తన కన్నునిచ్చి పాప కన్నును కాపాడిన సాయి గణేష్–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు ఈ సంవత్సరం వినాయక చవితి మరుసటిరోజు తమ ఇంటిలో బాబావారు చూపించిన అద్భుతమైన లీలను పంపించారు.

బాబావారు చూపించిన చమత్కారాలని జరిగిన వెంటనే మన సాయి భక్తులందరం పంచుకుంటే ఆయన మీద మనకున్న భక్తి మరింతగా పెంపొందుతుంది.

బాబావారు వినాయకుని రూపంలో నా పాపను కాపాడారు. ఆరోజు05.09.2016 సోమవారం, వినాయక చవితి. ఎప్పటిలాగే అందరం చక్కగా వినాయకుని పూజించుకొన్నాము.

తరువాతి రోజు మంగళవారం కావడంవల్ల అదేరోజు సాయంత్రం వినాయక ప్రతిమను నిమజ్జనం చేయాలనుకున్నాను. కాని మావారు మూడు రోజులు వుంచిన తరువాత నిమజ్జనం చేద్దామన్నారు.

నేను మా చిన్నపాపతో పూజ సరిగా చేయలేనేమో అనుకున్నాను.  ప్రతి సంవత్సరంమావారు, ఆయన స్నేహితులతో కలిసి నిమజ్జనం చేస్తూ ఉంటారు.

ప్రతిసంవత్సరం మావారి స్నేహితులు తమతమ విగ్రహాలని నిమజ్జనం చేయడానికి వెళ్ళేముందు మావారిని మావిగ్రహాన్నికూడా నిమజ్జనం చేయమని రమ్మని పిలుస్తూ ఉంటారు.

కాని ఈ సంవత్సరం మావారి స్నేహితులు అదేరోజు అనగా సోమవారమే తమ తమ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వెళ్ళారు కాని మావారిని రమ్మని పిలవడం మర్చిపోయారు.

ఇంతలో నేను మాయింటి బయట ఉన్నఐరన్ షాపుకు వెళ్ళాను. ఆషాపులో ఉన్నామె “మీరు ఈసారి వినాయకుని ప్రతిమను మీవారి స్నేహితులతో కలిసి నిమజ్జనం చేయడానికి వెళ్ళలేదా? మీవారి స్నేహితులు ఇప్పుడే వెళ్ళారు”అని అంది. ఒకవేళ మాతో చెప్పడం మర్చిపోయారేమో అన్నాను.

అప్పుడామె “ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో అంతా ఆయన నిర్ణయం. వెళ్ళిపొమ్మన్నంత మాత్రాన ఆయన వెళ్ళిపోరు,రమ్మన్నంత మాత్రాన ఆయన వచ్చేయరు” అని అంది.

నేను కూడా“అవును అంతా ఆదైవనిర్ణయమే” అన్నాను.  మరుసటిరోజు మంగళవారం సాయంత్రం వినాయకునికి నైవేద్యం కోసం ప్రసాదం తయారుచేసాను.

వినాయకుని ముందు దీపం వెలిగించి అగరువత్తులు వెలిగించాను. ఇంటిలో నేను, మాచిన్న పాప మాత్రమే ఉన్నాము మాపాప నాదగ్గరే బంతితో ఆడుకొంటూ ఉంది.

సహస్రనామాలు చదువుదామని నేను పుస్తకం తీస్తున్నాను. ఇంతలో మాపాప కూర్చున్నచోట నుండి లేచి అగరువత్తి స్టాండు వద్ద పడ్డ బంతిని తీసుకోవడానికి వంగింది.

నేను ఆవిషయంగమనించలేదు. పాప బంతి తీసుకోవడానికి కిందకి వంగడంతో వెలుగుతూ ఉన్న అగరువత్తి పాప ఎడమకంటికి తగిలింది.

అసలు ఆరోజు మధ్యాహ్నం నుండి బాబాని “బాబా నా కుడికన్ను అదురుతోంది. ఎటువంటి చెడుజరగకుండా చూసే భారం మీదే” అని ప్రార్ధించుకున్నాను.

పాప కంటికి ఏమయిందోనని చాలా భయం వేసింది. ముందుగా కంటినిశుభ్రంగా చల్లని నీటితో కడిగాను.

కుడికన్ను చేతితో మూసి పాపకి బిస్కట్ ఇచ్చి “అమ్మనోటిలో పెట్టు” అన్నాను. పాప నానోటిలోబిస్కట్ పెట్టగానె “అమ్మయ్య, పాప కంటికి ఏమీ జరగలేదని ఊపిరిపీల్చుకున్నాను.

వెంటనే బాబా పటంవద్దకువెళ్ళి నమస్కరించుకున్నాను. పాపకి ఎడమకన్ను క్రిందమాత్రమే అగరువత్తి కాలడంవల్ల చిన్నగా గాయమయింది.

పాప కంటిలో అగరువత్తు గుచ్చుకున్నా, లేక బూడిద పడ్డా కంటికి ఏమయి ఉండేదో తలచుకుంటేనే భయం వేసింది.

బాబాగారు మాకు కాబోయే కొండంత బాధను గోరంత విధంగా తీర్చేశారు.

ఇక్కడ విచిత్రమయిన విషయం ఏమిటంటే ఎప్పుడయితే మాపాప కంటికి అగరువత్తి తగిలిందో అప్పుడే మా వినాయకుని విగ్రహానికున్న ఎడమకన్ను ఊడి క్రిందపడింది. అది మాపాపనిద్రపోయాక గమనించాను.

ఇక్కడ చెన్నైలో వినాయకుని విగ్రహానికి కండ్లకు గురువింద గింజలు పెడతారు.

పాపకు తగిలిన దెబ్బకూడా ఎడమకంటికే. ఇపుడు అన్నీ ఆలోచించిచూస్తే ఐరన్ షాపులో ఆమె చెప్పినట్లుగా ఆయన మాపాపనుకాపాడటానికే ఈమూడు రోజులు మాఇంటిలో ఉన్నారు.

మీకిప్పుడు ఒక సందేహం రావచ్చును. మొదటిరోజునే నిమజ్జనం చేసేసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని. కాని మాపాపకు ఏదో రూపంలోకంటికి పెద్ద హాని కలగవచ్చు.

బాబా వినాయకుని రూపంలో రాబోయే ఆపదని ఈవిధంగా నివారించారు.

బాబాయే ఆరూపంలోతొలగించారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నాకుకుడికన్ను అదరడం వల్ల ఏవిధమయిన కీడు జరగకుండాకాపాడమని బాబాకు విన్నవించుకున్నాను.

అందువల్లనే ఆయనపెద్ద ఆపదనుండి మాపాపను కాపాడారు. మైనతాయి కధకూడామనందరికీ తెలుసున్నదే కదా.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles