Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
యోగీంద్ర మోహినీ మిత్రాను అందరూ యోగిన్ మా అని పిలుస్తారు. ఆమె గృహస్తురాలు.
ఆధ్యాత్మిక సాధనాలు చేసేవారు. ఈ రెంటిని ఆమె జీవితాంతం వదలలేదు. అంటే ఆమె జోడు గుర్రాలపై సవారీ చేసే వారనవచ్చును.
ఆమె భర్త ధనికుడు. మెట్టినింటిలో కులగురువు దేవీ మంత్రోపదేశం చేశాడు. ఐతే భర్త అవినీతిపరుడు.
ఆమె తన కూతురితో పుట్టింటికి ఒకసారి వచ్చింది. అప్పుడే రామకృష్ణ పరమహంస పరిచయమయ్యారు. రామకృష్ణులు కూడా ఆమె మెట్టినింటి కులగురువు. ఉపదేశించిన దేవీ మంత్రాన్ని రూఢిపరచారు.
సాయిబాబా కూడ వివిధ సందర్భాలలో ఏ భక్తునికైనా తమ కులగురువులు ఉపదేశించిన మంత్రాన్నే జపించమనేవారు.
యోగిన్ మా ప్రభావంతో ఆమె భర్త తన జీవన విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించాడు. పరమహంసను దర్శించాడు. తన భర్త అవసాన దశలో అతనిని తన పుట్టింటికి తెచ్చి సేవ చేసింది.
బృందావనంలో ఆమె లాలాబాయి ఆశ్రమంలో ధ్యానం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోనికి వెళ్ళింది. ఆమె శిలా విగ్రహంలాగ ఉండిపోయింది. ఆలయం తలపులు మూసే వేళ అయింది.
రామకృష్ణ పరమహంస శిష్యులు యోగానందస్వామి, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని, ఆమె చెవిలో రామకృష్ణ నామాన్ని ఉచ్చరింపసాగాడు. కొంచెంసేపట్లో మామూలు స్థితికి వచ్చింది.
భక్తి ప్రపత్తులతో ఆమె చిత్రపటాలను పూజించేది. ఆమెకు ఆ ఆధ్యాత్మిక భావంలో ఎటుచూసినా ఇష్టదైవమే కనిపించేవారు. అలా ఆమె మూడు రోజులుంది.
ఆమె పంచతపాన్ని అనుష్టించేది. నాలుగు దిక్కులలోను తన చుట్టూ అగ్నిని రగిలించి, సూర్యుడే ఐదవ అగ్నిగా, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చేసేది
ఆమె ధ్యాన సమయంలో ఈగలు కళ్ళ మీద వ్రాలేవి. ఆమెకు ఏమాత్రం స్పృహ ఉండేదికాదు.
ఆమె నిరాడంబరంగా ఉండి తల్లితో కలిసి జీవించి, ఆమెకు సేవలు చేసేది. ఆమె తన కుమార్తె వివాహానంతరం కూడా గృహస్థాశ్రమం తప్పలేదు.
అల్లుడు, కుమార్తె మరణించారు. వారి సంతానాన్ని కూడా ఆమె సాకింది.
సాయిబాబా భక్తుడు బాపు సాహెబ్ జోగ్ వలె, ఆమె (యోగిన్ మా) అవిశ్రాంతంగా శ్రమించేది.
అమిత చలి, కుండపోత వర్షంలో కూడా ప్రతి రోజూ గంగలో స్నానాన్ని, రెండు గంటల ధ్యానాన్ని మార్చలేకపోయాయి.
ఈ రెండు రేఖలు సమాంతరంగా సాగిపోయాయి. అదే రెండు గుర్రాల స్వారీ.
ఒకసారి ఆమె పాదం ఒక సన్యాసి వస్త్రాన్ని తాకింది. ఆమె చేతులు జోడించి సన్యాసికి నమస్కరించింది. “అమ్మా! నీ పాద స్పర్శ నాకు దీవెన” అన్నాడు ఆ సన్యాసి.
ఆమె జూన్ 4, 1924న జ్ఞానావస్థలో దేహ పరిత్యాగం చేసింది. నేడు జూన్ 4. ఆమె వర్థంతి. ఆమె ఆదర్శమును పాటింతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పతితులారా…. మహనీయులు – 2020… జూన్ 28
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
- ఒకటి కోసమే రెండు… మహనీయులు @2020 – జనవరి 10
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “రెండు గుర్రాలపై స్వారీ …. మహనీయులు – 2020… జూన్ 4”
Sivakoteswar Rao Borra
June 4, 2020 at 3:07 pmVery good article about Yogini Maa….