Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నీటితో దీపాలు వెలిగిస్తే , సాయిబాబాను మహాత్ముడని నమ్మారు. మహత్తులు చూపేవరకు ప్రజలు మహాత్ములను నమ్మరు.
రవిదాస్ “భగవన్నామాన్ని విశ్వసింపుము అదియే రక్ష” అని పలికేవారు.
నామం ఏం చేస్తుందిలే అనేవారప్పుడూ ఉన్నారు. ఒకడు “నామముతో సంసార సాగరాన్ని దాటవచ్చు అంటున్నారు కదా మీరు. ఇదిగో ఒక గుండ్రాయి, ఇది గంగను దాటగలదా?” అని ప్రశ్నించాడు.
రవిదాసు ఆ రాతిని తీసుకుని గంగలో వేశాడు. నామాన్ని ఉచ్ఛరించసాగాడు. ఆ రాయి ప్రవాహం ఈదుకుంటూ ఆవలి తీరం చేరింది. నామ మహిమ తెలిసింది అక్కడున్న వారందరికి.
రవిదాసు అంటే దక్షిణ భారతంలో అంతగా తెలియకపోవచ్చును. అయన సుప్రసిద్ధ రామానందుల శిష్యుడు. మీరాబాయికి గురువు: కబీరుకు తోటి శిష్యుడు.
కబీరు “నేను అమ్మ చంకనెక్కి దారికి అడ్డంగా పోయాను. రవిదాసు అమ్మతో నెత్తిన భారాన్ని పెట్టుకుని దారివెంట నడిచాడు” అనేవాడు రవిదాసు గురించి.
ఒకసారి కాశీలో పెద్ద కాటకం వచ్చింది. ఇది బలహీన వర్గాలకు గొడ్డలిపెట్టేంది. రవిదాసు మీద ప్రేమాభిమానాలున్న సాధువు ఒకడు వచ్చి స్పర్శవేదిని ఇచ్చాడు.
“అయ్యా! ఎందుకు? ఏం చేయాలి దీనితో? హరి నామమే కదా నా సర్వస్వం. ఖర్చు పెట్టిన కొద్ది పెరిగే ధనము. నాకెందుకీ రాళ్ళు రప్పలు?” అన్నాడు.
సాధువు తీసుకో అని పట్టుపట్టాడు. “సరే ఒక చూరులో పెట్టు” అన్నాడు. అలాగే చూరులో పెట్టి వెళ్ళిపోయాడు ఆ సాధువు. కాటకం తీరిపోయింది.
ఆ సాధువు తిరిగివచ్చాడు. “నేనిచ్చిన వస్తువేమైంది? ఉపయోగపడ్డదా?” అని అడిగాడు సాధువు.
“చూడు బాబూ! నీవెక్కడ పెట్టావో అక్కడే ఉంది” అన్నాడు రవిదాసు.
భగవంతునికి తనను సమర్పించుకున్న రవిదాసును చూచి ఆనందభాష్పాలు కార్చాడు సాధువు.
ఒకసారి రవిదాసు మీరాబాయి భవనానికి వెళ్ళాడు. గురువు రాకతో ఆమె సంతసించింది. ఒక విందును కూడా ఏర్పాటు చేసింది.
బ్రాహ్మణులు రవిదాసుతో కలసి భుజించేందుకు ఇష్టపడలేదు. కానీ మీరాబాయికి కోపం వస్తుందేమోనని సంశయించారు.
బ్రాహ్మణులందరు ప్రక్కప్రక్కగా కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుని ప్రక్కన రవిదాసు కూర్చున్నాడు. ఇంతమంది రవిదాసులు ఒకేసారి ఎలా సాధ్యం? మతిపోయింది ఆ బ్రాహ్మణులకు.
రవిదాసు మహత్తును గ్రహించారు. ఆయన వద్దనుండి దీక్షను గైకొన్నారు కూడా.
రవిదాసు వ్రాసిన కొన్ని చరణాలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహెబ్ లో చేర్చబడ్డాయి.
రవిదాసు స్మారక తపాలా బిళ్ళను ఫిబ్రవరి 10న భారత ప్రభుత్వం విడుదల చేసింది.
నేడు ఫిబ్రవరి 10. రవిదాసు (రైదాస్, రహిదాస్) నామ సంకీర్తనలో పాల్గొందాం! “నీ నామమే ఆరతి, నీ నామమే నివేదన….”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దేహమే దేవాలయం …. మహనీయులు – 2020… మార్చి 10
- ఒకటి కోసమే రెండు… మహనీయులు @2020 – జనవరి 10
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 25
- కాశీలో రామ నామం! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 4
- శ్రమ విలువ…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments