మానవ సేవే, మాధవా సేవ.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిరాం,సాయి బంధువులకు,

నేను మాధవి. భువనేశ్వర్ నుంచి.

ఈ మధ్య కాలం లో నాకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని రాస్తున్నాను.” సేవ” ..అంటే ఏమిటి? అని ఎవరన్నా అడిగితే సాధారణంగా మనం ఏమి చెప్తాము? కొందరు అన్నదానం అంటారు, కొందరు బాబాకు గుడి కట్టిచాము అంటారు, ఇలా ఒక్కొకళ్ళు ఒక్కోరకంగా అంటారు.

కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ ను మీరే అర్థం చేసుకోండి.. భగవంతుడే భక్తునికి సేవ చేస్తాడు, అంటే ఆశ్చర్యంగా ఉంది కదా!

ఏవో పాత కథల్లో మనం చదివే ఉంటాము. కానీ ఇప్పుడు కూడా అలాంటి నిజాలు జరుగుతున్నాయని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఇంక అసలు కథకు వస్తాను.

ఈ మధ్యకాలం లో నా జీవితం అస్తవ్యస్తం అయింది మా వారికి paralisys వచ్చింది.

అంతే, లైఫ్ స్తంభించి పోయింది. ఆయనకు మంచి ఫీషియోథెరపీ ఇప్పించాలని నేను బరంపురం అనే ఊరికి వెళ్ళాను.

అక్కడ ఒక ఆయన వున్నాడు. చాలా బాగా ఫీషియోథెరపీ చేస్తాడు, acupressure, కూడా చేస్తాడు.

అందుకని, మా వారు త్వరగా బాగా అవుతారు అనే ఉదేశ్యం తో వెళ్ళాను. ఆయనను కలిశాను. ఆయన మేము వెళ్లిన రోజే సాయంత్రం రెండున్నర గంట లో మావారికి నడిపించారు.

నాకు చాలా, చాలా ఆశ్చర్యం వేసింది. రెండు నెలలలో కానీ పని, ఆయన రెండు గంటల్లో చేసాడు.

తరువాత రోజు కూడా వెళ్ళాము. అప్పుడు నేను ఒక విషయం గమనించాను. ఆయన ప్రతి కదలికల కు ముందు “సాయి రాం” అంటాడు.

మళ్ళీ నేను ఆశ్చర్య పోయినాను. తరువాత రోజు మా వారితో ” ఓం సాయి రాం”..అని పలికించారు.( మా వారికి మాట కూడా పోయింది).

అప్పుడు నేను ఇంక ఆగలేక “మీరు ప్రతి కదలికకు ముందు సాయిరాం, అనడం నేను గమనించాను, మీరు బాబా భక్తులా” అని అడిగాను.

అంతే, ఆయన చాలా గట్టిగా నవ్వారు. (అక్కడ ఒక్క బాబా ఫోటో కూడా లేదు). అప్పుడు చెప్పారు ఆయన కథ, ఎప్పుడు ఎవ్వరికీ ఇంతవరకు చెప్పలేదంట, నాకే 1st చెప్పారు.

ఏమని అంటే “దగ్గర, దగ్గర పదహైదు సంవత్సరాల కిందట ఆయన దగ్గరికి బాబా నే స్వయంగా వచారంట, వచ్చి, ” నువ్వు రోగులకు సేవ చెయ్యి, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను” అన్నారట.

చూడండి, బాబా దర్శనం కోసం మనం ఎంతో తపించి పోతాము. కానీ బాబా, తన భక్తులు కాకపోయినా, సేవభావం ఉన్నవాళ్లంటే తపించి పోతాడు.

స్వయంగా దివినుంచి భువికి దిగి వస్తాడు.  అది బాబా స్వభావం.

అప్పటి నుంచి ఆయన న్యూరోలజి చదివాడు. శరీరం లో ఉన్న అన్ని నరాల పట్టు ఆయనకు తెలుసు.

అందుకే ఆ రూమ్ లో బాబా అనుభూతి ఉంటుంది ఆయనకు.

సాయిబాబా పెరు తోనే సేవ చేస్తాడు. పైసలు చాలా తక్కువ తీసుకుంటారు. బీదవాళ్ళు అయితే ఫ్రీ గా చేస్తాడు.

7 నుంచి 10..రోజులలో ఎటువంటి జబ్బు అయిన ( నరాలకు సంబంధించినది)..బాగు చేస్తాడు..

నా అదృష్టం అలాంటి వాళ్ళతో మా వారికి వైద్యం చేయించాను.

ఇంతకు ఆయన ఒక స్కూల్ లో టీచర్. డాక్టర్ కాదు. అయిన ఎంతో మంది, విదేశాల నుంచి కూడా వస్తారు.

కానీ ఆయనకు ప్రచారం ఇష్టం లేదు. ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా, బాబా నే పంపినారు..అనుకుంటారు.

అలా ఆయన మానవ సేవ చేస్తూ మాధావుడిని ప్రసన్నం చేసుకున్నారు.

ఇంకా ఎంతమందిని,ఎన్ని రకాలుగా అనుగ్రహిస్తున్నారో?

సర్వం సాయి నాతర్పణమస్థు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles