నైతిక విజయం … .మహనీయులు – 2020… అక్టోబరు 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తన దేహాన్ని అక్టోబరు 15న విసర్జించారు. ఆ దినం హిందువులకు, మహమ్మదీయులకు పవిత్రమైన దినం.

ఆ దినమే విజయదశమి. ఆ నాడే దుర్గాదేవి అసురుడైన మహిషాసురుని వధించినది.

ఆ దినముననే ప్రత్యర్థులు ప్రవక్త మనుమడైన హుస్సేనును సంహరించిన దినం.

నిజం చెప్పాలంటే లోకికంగా హుస్సేను ప్రత్యర్థులకు విజయ దినమే. కానీ ఇది హుస్సేనుకు పరాజయంకాదు. నైతిక విజయమే.

రాక్షస శక్తులతో పోరాడవలసినప్పుడు నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, హుస్సేనును ఉదహరిస్తారు.

ముస్లింలలోని షియా సాంప్రదాయకులు ఈ దినాన్ని అతి పవిత్రమైన సంస్మరణ దినంగా జరుపుకుంటారు.

ప్రజలు ప్రజాస్వామ్యరీతిలో ప్రతినిధులను ఎన్నుకోవాలి. ఆ ఆచారం ప్రకారమే మహ్మద్ ప్రవక్త మొదటి మనుమడు హాసన్ ఖలీఫా అయ్యాడు.

ఐతే ప్రత్యర్థులు రక్తపుటేరులు పారించి, ఆ పదవిని చేపట్టాలనే పధకం వేశారు.

అలా యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పాతారని హాసన్ భావించి, ఆ పదవిని త్యజించాడు.

హాసన్ ప్రత్యర్థుల విష ప్రయోగానికి గురై మరణించాడు.

హాసన్ సోదరుడైన హుస్సైన్ ప్రవక్త రెండవ మనుమడు (ప్రవక్త కుమారైన ఫాతిమా, అల్లుడైన అలీల రెండవ కుమారుడు) సంప్రదింపులకు కుఫాకు మిత్రులు, కుటుంబ సభ్యులతో బయలుదేరాడు.

ఈ విషయం తెలిసిన ప్రత్యర్థి యాజిద్ వారిని కర్బాలా అనే చోట అడ్డగించి, వెనుకకు తిరిగిపోకుండా చేశాడు. యుద్ధం మొదలైంది.

యాజిద్ హుస్సేన్ బలగానికి ఆ స్థలంలో నీటిచుక్క అందకుండా చేశాడు.

దాహంతోనే యుద్ధం చేస్తున్నాడు హుస్సేన్. అయన యుఫ్రటీస్ నదిలోని జలాన్ని తాగాలని గుర్రపు స్వారీ చేసుకుంటూ బయలుదేరాడు.

నది కొద్ది దూరంలో ఉండగానే గుర్రాన్ని సంహరించారు ప్రత్యర్థులు.

నేలకూలిన హుస్సైన్ అలాగే ఆ నది ఒడ్డుకు పోతుండగా, ప్రత్యర్థులు ఆయనను బాణాలతో వధించారు. ఈ దినాన్నే మొహర్రం అంటారు.

ఇది పండుగా దినం కాదు. ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల పరిరక్షణకై జరిగిన చారిత్రక పోరాటంగా, హుస్సైన్  విషాద గాథను స్మరిస్తారు. దీనినే పీర్ల పండగ అంటారు.

సాయిబాబా కూడా పీర్ల పండుగను ఆమోదించారు. పలుసార్లు హుస్సైన్ పేరును పలకటం కూడా సాయి చేశారు.

ఇది హుస్సైన్ కు ఆయనతో పాటు వీర మరణం పొందిన వ్యక్తులకు జరిపే వీరపూజగా మనం భావించవచ్చును.

ఈ మహానుభావుని అక్టోబరు 10, 680 A .D  న ఘోరాతి ఘోరంగా వధించారు.

నేడు అయన వర్ధంతి.

ఆయనను స్మరిద్దాం! తరిద్దాం!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles