్వరగా తింటుంది.

ఆ ఫోటోలో ఒక టెంపుల్ కనపడుతుంది. అంటే ఆ టెంపుల్ గోపురం బయటవైపు కనపడుతుంది.(బాబాగుడి మాత్రం కాదు, వేరే ఏదో గుడి).

నేను మా పాపని ఆ గుడి ఏ దేవుడిది అని అడిగాను.

మా పాప వెంకటేశ్వరస్వామి గుడి అని అంది.

నేను వెంటనే బాబా తాత గుడి అయితే ఎలా ఉంటుంది? చూపిస్తాను ఉండు బాబా తాత గుడి గోపురం ఎలా ఉంటుందో అని WhatsApp బాబావారి గ్రూప్ “saileelas.com” కాంటాక్ట్స్ లలో,

ప్రొఫైల్ ఫొటోలలో బాబావారి గుడి గోపురం ఫోటో చూసాను అంతకుముందు కాబట్టి ఇప్పుడు కూడా ఆ ఫోటో  ఉంటుందేమో అని వెతుకుతున్నాను.

ఆ ఫోటోలు కొన్ని వెతికాను. కానీ బాబావారి గుడి గోపురం వున్న ఫోటో కనపడలేదు.

ఇంతలో ఆ ఫోటోలు వెతుకుతూ వున్నప్పుడు Google లో Baba Temple అని టైప్ చేస్తే బాబాగుడి గోపురం ఫోటో వస్తుంది కదా అది మా పాపకి చూపించొచ్చు అనుకున్నాను.

అలా అనుకోని బాబాగుడి ఫోటో వెతికే పేజీ నుండి WhatsApp లోనే back page కి వచ్చాను.

Back Page కి రాగానేసాయి సైన్యంWhatsApp Group లో ఒక ఫోటో వచ్చి వుంది.

కాని ఫోటో సరిగా load అవలేదు.

ఏంటా ఫోటో వచ్చి ఉంది అనుకోని బాబాగుడి గోపురం ఫోటోనే నేమో అనుకోని(ఎందుకో మనసుకి అనిపించింది బాబాగుడి గోపురం ఫోటోనే నేమో అని

నేను ఫోటోపై Click చేశాను, నేను ఫోటోపై వున్న Arrow Mark పై click చేసాక ఫోటో download  అయింది. 

చూడగా ఫోటో బాబాగారి గుడి గోపురం ఫోటోనేఎంతో హ్యాపీ అనిపించింది.

నేను మా పాపతో మాట్లాడి వెతికే  ఫోటోనే నా కళ్ళ ఎదుట చూపించారు బాబా.

మా సంభాషణలో మా మధ్యనే వున్నారు బాబాగారు.

మీరు మీ భక్తుల వెంటే వుంటారు బాబా.

ఆ ఫోటో ఈ క్రింది ఫోటోనే

బాబాగారు తన మనవరాలు అమేయకి తానే స్వయంగా తన గుడి ఫోటో ఎలా ఉంటుందో చూపించినట్లు వుంది.

భక్తులయందు బాబాగారికి ఎంతో ప్రేమ.

ఈ సంభాషణలో మాకు బాబాగారి పేరు వచ్చిందో లేదో బాబాగారు ఈ లీలను ప్రసాదించారు.

సర్వజ్ఞులైన, దైవస్వరూపులైన, దయామయులైన, ప్రేమాస్వరూపులైన బాబాగారికి  నా కృతజ్ఞతలు

సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles