బాబా ఫోటో లోనుంచి నాకు మాటలు వినపడ్డాయి. ” నీ కొడుకుని అడుగు ఉన్నాడుగా అడుగు” అని వినిపించింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మరోసారి వనస్థలిపురం లో వైదేహి నగర్ బాబా గుడి ఎదురుగా ఉన్న 500 గజాల స్థలం గుడి వాళ్ళు కొనదలచి భక్తుల నుంచి విరాళాలు సేకరించదలిచారు.

ఒక్క గజం ధర 20,200 రూ|| లు అని చెప్పారు. నాకు అందులో భాగం పంచుకోవాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఎలా ఎలా అనుకుంటున్నాను.

అంత డబ్బు కాకపోయినా ఎంత వీలుంటే అంత ఇవ్వొచ్చు అన్నారు.

నాకు 2000 రూ || లు ఇవ్వాలని ఉంది. బాబా ఫోటో ముందు నిలబడి ఆయనకేసి చూస్తూ ” బాబా నీకు తెలుసుగా, నీకోసం ఆ స్థలానికి 2000 రూ || లు ఇవ్వాలని ఉంది. ఏం చేస్తావో, ఎలా చేస్తావో మరి ” అన్నాను.

బాబా ఫోటో లోనుంచి నాకు మాటలు వినపడ్డాయి. ” నీ కొడుకుని అడుగు ఉన్నాడుగా అడుగు” అని వినిపించింది.

నా కొడుకా! వాడు పిల్లికి బిచ్చమ్ పెట్టని వాడు. నయాపైసా కూడా ఎవ్వరికి మామూలుగానే ఇవ్వడు, ఈ స్థలానికి ఇస్తాడా అని నవ్వుకున్నాను.

ఊరికే తమాషా చేస్తుంటాడు బాబా అనుకుంటూ కొడుక్కి ఫోన్ చేసి 2000 రూ || లు కావాలి అన్నాను విషయం చెప్పకుండా. ఎక్కడికి తెమ్మంటావమ్మా అని అడిగాడు అంతే మా సంభాషణ.

NGOs కాలనీ బస్సు స్టాప్ కి పట్టుకు రమ్మన్నాను. ఒక గంటలో తెచ్చిచ్చాడు. సనత్ నగర్ లో ఉంటారు వాళ్ళు .

తిన్నగా గుడి కెళ్ళి స్థలం కోసం డబ్బు కట్టి రసీదు తీసుకున్నాను.

మేము ఈ నాటికీ ఈ మాత్రం ఉన్నామంటే అంత ఆయన చలవే . బాబాయే మమ్మల్ని నడిపిస్తున్నాడు.

మా వారికీ ఒంట్లో అంతగా బావుండదు. షుగర్ , బి . పి ఉన్నాయి.

ఒకప్పుడు బాగా సిగెరెట్లు కాల్చిన మూలాన ఒక ఊపిరితిత్తు పాడైంది. ఆపరేషన్ చేసి తీసేసారు. ఆ ఆపరేషన్ అప్పుడు కూడా బాబా ఆయన పక్కన ఉన్నారు.

ఊపిరి తీసుకోవడం కష్టం గా ఉంటుంది. పగలంతా పర్వాలేదు. రాత్రయితే ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఆక్సిజన్ మెషిన్ ఒకటి కొనేసుకున్నాం.

హాస్పిటల్ కి వెళ్లినా, టెస్ట్ లు చేయించుకున్నా, బయటి వెళ్లినా మా వారు బాబా బాబా అని అనుకుంటూ ఉంటారు.

బాబా అనుకుంటే టెస్ట్ రిపోర్ట్ ఫలితం సరిగ్గా వచ్చేస్తుంది. బాబా మమ్మల్ని దగ్గరుండి నడిపిస్తున్నాడు. ఆయన లేకపోతే మేము లేము.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “బాబా ఫోటో లోనుంచి నాకు మాటలు వినపడ్డాయి. ” నీ కొడుకుని అడుగు ఉన్నాడుగా అడుగు” అని వినిపించింది.

Veeravalli nagamani

Om Sai ram na husband recent ga expired ayyaru chala amount maaku ravali memu kuda verevallaku ivvali sai ram na problems solution amina istara

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles