Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ బాబాగారిని, యింకా యితర మహాపురుషులను, సాధువులను నిశితంగా గమనించారు. బాబా లో ఉన్న అతీంద్రియ శక్తులను గురించి, బాబావారి కళ్ళలో ఉన్న అధ్బుతమయిన శక్తి మరియు తాననుభవించిన అనుభవాలను తెలియచేస్తున్నారు
రామచంద్ర ఆత్మారాం గారి సోదరుడయిన సదాశివ తార్ఖడ్ గారి భార్య తారాబాయి. రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ గారు బొంబాయిలోని ప్రముఖ ఖటావు మిల్స్ కి సెక్రటరీ. ఒకసారి ఆర్.ఎ. తార్ఖడ్ గారు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నారు.
షిరిడీనుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన శ్రీమతి సదాశివ గార్కి, వారి శ్రీమతి తారాబాయి బాబావారి యొక్క అధ్బుతమైన శక్తులను గురించి చెప్పారు.
ఆసమయంలో తారాబాయి గారి 15 నెలల పాప నళినీ తార్ఖడ్ కి బాగా జబ్బు చేసి ప్రమాదకరమయిన పరిస్థితిలో ఉంది. బాబా శక్తులను గురించి విన్న ఆమె “బాబాయే కనక నిజంగా మహాత్ముడే అయితే తన పాపకు వచ్చిన జబ్బుని వెంటనే నయం చేయగలిగితే పాపతో సహా షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంటానని” వెంటనే బాబాకు మ్రొక్కుకొంది.
విచిత్రంగా పాపకు వెంటనే నయమయి ఆరోగ్యం చేకూరింది. ఆమె వెంటనే తన పాపతో సహా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొంది. ఆపాపే పెరిగి పెద్దదయి తరువాత ప్రముఖ సినీనటి అయింది. ఆమె నళినీ జయవంత్.
రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్, సదాశివ తార్ఖడ్ ల కుటుంబ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ గారు ప్రార్ధనాసమాజ్ కి చెందినవారు. ఆయనకు విగ్రహారాధనలో నమ్మకం లేదు.
వారిది గొప్ప చరిత్ర కలిగిన సంపన్న కుటుంబం. బొంబాయికి 50 కి.మీ.దూరంలో ఉన్న ధానే జిల్లాలోని వాసాయ్ కోటను పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకోవడానికి పీష్వాల తరపున యుద్ధం చేశారు జరిగిన యుధ్ధంలో వారి కుటుంబంలోని 21మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారి ధైర్యానికి గుర్తుగా దగ్గరలోనే ఉన్న తార్ఖడ్ గ్రామాన్ని పీష్వాలు జాగీరుగా బహూకరించారు.
19వ.శతాబ్దం చివరిలో ఆత్మారాం గారి తండ్రి, పినతండ్రి బొంబాయికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. ఆరోజుల్లో వారికి రెండు స్టుడ్ బేకర్ కార్లు ఉండేవి.
అటువంటి కారు ఉండటమంటే సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదాగా పరిగణించేవారు. వారు ఆకార్లలో ఉన్నతాధికారులతోను, బ్రిటిష్ గవర్నర్ లతోను తిరుగుతూ ఉండేవారు. ఆరోజుల్లో ఆత్మారాం తార్ఖడ్ గారికి ఖటావూ మిల్స్ కు సెక్రటరీగా జీతం నెలకు 4,000/- వరకూ వచ్చేది.
ఇటువంటి కుటుంబ నేపధ్యం ఉన్న తార్ఖడ్ కుటుంబం వారికి సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలంటే యిష్టం ఉండేది కాదు. సాధువులను, సన్యాసులను దర్శించడమన్న విగ్రహారాధనన్నా వారికి యిష్టం ఉండేది కాదు.
కాని భార్య తారాబాయి ప్రోద్బలం వల్ల సదాశివ గారు బాబాకు అంకిత భక్తుడయారు.
ఒకసారి తారాబాయి షిరిడీ వెళ్ళారు. అది ఒక చిన్న గ్రామం. అప్పట్లో షిరిడీలో కనీస సౌకర్యాలేమీ లేవు. వీధులన్ని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండేవి.
రాత్రులందు వీధి దీపాలు కూడా లేక చీకటిగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె వీధిలో నడుస్తూ ఉండగా అకారణంగా ఒక్కసారిగా ఆగిపోయింది.
అంత అకస్మాత్తుగా తనెందుకాగిపోయిందో ఖచ్చితంగా ఆమెకే తెలీదు. కొంతసేపటికి ఎవరో దీపం తీసుకొని వచ్చారు.
అప్పుడే ఆమెకు ఎదురుగా ఒక పాము కనపడింది. ఆమె కనక ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే పరిణామం చాలా విపరీతంగా ఉండేది.
తనంత హటాత్తుగా ఎందుకాగిపోయిందో, ఏ ప్రేరణ చేత ఆగిపోయిందో ఆమెకేమాత్రం తెలీదు.
ఎవరు చెపితే వీధిలోకి దీపం తేబడిందో తెలీదు. ఇవన్నీ వివరణకందనివి. ఇదంతా కూడా బాబా మెలకువగా నిరంతరం తన భక్తులను కాపాడుతూ ఉంటారని ఆమె గ్రహించుకొంది.
ఒకసారి ఆమె షిరిడీ లో ఉన్నపుపుడు ఆమెకు కళ్ళు నొప్పిగా ఉండి కళ్ళంబట నీరు కూడా కారసాగింది.
ఇలా కొంత సేపు బాధపడింది. అపుడామె మసీదుకు వెళ్ళి బాబా ముందు కూర్చొంది. బాబా ఆమె వంక చూశారు. ఆయన దృష్టి ఆమె మీద పడగానే విచిత్రంగా కళ్ళనొప్పి తగ్గి పోయి నీరు కారడం కూడా ఆగిపోయింది.
ఒకరోజు ఆమె మసీదులో బాబా ముందు కూర్చొని ఉండగా, ఒక కుష్టురోగి వచ్చాడు.
అప్పటికే అతని వ్యాధి బాగా ముదిరిపోయి ఉంది. అతని శరీరం నుండి దుర్గంధం వస్తూ ఉంది. అతనిలో శక్తి సన్నగిల్లింది.
అతి కష్టం మీద మెల్లగా మసీదు మూడు మెట్లు ఎక్కి బాబా వద్దకు వచ్చి ఆయన పాదాల వద్ద తన తలను ఆనించాడు.
బాబాని దర్శిస్తూ ఎక్కువ సమయం అక్కడే ఉన్నాడు. అతను అక్కడ ఉన్నంత సేపూ ఆమెకు అతని నుంచి రోతకలిగేలా దుర్గంధం వస్తూనే ఉంది. అతను తొందరగా అక్కడినుండి వెళ్ళిపోతే బాగుండును అని ఆమె మనసులో అనుకొంది.
ఆతరువాత అతను ఒక మురికి గుడ్డలో చుట్టిపెట్టి ఉన్న చిన్న పొట్లం పట్టుకొని నెమ్మదిగా క్రిందకి దిగి వెళ్ళాడు. ఆమె హమ్మయ్యా రక్షించావు దేవుడా అని మనసులో అనుకొని వెంటనే ఉపశమనం పొందింది. ఆకుష్టువాడు అక్కడినుండి వెళ్ళగానే బాబా ఒక్కసారి ఆమె వంక చూశారు.
తన మనసులోని ఆలోచనలను బాబా అప్పటికే గ్రహించేశారని ఆమెకు అర్ధమయింది. కుష్టువాడు యింకా ముందుకు వెడుతూ ఉండగా బాబా మసీదులో ఒకరిని ఆకుష్టువాడిని తిరిగి వెనుకకు తీసుకొని రమ్మని పంపించారు.
మరలా ఆకుష్టువాడు వచ్చి యింతకు ముందులాగే నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. అతను వస్తున్నంత సేపు అతని శరీరం నుండి దుర్గంధం వ్యాపిస్తూనే ఉంది. అతను మెల్లగా వంగి బాబాకు నమస్కరించాడు.
బాబా అతని వద్ద ఉన్న పొట్లం తీసుకొని అదేమిటని అడుగుతూ విప్పి చూశారు. అందులో కొన్ని పేడాలు ఉన్నాయి. బాబా ఒక పేడా తీసి, అక్కడ మసీదులో ఉన్నవారికెవరికీ కాకుండా ఆమెకి మాత్రమే యిచ్చి తినమన్నారు.
కంపుకొడుతూ ఉన్న ఒక కుష్టురోగి తెచ్చిన ఆపేడాను ఎలాగ తినడం అనే గందరగోళంలో పడింది ఆమె.
కాని అది బాబా ఆజ్ఞ. జవదాటడానికి వీలు లేదు. బాబా ఆజ్ఞను శిరసా వహించి ఆమె ఆపేడాను తింది. బాబా మరొక పేడాను తీసుకొని తిని మిగిలినవి అతనికిచ్చి పంపించేశారు.
బాబా మరలా అతనిని ఎందుకని పిలిచారు? పేడా అమెకొక్కదానికే ఎందుకిచ్చారన్నది అక్కడున్నవారెవరికీ అర్ధం కాలేదు.
కాని, బాబా తన ఆలోచనలను పూర్తిగా చదివినట్లు ఆమెకు బాగా అర్ధమయింది. పరిశుభ్రత, పారిశుధ్ద్యం గురించి ఆమెకున్నటువంటి సొంత అభిప్రాయాల కన్నా బాబా పై పూర్తి విశ్వాసముంచి, వినయం, సానుభూతి, ఓర్పు, వీటి విలువలను పాటించాలని ఆమెకు ఒక మంచి గుణపాఠం చెప్పాలనుకొన్నారు.
బాబా సమక్షంలో ఎవరికీ ఎటువంటి ఆపదా రాదనే అత్యున్నతమైన సిద్ధాంతాన్ని ఈ సంఘటన ఋజువు చేస్తుంది.
ఒకసారి తారాబాయి, భర్త సదాశివ్ తో కలిసి షిరిడీ వెళ్ళారు. వారితో కూడా వారి పనివాడు కూడా ఉన్నడు.
ఆతను ఎంతో కాలం నుంచీ నడుము వద్ద విపరీతమయిన నొప్పితో బాధపడుతున్నాడు. సదాశివ బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినపుడు అక్కడ యింకా యితర భక్తులు కూడా ఉన్నారు.
వెంటనే బాబా తనకి కాలు బాగా నొప్పిగా ఉందని చెప్పారు. లెండీబాగ్ నుండి కొన్ని కలబంద ఆకులను తెచ్చి వాటిని రెండుగా చేసి కాస్త వెచ్చ చేసి బాగా నొప్పిగా ఉన్నచోట ఆ ఆకులను పెడితే నొప్పి తగ్గిపోతుందని అక్కడ ఉన్న భక్తులలో ఒకరికి చెప్పారు.
సదాశివకి బాబా వివరించినదంతా తమ గురించేనని అర్ధమయింది. బాబాగారు సూచించిన ప్రకారం తమ పనివాడికి నడుము ప్రాంతంలో కలబంద ఆకులను కట్టారు. వెంటనే అతనికి నొప్పి తగ్గిపోయింది.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు–Taarkad-24
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 6వ. భాగము–Audio
- సాయి కధలు ఎన్ని సార్లు చదివిన అమృతం వాలే మధురంగా ఉంటాయి–V. Tarkad-26–Audio
- ఒక ముసలమ్మపై బాబా చూపిన కరుణ
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు రెండవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments