ఒకటి కోసమే రెండు… మహనీయులు @2020 – జనవరి 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పూరీలోని జగన్నాధుని దర్శించటానికి, ఒక సన్నని మహనీయుడు తన శిష్యులతో ఆ ప్రాంగణంలోకి వస్తున్నాడు.

ఆయన నోటివెంట భగవన్నామము వస్తోంది. ఆయన మెడకున్న సన్నని వస్తానికి కట్టబడిన రెండు పాదుకలు ఆయన గుండెపై ఉన్నాయి.

ఆ పాదుకలు ఆయన గురువువి. ఆలయంలో కలకలం మొదలైంది. కొందరి చేతులలో ‘కరపత్రాలు’ ఉన్నాయి.

“ఆ కలకలం ఏమిటి? ఆ కరపత్రాలేమిటి?” అని ఆ మహనీయుడు అడగగా “ఆ కరపత్రం ఒరియా భాషలో ఉన్నదని, సరిగ్గా అదే సమయానికి ఒక సాధువు గుండెలపై తన గురు పాదుకలతో శిష్య బృందంతో వస్తాడని” ఉంది.

ఇది తెలిసిన ఆ సాధువు ఆశ్చర్యపోయాడు. ఆ సాధువే శ్రీ సీతారాందాస్ ఓంకార్ నాధ్. అలా ఆ సాధువు వస్తాడని 400  ఏండ్ల క్రితమే చెప్పిన మహనీయడు ఒరిస్సాకు చెందిన అచ్యుతానందదాస్.

ఒరిస్సాకు చెందిన పంచసఖులలో ఈయన ఒకరుమిగిలిన వారు బలరామదాస్, జగన్నాధదాస్, అనంతదాస్, జసోవంత్ దాస్.

అచ్యుతానందదాసుని జననమే విచిత్రంగా ఉంటుంది. తండ్రి దీనబంధు కుంఠియా, తల్లి పద్మావతీ పూరీజగన్నాధుని దర్శించి సంతానం కోసం ప్రార్ధించారు.

ఆ రాత్రి విష్ణువాహనమైన గరుడుడు బిడ్డను ప్రసాదించినట్లు దీనబంధునకు స్వప్నం వచ్చింది.

అచ్యుతానందుడు జన్మించిన దినం మాఘ శుక్ల ఏకాదశి – జనవరి 10, 1510.

ఈయన చైతన్య మహాప్రభుని దర్శించాడు. ఈయన ఇతర పంచసఖులవలె అక్కడ ప్రజల భాషైన ఒరియాలోకి “హరివంశము” ను అనువదించాడు.

పేరుకు అనువాదమైనా స్వతంత్ర రచనగానే దీనిని భావిస్తారు. జగన్నాధదాసు ఒరియా భాగవతము తరువాత దీనికి అంతటి ప్రాచుర్యం లభించింది.

అచ్యుతానందులు శూన్య సంహితతోపాటుగా ఇతర రచనలు చేశారు. భవిష్యత్తులో జన్మించబోయే మహాత్ములను గూర్చి కూడా వ్రాశారు.  ఉ.దా: సీతారాందాస్ కలకంఠనాథ్, అరవింద ఘోష్, రామకృష్ణ పరమహంస.

 భగవానుడు నిర్గుణ రూపమే కాదు సగుణరూపి అంటారీయన. వీరిది జ్ఞాన, భక్తి మిశ్రమ మార్గము.

వీరి దృష్టిలో భక్తి (ప్రేమ) జ్ఞానము – రెండూ అవసరమే, సన్మార్గికి భక్తి జ్ఞానములు అవసరము.

ఒక పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, సన్మార్గికి భక్తి జ్ఞానములు అంతే అవసరము.

పక్షి దృష్టికి రెండూ కన్నులు అవసరమైనట్లు నిర్గుణ, సగుణ రూపములు (రెండు కన్నుల వలె) ఒకే మూర్తిని దర్శించుటకు అవసరమే. లేకున్నా దృష్టి పాక్షికమే అగును.

నేడు జనవరి 10  – అచ్యుతానందుని జన్మదినం.

సాకారి, నిరాకారి అయిన ఆ సగుణ, నిర్గుణ బ్రహ్మమయి అండపిండ బ్రహ్మాండముల వ్యాపించిన ఆ జగన్నాధుని దర్శించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles