భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బండువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు.

భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి :

“నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, వేయి క్రోసుల దూరములో ఉన్నప్పటికీ  పిచ్చుక  కాళ్ళికి దారముకట్టి యిడ్చునట్లు అతనిని షిరిడి కి లాగెదను” అని బాబా చెప్పారు కదా! అదే విధముగా నన్ను బాబా తన చెంత చేర్చుకున్నారు:

నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు నా స్నేహితుడు సుజీత్ ఒకరోజు నన్ను బాబా మందిరానికి రమ్మని పిలిచాడు. నాకు బాబా గురించి అసలు ఏమి తెలియదు.

ఆ సమయంలో సత్య సాయి గురించి కొన్ని వదంతులు వినడము వలన నాకు బాబాలను నమ్మకూడదు అనే అభిప్రాయం ఉండటము వలన నేను రాను అని చెప్పను.

అతడు బలవంతపెట్టాడు రమ్మని, అటువంటి బాబాలను నమ్మను నేను రాను అన్నాను. అతడు కేవలం నా కోసం రా అంటే స్నేహితుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని తనతో పాటు వెళ్ళాను.

అదే నా మొదటి బాబా దర్శనం. ఏమి జరిగిందో చెప్పలేనుగాని చాలా సంతోషమనిపించింది. బాబా ఏమి మాయ చేసారో నాకు తెలియదు కానీ అప్పటినుండి నేను ఎవరి తోడు లేకపోయినా బాబా గుడికి వెళ్ళటము అలవాటైపోయింది.

రోజు సంధ్య హరతికి వెళ్ళటం, వీలైనప్పుడు మధ్యాహ్న హరతికి, శేజ హరతికి వెళ్తూ ఉండేవాడిని. గురువారం సంధ్య హారతి నుండి భజన, శేజ హారతి వరకు ఉండేవాడిని. అంతలా బాబా నన్ను మొదటి దర్శనముతోనే తన వైపు లాగుకున్నారు.

ఒకసారి భజనలో “నువ్వు లేక ఆనాధలం” పాట ఎవరో పాడుతువుంటే నాలో నాకేమి జరుగుతుందో తెలియనంత తన్మయత్వము కలిగింది.

సాయికి శరణాగతి:

నా ఎడ్యుకేషన్ పూర్తై 5 సంవత్సరాలు గడిచిన ఉద్యోగం రాలేదు. ఒక ఉద్యోగం వచ్చి 3 నెలలు చేశాను.

కానీ అక్కడ కూడా సరైన పరిస్తితిలేక బాబా అనుమతితో హైదరాబాద్ వచ్చాను. అక్కడ హాస్టల్ లో ఉంటూ సాఫ్ట్ వేర్ నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేశాను.

కొన్ని ఇంటర్వ్యూలు జరిగి చివరి స్టేజిలో పోయాయి. దానితో నిరాశకు లోనైనాను. ఏ దేవుడుకు మొక్కిన లాభం లేకుండా పోయింది. శాంతి పూజ కూడా చేయించాము.

అంతకుముందు నేను ప్రతి గురువారం రాత్రి వరకు ఆహారం, నీళ్ళు తీసుకోకుండా ఉపవాసం ఉండేవాడిని, నా ఫ్రెండ్ బాబాకి ఉపవాసం ఉంటే నచ్చాదని చెప్పిన బాబా గురించి తెలియక ఉపవాసం ఉండేవాడిని.

ఈ పరిస్తితులలో ఉపవాసం ఉండటం మానేసాను. నా భక్తీ సన్నగిల్లుతుంది. అటువంటి సమయములో మళ్ళి బాబా చేజారిపోకుండా నా చేయి గట్టిగా పట్టుకున్నారు.

ఒకరోజు రాత్రి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ముసేసాక అందరు వెళ్ళిపోయారు.

నేను చక్రి అనే అబ్బాయి మాట్లాడుకుంటున్నాము. అప్పటివరకు మా ఇద్దరి మద్య ఉన్నది కేవలము మామూలు పరిచయమే. మాటల సందర్బంలో నేను నా భాదను చెప్పను.

అప్పుడు అతడు “షిర్డీ సాయి అనుగ్రహ రహస్యం” అనే పుస్తకము చదవమని, చాలా బాగుంటుందని, ప్రశాంతత చేకురుతుతుంనదని చెప్పాడు.

ఆ మాటలు మంత్రములా పనిచేసి వెంటనే ఆ పుస్తకము కావాలని, చదువుతానని అన్నాను. మరుసటి రోజు ఇద్దరమూ వెళ్లి ఆ పుస్తకం కొని తెచ్చి, మరుసటి గురువారం పారాయణ ప్రారంభించాను.

నేను అంతకుముండు బాబాకు సంబందించిన సంక్షిప్త సాయి చరిత్ర ఒకటే చదివాను. అందువలన నాకు బాబా గురించి అంతగా తెలియలేదు.

ఎందరో దేవుళ్ళ మద్య బాబా కూడా ఒక దైవం అంతే. పారాయణ ప్రారభించినది మొదలు మనస్సుకు ఎంతో ప్రశాంతముగా ఉండేది. వారం రోజుల్లో పూర్తీ చేశాను.

అప్పుడు తెలిసింది అసలు సాయి అంటే ఏమిటో, సాయి ఎక్కడ ఉన్నాడో.సాయి అంటే ఆత్మ స్వరూపమని, సాయి అంతటా నిండి ఉన్నాడని, అందరి హృదయాలలో కొలువుతీరి ఉన్నాడని, సాయి ఎందరో దేవుళ్లలో ఒకరు కాదని, సాయే సర్వ దేవత స్వరూపమని, సాయి లోనే సకల దేవతలు ఉన్నారని, సమాధి చెందినా సజీవముగా ఉన్న సద్గురువని, పిలిచిన వెంటనే పలికే పరమ ప్రేమ స్వరూపుడని అర్థమయింది.

సాయి పై పూర్ణ విశ్వాసం కుదిరింది. ఉపవాసం ఉండి బాబాకి యెంత భాధ కలిగించానో అర్థమైంది. ఉద్యోగం లేక నేను భాధ పడుతువుంటే, బాబా నాపై ప్రేమ లేక, కరుణలేక అలా మౌనంగా ఉండలేడని, పూర్వ కర్మ దృష్ట్యా నా శ్రేయస్సు కోసమే అలా చేస్తున్నారని ఆర్థం చేసుకున్నాను.

ఏ కష్టం వచ్చిన, నష్టం వచ్చిన సాయి ని విడవరాదని, ఏదైనా సాయి ని తప్ప ఇంకేవారిని అడుగరాదని నిర్ణయించుకున్నాను. ఒకే ఒక్క పారాయణ తో బాబా అంత చక్కటి అవగాహననిచ్చారు. అప్పటినుంచి మొదలైంది నా ఆధ్యాత్మిక జీవితము.

రోజు సాయి కి సంబందించిన పుస్తకాలు చదవటము, చక్రి, నేను ఇన్స్టిట్యూట్ లో, బాబా గుడిలో, బస్సు స్టాప్ లో కూర్చొని బాబా లీలల గురించి చర్చించుకుంటూ ఉండే వాళ్ళము.

అలా బాబా మీదనే ఉండేది మనసంతా.. చక్రితో మూమూలు పరిచయము బెస్ట్ ఫ్రెండ్ షిప్ గా మారింది. బాబా నే సరైన సమయంలో చక్రి రూపంలో వచ్చి నన్ను దారి తప్పకుండ కాపాడారు.

అలా సాయి నన్ను తన వాడిని చేసుకున్నందుకు సాయి కి నా వందనములు. నా సద్గురు సాయి కి చేరువ చేసిన నా ఇద్దరు స్నేహితుల ఋణం జన్మజన్మలకి తీర్చుకోలేను.

ఎందరో స్నేహితులు ఉంటారు గాని గురువుకు చేరువచేసే  స్నేహితులకు ఉండటం చాలా గొప్ప విషయము. అటువంటి నా ఇద్దరి స్నేహితులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు మాత్రమే చెప్పుకోగలను.

“సత్యనికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి కూడా దూరమే” అని సాయి చెప్పారు.

బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యమెందుకు అవసరమవుతుంది.

ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళిన అందరు అనుభవమే అడుగుతారు అది అబద్ధపు పత్రలతో అనుభవమైన పర్వాలేదు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మరి ముఖ్యంగా అవసరం. అందుకే నా ఉద్యోగ విషయం బాబాకే వదిలివేశాను. ఆయనకు తెలుసు నాకేది శ్రేయస్సకరమో..

రేపు బాబావారు నాకు ప్రసాదించిన మరికొన్ని లీలలతో కలుసుకుందాం

సాయి సురేష్,
శ్రీకాకుళం.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles