Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sreenivas Murthy
నా పేరు సత్యసాగర శ్రీనివాసులు. నేను ప్రస్తుతం శిరిడీ లో పింపల్ వాడి రోడ్డులో విజయా బ్యాంక్ లైన్ లో వున్నా ద్వారకామాయి భవన్ లో మేనేజర్ గా పని చేస్తున్నాను.
ఆ ‘ద్వారకామాయి భవన్’ హైదరాబాద్ లో చాదర్ ఘాట్ లో ఉన్న సాయిబాబా గుడి యాజమాన్యం వారిది.
మాది అసలు అనంతపురం దగ్గర ఒక పల్లెటూరు. మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం.
6 రూపాయలు వున్న స్కూల్ ఫీజు కూడా కట్టలేక అక్కడ, ఇక్కడ సంతకాలు పెట్టించుకుని కొందరు పెద్దవారిని బ్రతిమలాడి 3 రూపాయలకి రాయించుకొని ఆ డబ్బు కట్టేవాడిని. ఆ తర్వాత పాలిటెక్నీక్ లో చేరాను.
ఎందుకంటే తొందరగా ఎదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి. నేను ఏ పని చేయటాని కయినా కూడా నా పాలిటెక్నీక్ qualification సరిపోయేది కాదు. అందుకే తీరిగి I.T.I చేశాను. మంచి మార్కుల తో కస్టపడి పాసయ్యాను.
ఆ సమయంలో మద్రాసు వెళ్లి (1972 సంవత్సరంలో) వాహిని స్టూడియో లో పని చేసాను. అయినా నాకు ఎక్కడా సరి అయిన ఉద్యోగాలు దొరకలేదు. ఎక్కడా నిలదొక్కుకో లేక పోయాను.
ఎవరో చెప్పారు ఇక్కడ కంటే మంచి అవకాశాలు హైదరాబాద్ లో వుంటాయి. అక్కడయితే మన చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది అంటే సరేనని హైదరాబాద్ వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాను.
కానీ హైదరాబాద్ వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవు. మద్రాస్ లో మాకు తెలిసిన ఒకాయన పొలిసు గా పని చేస్తున్నారు.
అతను వ్యాన్ లో వెడుతూ శ్రీనివాస్ నేను హైదరాబాద్ వెడుతున్నాను నువ్వు వస్తావా అని అడిగాడు. సరేనని ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాను.
హైదరాబాద్ వచ్చాక ఎలాగో అతికష్టం మీద ఒక Educational Institute అయినటువంటి పనోరమ లో ౩౦౦౦/- రూపాయల ఉద్యోగం దొరికింది.
నాకు కొంచెం knowledge ఉంది అని తెలుసుకొని వేరొక Institute (ముకరంజ)లో పనిచేసే ఒకామె నా దగ్గర సలహాలు తీసుకుంటుండేది.
ఆమె వేరొక ఉద్యోగానికి వెళ్ళిపోతూ నన్ను ఆ పనోరమ నుండి ముకరంజలోకి చేర్పించి వెళ్ళిపోయింది.
అందులో T.A లు D.A లు బాగానే ఇచ్చేవారు. ఆ Institute లో నేను పది సంవత్సరాలు పని చేసాను.
అందులో చేరే సమయానికి నాకు వివాహం అయింది. ఇందులో చేరాక మూడు నెలలకి నేను నా భార్యని తీసుకు వచ్చి లాలాపేట లో 90 రూపాయల అద్దెకి 1978 సంవత్సరంలో కాపురం పెట్టాను.
నేను బస్సు పాస్ తీసుకొని బస్సు లో వెళ్ళి వస్తుండేవాడిని
మా ఆవిడ పగలంతా ఒక్కత్తే వుండి చుట్టూ పక్కల వాళ్ళు సాయిబాబా గుడికి వెడుతూ వెడుతూ తనని కూడా రమ్మంటే తాను బాబా గుడికి వెడుతుండేది.
పారాయణ గ్రంధాలు అక్కడ నుండి తీసుకువచ్చి తానూ చదువుకుంటుండేది. ఎవరో ఒక్క రోజు లో గ్రంధం మొత్తం పారాయణం చేస్తే చాలా మంచిదని, ఇన్ని పర్యాయాలు చెయ్యాలని చెప్పారట.
అందుకని నేను రాత్రి 10 గంటలకు ఇంటికి చేరాక కూడా చదువుతుండేది.
తాను అన్నం వండటానికి లేస్తూ ఇంకా కొంచెం చదివితే అయిపోతుంది. ఈ కాస్త మీరు చదవండి అంటూ నాకు ఆ పుస్తకాన్ని చేతిలో పెట్టేది.
ఉదయం నుండి అలసి పోయి వస్తాను. నాకు ఇలాంటివి పెట్టకు నేను చదవలేను అనేవాణ్ణి.
ఆమె బలవంతంగా ఈ కాస్తే చదివేయండి అనేది. ఇంకా చేసింది లేక బలవంతంగా ఆ గ్రంధం చదివి పూర్తి చేసి పడుకునేవాడిని.
ఆ తర్వాత మా వాళ్ళు నువ్వు లాలాపేట నుండి రావటం మాకు కష్టంగా ఉంది. ఇక్కడే నీకు ఇల్లు చూస్తాము అని మా యాజమాన్యం మాకు దిల్ షుక్ నగర్ లో ఒక ఇల్లు చూసారు.
మేము లాలాపేట నుండి దిల్ షుక్ నగర్ వచ్చేసాము.
లాలాపేట లో ఉన్నప్పుడే ఒక సారి మల్కాజ్ గిరి సాయిబాబా గుడిలో ఉత్సవం జరుగుతుంది. రమ్మనమని మా ఆవిడ నన్ను తీసుకువెళ్ళింది.
అక్కడ అప్పుడు బాబాని మొదటి సారి చూసాను. ఏమిటాయన గొప్పదనం మామూలు మనిషి లాగానే వున్నారుగా అనుకున్నాను.
కానీ నాకెందుకో అక్కడే ఆయన పాదాలు పట్టుకుందాం అనిపించింది. కానీ అంత ఆ జనం లో ఎందుకులే అని ఊరుకున్నాను .
ఆ తర్వాత నాకు శంకర మఠం (నల్లకుంట) లో ఉన్న I.T.I లో ప్రిసిపాల్ గా అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. దిల్ షుక్ నగర్ లో మేమున్న ఇంటి ఓనర్స్ కూడా బాబా భక్తులు,
వాళ్ళు ప్రతి సంవత్సరం షిరిడీకి బాబా దర్శనార్థం వెడుతుండేవారు. వీళ్ళు ప్రతి సంవత్సరం శిరిడీకి వెడుతున్నారు, మనం జీవితంలో ఒక్కసారన్నా శిరిడీ కి వెళ్లగలమా? అని అనుకున్నాను.
మా ఓనర్స్ బాబా పారాయణ ఒక్క రోజులో చేసేవారు. నేను కూడా అలా చేయాలనీ సంకల్పం చేసుకొని ఒక్క రోజులో పారాయణం పూర్తి చేసాను.
ఆ తర్వాత మా ఓనర్స్ గురుపౌర్ణమికి, శ్రీరామనవమికి, దిల్ షుక్ నగర్ గుడిలో బాగా పూజలు చేయించేవారు. ఆ పూజలకి మేము కూడా వెళ్లేవారము.
మా ఓనర్స్ బాగా డబ్బులున్నవారు. బాబా పూజల వల్లే వారికి బాగా ధనం ప్రాప్తి వచ్చింది అది మనం కూడా బాబాకి సేవ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయని సేవ చేసాము.
The above telugu TEXT typed by : Mr. Srinivasa Murthy
Latest Miracles:
- భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట
- గురుబంధువుతో కళ్యాణ బంధం
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- బాబాకి గంధాలంకరణ భాగ్యం
- భక్తులు మరిచిపోయిన బాబా మరవరు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments