నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా మహాసమాధి చెందగానే ఇరువర్గాలకు కొంచెం ఘర్షణ జరిగింది.

సహజానందులవారి జన్మ నామం  కోటిరెడ్డి.

కోటిరెడ్డి సరిగ్గా చదువుకొనుట లేదని ఆయన సోదరులు పశువులను మేపే పనిని అప్పగించారు.

కోటిరెడ్డి పొలం గట్లపై ఏకాంతంగా ఆకాశం వైపు చూస్తూండేవాడు. పశువులు చేనులలో మేసేవి. పిట్టలు కంకులు తినిపోయేవి.

దారిన పోయేవారు కూడా కంకులు కోసుకుపోతున్నా, కోటిరెడ్డి ఏమీ అనేవాడు కాదు.

ఒకసారి అయన హిమాలయాలకు పోయి 18 ఏండ్లు తపస్సు చేసి ఇంటికి వచ్చాడు. వ్యాసాశ్రమం, శుకబ్రహ్మాశ్రమాలలో కొంతకాలం ఉన్నాడాయన.

ఒకనాడు ఆయనను “స్వామీ మీరేమి బోధించరేమి?” అని ప్రశ్నించారు. “ఆ పని మీరు చేస్తున్నారు గదా. ఆత్మానందంలో నాకు అన్నీ ఉన్నాయి” అన్నారాయన.

ఇక కోటిరెడ్డి సహజానందుడని పేరు తెచ్చుకున్నాడు.

ఒక పండుగనాడు స్వామికి కొత్త పంచె, లాల్చి ధరింపచేశారు భక్తులు. ఎవరి సంతోషం వారిది కదా! కాసేపాగి స్వామి వీధిలోకి పోయి, ఎప్పటి వలె అడ్డపంచె, అంగ వస్తంతో తిరిగి వచ్చారు.  “స్వామి కొత్త బట్టలేమైనాయి?” అని ఎవరో ప్రశ్నిస్తే,

“ఒక నారాయణ ఇవ్వగా మరొక నారాయణునికి ఇచ్చాను” అన్నారాయన. అసలు ఇచ్చేది ఎవరు? పుచ్చుకునేది ఎవరు?

ఆయనకు జగమే నారాయణ. ఎవరో ఒకరు అయన ఊరు, పేరు అడిగితె “ఏ పేరుతొ పిలిచినా పలుకుతాను నారాయణ.

వెనక నారాయణుడు, ముందు నారాయణుడు, లోన నారాయణుడు. పైన నారాయణుడు, ప్రక్కన నారాయణుడు. చుట్టూ నారాయణుడు. ఇక పో! కింకరిష్యతి వైయమః నారాయణుడు కవచం నాయనా” అన్నారు.

ఒకసారి సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ కూడా, ఏకనాథ విరచిత అభంగాన్ని షిరిడీలో వింటాడు.

“రామ బినా కభుమాన తనాహి, అందర్ రామా, బాహర్ రామా, సపనే మే దేఖత సీతారామా, జాగత రామా పోవతరామా జహ దేఖే వాహ పూరన కామా; జగమే రామమయం”.

సహజానందులు వడ్డించిన పదార్దాలన్ని ఒకే ముద్దగా చేసి, మూడు ముద్దలారగించే వారు.

సీతామహాలక్ష్మిగారు లలితా పూజ చేసేవారు. సహజానందులు “ఇక చాలు అమ్మా! ఎన్నాళ్ళు చేస్తావు పూజ?” అని అడిగారు. ఇలాగే అయన ప్రతి రోజు అడిగేవారు.

 సీతామహాలక్ష్మి గారు “పూజ మానమంటారా?” అని ప్రశ్నించారు స్వామిని.

“ఒకటో తరగతి ఎన్నాళ్ళు చదువుతావమ్మా? పై తరగతికి వెళ్ళాలి” అన్నారాయన.

అందరిని  ఆధ్యాత్మిక పథంలో పయనింపచేసే ప్రయత్నించిన సహజానందులు 30 జూన్ 1993లో భౌతిక దేహాన్ని విడిచారు.

స్వామి మందిరానికి వచ్చే ఆదాయాన్ని చూచిన అయన భార్యా, పిల్లలు, భక్తులు, శ్రేయోభిలాషులు, మే మే హక్కుదారులం అనసాగారు. చివరకు ప్రభుత్వ కైవసం చేసుకుంది.

నేడు జూన్ 30. మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడమని సహజానందులను ప్రార్థిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles