Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కన్హన్ గడ్ లో ఆనందాశ్రమాన్ని స్థాపించింది రామదాసు. ఈయన పూర్వాశ్రమ నామం విఠల్ రావ్.
తండ్రి ఈతని ఆధ్యాత్మిక చింతనను గ్రహించి “శ్రీరామ జయరామ జయ జయరామ” అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఇల్లు, సంసారం విడిచి దేశాటన చేశాడు.
ఒకసారి బద్రీనాథ్ కు వెళ్ళారు రామదాసు. ఆ సమయంలో లెక్కకు మించిన యాత్రీకులున్నారు.
బదరీనాథ్ మందిరమునకు రెండు ద్వారములున్నాయి. ఒక దాని ద్వారా అందరూపోయి దైవాన్ని దర్శించుకోవచ్చు. రెండవ మార్గం చాల చిన్నగా ఇరుకుగా ఉంది.
అనారోగ్యంగా ఉండేవారికే ఆ త్రోవను వదులుతారు అక్కడివారు. దర్శనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అక్కడ ఒక పండా కావాలిగా ఉన్నాడు. “నీవు అనారోగ్యంగా ఉన్నట్లయితే ఈ మార్గం గుండా పోవచ్చును” అన్నాడా పండా.
అంటే తాను రోగిష్టినని చెప్పుకోమనే సూచనను పండా ఇచ్చాడు. దీనిని రామదాసు గ్రహించాడు.
“లేదు. అసత్యం పలికి బదరీనాథుని దర్శించలేను. అలా పలకటం దైవం దృష్టిలో నేరం” అని రామదాసు అన్నాడు.
రామదాసు సత్య సంధతకు ఆ పండా సంతసించి, ఆ మార్గం ద్వారా రామదాసుని పంపాడు.
ఆ పండాలో తన రాముని చూచాడు రామదాసు. సాయి కూడా అసత్యం పలికేవారు దైవానికి దూరమవుతారనేవాడు.
ఒక రోజు రాత్రి పది గంటలైంది. తన ఆశ్రమపు గదిలో రామదాసు దైవ ధ్యానంలో ఉన్నాడు.
ఒక సన్యాసి గుమ్మం వద్ద నిలబడి “లోపలికి రావచ్చునా?” అని అడిగాడు. “రావచ్చును” అన్నాడు రామదాసు.
“ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చునా?” అడిగాడు సాధువు. “అట్లాగే” అన్నాడు రామదాసు.
కూర్చున్నాడు ఆ సన్యాసి. “నాకు మంచి బట్టలు లేవు. ఇస్తారా?” అని అడిగాడు సాధువు. తన ఒంటి మీద నున్న బట్టలను తీసేశాడు (లంగోటీ మినహా) రామదాసు.
అక్కడే ఉన్న దుప్పటితో శరీరాన్ని కప్పుకున్నాడు రామదాసు. “ఇవన్నీ రాముడివే. నీవే రాముడివి, తీసుకో” అంటూ రామదాసు సన్యాసికి ఇచ్చాడు.
“తరువాత నీవు విచారిస్తానేమో?” అడిగాడు రామదాసుని సన్యాసి. “రాముని వస్తువులను రాముడే తీసుకున్నాడు. అంతే!” అన్నాడు రామదాసు, సన్యాసి ఆ వస్తువులన్నిటిని తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇది “రామ లీల” అని గ్రహించాడు స్వామి రామదాసు. అన్నిటిలో, అంతటా రాముని కాంచగలిగే వారికి దుఃఖం ఎక్కడుంటుంది – ఉండేది ఆనందమే. అందుకే తన ఆశ్రమానికి ఆనందాశ్రమమని పేరు పెట్టుకున్నాడు రామదాసు.
రామదాసు వర్థంతి జూలై 25, 1963.
నేడు జూలై 25, స్వామి రామదాసును స్మరిద్దాం! శ్రీరామ జయరామ జయ జయరామ….
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 26
- అద్భుతం కేశవం…..మహనీయులు – 2020 – జనవరి 22
- జయ జయ శ్రీరఘవీర సమర్థ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 22
- “నీ దయ గంగా గౌతమి రామయ్య”… …. మహనీయులు – 2020… జూన్ 6
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments