దొంగల బారినుండి తన భక్తుని, బాబా కాపాడిన లీల–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-32 దొంగల బారినుండి తన భక్తుని, బాబా కాపాడిన లీల 7:24

నేను 20 th June 1980  ఉత్తరప్రదేశ్ లో వున్న మోనపురి జిల్లాలో  పుట్టాను. హైస్కూల్ చదువు అంతా మా ఊరిలోనే పూర్తిచేశాను.inter and graduation ఆగ్రా లో చదివాను.

ఇంకా చదువుకోవాలని లేదు నాకు. అయినా ఒక సంవత్సరము ఆగ్రా లోనే ఒక company లో ఉద్యోగం చేశాను. అక్కడ మంచి అవకాశాలు లేని కారణాన మా వూరు వచ్చేశాను. మా నాన్న గారికి సహాయంగా ఆయన పనిలో వుండిపోదామని 2003 ఫిబ్రవరి లో వచ్చేశాను. 2004 నాకు పెండ్లి కూడా అయింది.

నాన్నకు వ్యాపారంలో సహాయం చేస్తూ 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాని మనసులో చాలా దండిగా డబ్బు సంపాదించాలని వుండేది. పెద్ద వ్యాపారం చేయాలని ఇంట్లో వాళ్ళు వద్దు అన్న వినకుండా బరేలీ వచ్చేశాను.

అక్కడ మా బాబాయి అనిల్ శర్మ వున్నారు. అక్కడ వుండి మంచి వ్యాపారం మొదలుపెట్టాను. కాని అది అంత బాగా నడవనందున మళ్ళీ మా వూరు వెనక్కు రావలసి వచ్చింది.

బరేలి వెళ్ళి వ్యాపారం చేయడం అంత వ్యర్థమైంది ఉన్నది కూడా పోయింది. కాని నాకు బరేలీలో ఎలాంటి సంపద దొరికిందంటె వర్ణించడం నా తరం కాదు. అదే సాయినాథుని సంపద.

నేను ఆయన పేరు విన్నా కాని ఎప్పుడు ఆయనను కాని , మందిరం కాని చూడలేదు. మా బాబాయ్ సాయినాథునికి పరమ భక్తుడు అవ్వడం ద్వారా ఆయన ద్వారా బాబా గురించి పూర్తిగా విన్నాను. ఆయన మందిరానికి మొదటి సారి వెళ్ళినప్పుడే నేను నాతమస్తకం అయ్యాను.

ఆయన ముందర ఆయన పాటలు,భజనలు, నామసంకీర్తనలు చేసేవాడిని. అందరూ నన్ను పిచ్చివాడు అనేవాళ్ళు. కాని మా బావగారు శ్రీ శైలేంద్ర భరద్వాజ, ఆయన కూడా బాబాకు పరమ భక్తుడు, ఆయనే అనేవాడు నీ భక్తిలో చాలా శక్తి వుండి. నీవు అంతరాత్మతో బాబాను పిలుస్తున్నావు అనేవాడు.

నేను బాబా స్మరణతో కొత్త వ్యాపారం మొదలుపెట్టాను. అది ఎంత అభివృద్ధి చెందినది అంటే చెప్పలేను. నేను 14 March 2009 లో ,  నా కుటుంబసమేతంగా మొదటి సారి శిరిడీ వెళ్ళాము. రెండవ సారి ఆగస్టు 2011 నా Friends అందరినీ తీసుకెళ్ళాను.అప్పటి నుంచి సంవత్సరానికి రెండు సార్లు శిరిడీ వెళ్తాను. నాతొ పాటు ఇంకో కొత్త భక్తుడిని తీసుకెళ్తాను.

మా బావగారు మైనాపూర్ లో సంపన్న వ్యాపారవేత్తగా వుండేవారు. ఆయన 2010 లో 20 మంది వ్యాపార స్నేహితులను శిరిడీ తీసుకెల్లాలని అనుకున్నారు. వాళ్లందరికీ వుండటానికి, తిండి అన్నీ నన్నే చూసుకోమన్నారు.

వాళ్ళందరిని దర్శనం చేయించే దగ్గర నుంచి అన్ని పనులు నాకే చెప్పారు. ముందు నేను చేయలేను అన్నాను. అప్పుడు మా బావగారు “నువ్వు ఎవరు చేయడానికి, అన్నీ బాబానే చేస్తారు. నువ్వు only మద్యస్తుడిగా వుంటావు.” అన్నాడు.

ఆ మాటలు వినేసరికి నాలో ఎక్కడలేని శక్తి వచ్చేసింది. అలా బాబా పని చేయడం అంటె పూర్వజన్మ సుకృతం. అలా 20 మందిమి శిరిడీ వెళ్ళి వచ్చాము. అందరి మనసులు ఆనందముతో నిండిపోయాయి.

ఈవిధంగా Rooms, భోజనాలు అన్నీ నేనే చూసేవాడిని. ఇలా ప్రతి సంవత్సరం సాయి భక్తులకు సేవచేసి నేను చాలా ఆనందపడేవాడిని. ఇప్పుడు గమనించాను నాకు ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరిక మెల్లగా కరిగిపోయింది.

సాయి సేవయే సర్వ శ్రేష్టం, సర్వానందం అనిపించింది. ఇంక నేను రెండోసారి శిరిడీ వెళ్ళినప్పుడు నా భార్య గర్భవతిగా వుండినది. నాకు కొడుకు పుట్టాలని బాబాను ప్రార్ధించాను.

ultra-sand scanning చేస్తే కవలలు వున్నారని తెలిసింది.Delivery date జనవరి 15 ఇచ్చారు. నేను బాబాను ప్రార్ధించాను, బాబా జనవరి 1st తారీఖున పిల్లలు పుట్టాలని, బాబా Last కు ఆకోరిక కూడా తీర్చాడు.

నేను December 31st కొత్త కారు కొందామని ఆగ్రా వెళ్ళాను. January 1st పొద్దున్న నా భార్యకు ప్రసవం నొప్పులు వచ్చాయి. వెంటనే return వచ్చేసాను. January 1st సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు కొడుకులే పుట్టారు. వాళ్ళకు నేను లవ,కుశ అని పేరు పెట్టాను.

జూన్ 2010 నేను బాబా 9 గురువారాల వ్రతం ఆరంభించాను. 1st గురురువారం నేను బాబాకు పాలతో అభిషేకం చేశాను. కాని పూజ తరువాత పాలు తాగడం మర్చిపోయినాను. సాయంత్రం గుర్తు వచ్చింది. ఇంత ఎండలో పాడైపోయివుంటాయి అనుకున్నాం కాని ఆశ్చర్యం అస్సలు ఏమి కాలేదు fresh గా వున్నాయి.

బాబా లీల అనేకసార్లు నేను అనుభవించాను. ఇప్పుడు చెప్పబోయేది బాబా మీద నా నమ్మకం అనంతకోటి సార్లు పెరిగింది.వినండి.

ఒకసారి నేను నా స్నేఘితుడు అంకుర్ బైక్ లో మా వూరికి return వస్తున్నాము. అంకుర్ బైక్ నడుపుతున్నాడు, మాతో పాటు ఇంకో బైకులో నలుగురు దొంగలు మమ్మల్ని వెంబడించారు.

వాళ్ళు ‘ఆగండి’ అని తుపాకి గురిపెట్టారు. నేను అంకుర్ తో అన్నా ‘Bike speed గా నడుపు దొంగలు వెనకాలవున్నారు’ అన్నాను. అంకుర్ speed పెంచాడు.

ఆ దొంగలు ఇంక మేము ఆగమని తుపాకీ నా వైపు చూపి పేల్చాడు. నేను sudden గా “సాయి బాబా రక్ష కరో ప్రభో” అని గట్టిగా అరిచాను.

నేను అనుకున్న మా పని అయిపోయిందని, కాని మాకు ఏమి కాలేదు. అది local తుపాకీ ఒకేసారి 4 గుండ్లు పేలుతాయి. అవి ఎటు మాయమైపోయినాయో బాబాకే తెలియాలి.

ఈ విధంగా నా జీవితం అంతా బాబా మాయం అయిపోయింది. ఆయన దీనజనరక్షకుడు, సర్వం సహాచక్రవర్తి, ఆపద్బాందవుడు. మమ్మల్ని ఒక్క క్షణం కూడా విడవకుండా వెన్నంటి కాపాడే కలియుగ దైవం ఆ సాయినాథుడు.

సర్వం సాయినాథార్పణమస్తు.

అతుల్ భరద్వాజ్,
ఆగ్రా.

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

21 comments on “దొంగల బారినుండి తన భక్తుని, బాబా కాపాడిన లీల–Audio

soundarya

Aum sai ram!

Gooi

Nice
Special thanks ti MADHAVI garu

Dillip

Madam.. Wonderful..Sai leela..

Somya

B,coz of u we came to know so many baba Leela’s.mam..Jai sai ram.

Kajal

Mam.we r happy to listen saileelas..We r also blessed..Sai ram.

subhalaxmi

Every day u r explaining how sai baba is helping his devoties.thank u mam..Sai ram.

Radha

Chalaa baagundhi.elaa roju memu sai charitra chaduvutunnanu.god bless u..Madhavi.

Gaurav

Excellent job u r doing..Mom..Throughout night u r doing.this work..Sai ram.

Yaswanth

Chalaa baagundhi..Sai ram.

Gautam

Very kind guru our sainaath.Madhu..

Jayanth

Very kind saileela..Jai sai ram.

Sambit

Jai sai ram..

Sudip

Very beautiful miracle.mam..Jai sai ram

Gourahari

Mam..Gud work is going ..Jai sai ram.

Maruthi Sainathuni

Baba vaari leelalu chaduvuthunte happy gaa vundi.Thank u Madhavi mam and Sreenivas Murthy Garu.Sai Baba…Sai Baba

T.v.pramada

Sri Sai ram

T.V.Gayathri

Om Sai Ram. Sarvam Sai Ram

Radhika J

Om Sairam Jai Jai Sairam

b vishnu Sai

Chaala baagundi
Om sai ram

Vidya

Reading each of these Leela’s everyday
Is making me feel that I am readin Sai charitra .. every miracle is amazing 🙂 thanks for sharing pinnama

Kumar

Good to hear

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles