Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా డాక్టర్ పండిట్ కు, మద్రాసు భజన సమాజ మహిళకు రామునిగా సాక్షాత్కరించాడు.
సింగన్నకు జంతు ప్రీతి ఎక్కువ. బాల్యంలో తనను భోజనమునకు పిలిచిన కుక్క పిల్లలను కూడ తెచ్చి, వాటితో కలసి భుజించేవాడు.
ఎవరైనను కుక్కల పిల్లలను కొట్టిన, వాటిని మరల చేరదీసి, తన కంచములోని భోజనమునే పెట్టెడి వాడు.
ఆ భూత దయ బాల్యములోనే అట్లున్నది. అతడు ప్రతి దినము రామ మందిరమున భజన చేసి గాని నిద్రించేవాడు కాదు.
భగవంతుని సాక్షాత్కారం కోసం పరితపించేవాడు. ఒకసారాయనకు సింగరగిరిలో నృసింహుడు సాక్షాత్కరించాడు. ఆనాడు ఆయన ఆనందమేవేరు.
సీతాంబ అను ఒక బ్రహ్మచారిణి ఆయనకు గురువై రామతారకం ఉపదేశించింది. ఆ ఆలయంలో ఆయనకు నృసింహాడే రాముడైనాడు.
భావ సమాధి అనగా తన ఇష్టదైవమును సాక్షాత్కరింపచేసుకొనునది. మహా భావ సమాధి అనగా అన్ని చోట్ల తన ఉపాసనామూర్తిని గాంచకల్గునది.
ఒకసారి సింగరిదాసు పెన్నను దాటుచున్నాడు. రామనామము స్మరించుచు, తంబూర చిరతలతో నదిని దాటుచున్నాడు. ఆ సమయమున నది పొంగినది. అయన నామ భజన చేయుచునే ఉన్నాడు.
నది పొంగుచున్నది గాని, చేతనున్న చిరుతలు, తంబూర, పైగుడ్డ ఆ నదీ ప్రవాహములో కొట్టుకొనిపోయినవని ఆయనకు తెలియదు.
అది రాత్రి సమయం. పెన్నకు అటు ఇటు ఉన్న జాలరులకు ఆ అర్ధరాత్రి నది నుండి రామనామము వినబడుచుండగా, వారు దివిటీలతో పడవ నడుపుతూ, రామనామము వచ్చు దిశగా పోయినారు.
ఎప్పుడును వారికి (ఆ జాలరులకు) కనిపించని ఇసుక దిబ్బ కనిపించింది. దానిపై సింగరిదాసు మైమరచి భజన చేయుట చూచి, ఆయనను తమ పడవలోనికి ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చిరి.
విష్ణు పాదముల జనించిన గంగ, రామ భక్తునికి హానిచేయ సాహసించునా! సురక్షితముగా ఒడ్డుకు చేర్చినది.
ఒకసారి అయన తిరుమలలోని గోగర్భ గుహయందు తపమాచరించసాగాడు. అప్పుడు ఒక కౌపీనధారి వచ్చి “ఇప్పటి నుండి నీవు కోరినప్పుడల్లా రామ సాక్షాత్కారము కాగలదు” అని చెప్పి అంతర్దానమయ్యాడు.
రామ దర్శనమే కాదు, సర్వమూ రామమయమే ఆయనకు. ఈయన అనేక భజన గోష్టులను నిర్వహించారు.
శ్రీ భద్రాద్రి రామదాసు చరిత్రను రచించి, శ్రీరామున కర్పించినాడాయన. “ఇప్పుడు అమలులో ఉన్న రామదాసు చరిత్ర ఇదియే” అంటారు ఆయన జీవిత చరిత్రను రచించిన శ్రీ పంగులూరి వీరరాఘవుడు 1957వ సంIIలో.
ఒకసారి “కస్తూరి తిలకం లలాట ఫలకే…” అనే శ్లోకం విని సమాధిలోనికి పోయాడు.
మరొకసారి రామేశ్వరమున రామేశ్వరుని సేవించుచున్నప్పుడు సమాధి స్థితిలోనికి పోయాడు.
సింగరిదాసుగారు జన్మించినది జ్యేష్ట శుద్ధ ఏకాదశినాడు (1840). రామునిలో ఐక్యమైంది. జ్యేష్ట శుద్ధ పంచమినాడు (6. 6. 1916).
నేడు జూన్ 6, సింగరిదాసుగారి వర్థంతి. ఆయనను స్మరించెదము, రామనామము స్మరించెదము.
శ్రీరామ జయరామ జయ జయరామ.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
- వచ్చినవాడు రాముడు …. మహనీయులు – 2020… జూన్ 11
- గంగార్పణం …. మహనీయులు – 2020… మార్చి 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments