Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
గుడిదిబాబా అంటే చాలామందికి తెలియదు. అసలు అయన ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టాడో కూడా తెలియదు.
అయన ఎప్పుడు ఒక బొంతను కప్పుకుని తిరిగేవాడు. ఆ బొంత రకరకాల గుడ్డలతో కుట్టబడి ఉండేది.
అయనవద్ద వెదురు శంఖం ఉండేది. అది ఆయనకు సంగీత పనిముట్టు. పాలు నీళ్ళు అందులో పోయించుకుని త్రాగేవాడు.
పిల్ ఖువా (|Pilkuhuva)లో ఎక్కువగా కనిపించేవారు. కృష్ణ భక్తిని, అద్వైతాన్ని చెప్పేవాడు.
ఆయనను పరీక్షించేందుకు కూడా వచ్చేవారు కొందరు.
ఒక రోజు ఒకరు గ్లాసుడు పాలనిచ్చారు. అందరూ చూస్తుండగా వెదురు శంఖంలో పోశారు. అందరూ వెదురు శంఖం చూచారు. పాలు లేవు. ద్రాక్ష పండ్లున్నాయి.
అందరూ అది కనికట్టు అనుకోకుండా, ద్రాక్షపండ్లను అందరకూ ఇచ్చారు తినమని. అందరూ తిన్నారు. అది కనికట్టు కాదు.
ఖాళీ గ్లాసును ఐదుసార్లు గల గల లాడించారు. అయిదు రూపాయి బిళ్ళలు వచ్చాయి. “అవి తీసుకో నా పాల ఖరీదు” అన్నారు అయన.
సాయిబాబా నీటిని నూనెగా మార్చటం, తన తపశ్శక్తిని చూపటానికి కాదు. దైవంపై దృష్టిని మరల్చటానికే:
కొందరు వచ్చి మీ మహిమలు చూపమన్నారు. “మహిమలు చూపే శక్తి నాకెక్కడిది?” అన్నారాయన. వచ్చినవారు మొండి పట్టుపట్టారు.
“మీకు ఏమి కావాలి?” అని అడిగారు ఆ వచ్చిన వారిలో ఒకరిని. “కాందహారు దానిమ్మ పండు” అన్నాడు అతను.
అది దానిమ్మ పండ్లు పండే ఋతువు కాదు. గుడిదిబాబా చేతులు పైకెత్తి ప్రార్ధించారు దైవాన్ని. దానిమ్మ పండు రాలింది చేతులలో.
అందరకూ కోసి ముక్కలు పెట్టారు దానిని. కమ్మగా ఉంది. ఇది దైవ శక్తి.
తనను మీరట్ తీసుకుపొమ్మన్నారు. కారులో ప్రయాణం చేస్తున్న గుడిదిబాబా “ఈ శరీరం శిధిలమైంది. ఈ శరీరాన్ని వదిలేయాలి” అన్నారు.
తన శరీరాన్ని గంగపాలు చేయమని చెప్పి కన్నుమూశారు. ఆ దినం 6 మార్చి, 1951.
అప్పుడు అయన భక్తులు ఆయన దేహాన్ని గంగార్పణం చేశారు, దగ్గరలో నున్న ఘర్ ముక్తేశ్వర్ లో.
అందరి దృష్టిని ఆ భగవానునిపై త్రిప్పటమే ఆయన ధ్యేయం.
తనదంటూ ఈ లోకానికి ఏమి మిగల్చకుండా, చివరకు దేహాన్ని కూడా, బోధలనే మిగిల్చి వెళ్ళిపోయారు గుడిది బాబా.
నేడు మార్చి 6. గుడిది బాబా సమాధి దినం.
ఆయనకు నమస్కరించి తరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రేయో మార్గము…. మహనీయులు – 2020… జూన్ 20
- పిచ్చి సన్నాసి! …. మహనీయులు – 2020… మార్చి 5
- గులాబీ పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 9
- దేహమే దేవాలయం …. మహనీయులు – 2020… మార్చి 10
- గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments